iDreamPost
android-app
ios-app

పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన BCCI? ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి..

  • Published Jul 11, 2024 | 11:54 AM Updated Updated Jul 11, 2024 | 11:54 AM

Champions Trophy 2025, IND vs PAK, BCCI: పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా పాల్గొనడంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు షాక్‌ ఇస్తూ.. బీసీసీఐ ఐసీసీకి ఒక రిక్వెస్ట్‌ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Champions Trophy 2025, IND vs PAK, BCCI: పాకిస్థాన్‌ వేదికగా వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగే ఛాంపియన్స్‌ ట్రోఫీలో ఇండియా పాల్గొనడంపై బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. పాకిస్థాన్‌కు షాక్‌ ఇస్తూ.. బీసీసీఐ ఐసీసీకి ఒక రిక్వెస్ట్‌ చేసింది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jul 11, 2024 | 11:54 AMUpdated Jul 11, 2024 | 11:54 AM
పాకిస్థాన్‌కు భారీ షాకిచ్చిన BCCI? ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి..

టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచి ఫుల్‌ హ్యాపీగా ఉన్న టీమిండియా ముందున్న నెక్ట్స్‌ టార్గెట్‌ ఛాంపియన్స్‌ ట్రోఫీ. వచ్చే ఏడాది ఫిబ్రవరీలో పాకిస్థాన్‌ వేదికగా ఈ ప్రతిష్టాత్మక ఐసీసీ టోర్నీ జరగనుంది. 2013లో మహేంద్ర సింగ్‌ ధోని కెప్టెన్సీలో ఈ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచిన భారత జట్టు మళ్లీ ఆ ట్రోఫీని ముద్దాడలేదు. టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన ఊపులో ఉన్న టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఇదే ఊపులో రానున్న ఛాంపియన్స్‌ ట్రోఫీని కైవసం చేసుకోవాలని పట్టుదలతో ఉన్నాడు. దాని కోసం ఇప్పటి నుంచే ప్రణాళికలు కూడా సిద్ధం చేస్తున్నాడు. అయితే.. ఛాంపియన్స్‌ ట్రోఫీకి ఆతిథ్యం ఇస్తున్న పాకిస్థాన్‌కు బీసీసీఐ షాకిచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

కొన్నేళ్లుగా టీమిండియా పాకిస్థాన్‌లో పర్యటించడం లేదనే విషయం తెలిసిందే. రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినడంతో పాటు, పాకిస్థాన్‌లో టీమిండియా భద్రతపై బీసీసీఐ ఆందోళన వ్యక్తం చేస్తుండటంలో భారత జట్టును పాకిస్థాన్‌కు పంపించడం లేదు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సిరీస్‌లు లేక చాలా కాలం అయిపోయింది. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే ఇండియా, పాకిస్థాన్‌ జట్లు తలపడుతున్నాయి. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే అదో మినీ యుద్ధమే. క్రికెట్‌ అభిమానులు భారత్‌-పాక్‌ మ్యాచ్‌ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ ఫ్యాన్స్‌ టీవీలకు అతుక్కుపోయే మ్యాచ్‌ అంటే అది ఇండియా వర్సెస్‌ పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచే.

అయితే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం టీమిండియా తమ దేశానికి రావాలని పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో పాటు ఆ దేశ క్రికెట్‌ అభిమానులు కూడా బలంగా కోరుకుంటున్నారు. కానీ, బీసీసీఐ మాత్రం టీమిండియాను అక్కడికి పంపేందుకు ఇప్పటికీ సుముఖంగా లేదు. ఇప్పటికే పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు ఛాంపియన్స్‌ ట్రోఫీ డ్రాఫ్ట్‌ షెడ్యూల్‌ను బీసీసీఐకి పంపింది. 2025 మార్చి 1న లాహోర్‌ వేదికగా ఇండియా-పాకిస్థాన్‌ మ్యాచ్‌ను నిర్వహిస్తామని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా అవసరమైతే టీమిండియా ఆడే అన్ని మ్యాచ్‌లు లాహోర్‌లోనే నిర్వహిస్తామని తెలిపింది. అయినా కూడా బీసీసీఐ.. ఒప్పుకోవడం లేదు. ఛాంపియన్స్‌ ట్రోఫీ నుంచి టీమిండియా ఆడే మ్యాచ్‌లను వేరు చేయాలని.. భారత్‌ ఆడే మ్యాచ్‌లు దుబాయ్‌ లేదా శ్రీలంకలో నిర్వహించాలని బీసీసీఐ ఇప్పటికే ఐసీసీని కోరింది. ఒక వేళ టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఆడేందుకు పాకిస్థాన్‌కు వెళ్లకుంటే మాత్రం.. ఆ దేశ క్రికెట్‌ బోర్డుకు భారీ నష్టం వచ్చే అవకాశం ఉంది. టీమిండియాపై పీసీబీ భారీ ఆశలు పెట్టుకుంది. కానీ, బీసీసీఐ మాత్రం పీసీబీ షాక్‌ ఇచ్చేలా ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.