India vs South Africa: ద్రవిడ్​ను ఇంత సీరియస్​గా ఎప్పుడూ చూసుండరు.. అసలేం జరిగిందంటే..?

భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఎంత టెన్షన్ ఉన్నా బయటపడకుండా కూల్​గా ఉంటాడు. అలాంటోడు సడన్​గా సీరియస్ మోడ్​లోకి వెళ్లడంతో ఏమైందని అందరూ షాకవుతున్నారు.

భారత హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ ప్రశాంతంగా ఉంటాడు. ఎంత టెన్షన్ ఉన్నా బయటపడకుండా కూల్​గా ఉంటాడు. అలాంటోడు సడన్​గా సీరియస్ మోడ్​లోకి వెళ్లడంతో ఏమైందని అందరూ షాకవుతున్నారు.

సౌతాఫ్రికా టూర్​ను ఘనంగా స్టార్ట్ చేయాలనుకున్న టీమిండియాకు ఆడిన తొలి మ్యాచ్​లోనే షాక్ తగిలింది. సఫారీ పర్యటనలో భాగంగా మొదలైన టీ20 సిరీస్​లో భారత్​కు మంచి ఆరంభం దక్కలేదు. వర్షం కారణంగా ఫస్ట్ మ్యాచ్ రద్దవగా.. రెండో మ్యాచ్​కూ వరుణుడు అడ్డు తగిలాడు. అయితే ఎట్టకేలకు డక్​వర్త్ లూయిస్ పద్ధతిలో మ్యాచ్​ను కంప్లీట్ చేశారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్​కు దిగిన సూర్యకుమార్ సేనకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఇద్దరు ఓపెనర్లు శుబ్​మన్ గిల్ (0), యశస్వి జైస్వాల్ (0) గోల్డెన్ డక్​లుగా వెనుదిరిగారు. దీంతో ఇన్నింగ్స్​ను నిర్మించాల్సిన బాధ్యత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీద పడింది. ఓపెనర్లు వెనుదిరిగినా ఏమాత్రం తొణకకుండా ఎప్పటిలాగే అటాకింగ్​ గేమ్​తో సౌతాఫ్రికా బౌలర్లను చితగ్గొట్టాడు సూర్య.

స్ట్రయిక్ రొటేట్ చేస్తూనే అవకాశం దొరికిన ప్రతిసారి ఫోర్లు, సిక్సులు కొడుతూ భారత్​ను నిలబెట్టాడు సూర్య (39 బంతుల్లో 68). అతడికి తిలక్ వర్మ (29) మంచి సహకారం అందించాడు. ఆ తర్వాత తిలక్ ఔటైనా రింకూ సింగ్ (68 నాటౌట్) కెప్టెన్​గా సపోర్ట్​గా నిలబడ్డాడు. అనంతరం సూర్య పెవిలియన్​కు చేరుకున్నా రింకూ మాత్రం ఆఖరి వరకు నిలబడి టీమ్​కు భారీ స్కోరును అందించాడు. అతడు కొట్టిన ఓ బాల్ ఏకంగా మీడియా బాక్స్​ అద్దాలను బద్దలు కొట్టడం విశేషం. వాన కారణంగా సౌతాఫ్రికా టార్గెట్​ను 15 ఓవర్లలో 152గా నిర్దేశించారు. ఓపెనర్ హెండ్రిక్స్ (49), మార్​క్రమ్ (30) రాణించడంతో ఆ టీమ్ 5 వికెట్లు కోల్పోయి 13.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో మిల్లర్ (17), స్టబ్స్ (14 నాటౌట్) ఒత్తిడిలోనూ నిలబడి మ్యాచ్​ను ఫినిష్ చేశారు.

సెకండ్ టీ20 టైమ్​లో స్టేడియంలో జరిగిన ఓ ఘటన అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. టీమిండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఎప్పుడూ కూల్​గా ఉంటాడనేది తెలిసిందే. ప్లేయర్​గా క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఇప్పుడు కోచ్​గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నా అతడు తన ప్రశాంతతను ఎప్పుడూ కోల్పోలేదు. కానీ ఎన్నడూ లేనిది ఈ మ్యాచ్​లో సీరియస్​గా కనిపించాడు ది వాల్. అంపైర్​తో సీరియస్​గా మాట్లాడుతూ.. గ్రౌండ్​ మీద చేతులతో చరుస్తూ కనిపించాడు. దీంతో అసలు ఏమైందో తెలియక అందరూ కన్​ఫ్యూజ్ అవుతున్నారు. అయితే ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇచ్చిన గ్రౌండ్​ నచ్చకే ఆయన ఇలా బిహేవ్ చేసినట్లు తెలుస్తోంది.

రెండో టీ20కి ఆతిథ్యం ఇచ్చిన సెయింట్ జార్జ్స్‌ ఓవల్ గ్రౌండ్​లో ఔట్​ ఫీల్డ్ సరిగ్గా లేదు. ఆలెడ్రీ వర్షం, తేమ వల్ల బాల్ బాగా తడిసిపోవడంతో బౌలర్లకు దాని మీద పట్టు దొరకలేదు. బౌలింగ్ చేస్తున్నప్పుడు వాళ్ల చేతుల్లో నుంచి బాల్ జారిపోయింది. ఫీల్డర్లు కూడా బాల్​ను పట్టేందుకు ఇబ్బందులు పడ్డారు. మరోవైపు ఔట్​ఫీల్డ్ మీద ఉన్న తేమను సరిగ్గా రిమూవ్ చేయకపోవడంతో అక్కడ పడితే చాలు బాల్ బౌండరీకి వేగంగా దూసుకుపోయింది. దీంతో ఇది చూసిన భారత కోచ్ అంపైర్ మీద సీరియస్ అయ్యాడు. ఔట్​ఫీల్డ్ కారణంగానే మ్యాచ్ ఓడిపోవడంతో అక్కడ తన చేతులతో తేమను చూపిస్తూ సీరియస్ అయ్యాడు. ద్రవిడ్ సీరియస్ అయిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇది చూసిన ఫ్యాన్స్ గ్రౌండ్ స్టాఫ్​, అంపైర్లు, నిర్వాహకులదే తప్పంటూ ఫైర్ అవుతున్నారు. వాళ్ల నిర్లక్ష్యం వల్లే భారత్ ఓడిపోయిందని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. అంపైర్​పై ద్రవిడ్ సీరియస్ అవ్వడం మీద మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Mohammed Shami: షమీకి భారత దేశ రెండో అత్యున్నత క్రీడా పురస్కారం! త్వరలోనే గుడ్ న్యూస్?

Show comments