iDreamPost
android-app
ios-app

టీమిండియాకు హెడ్‌ కోచ్‌ అయిఉండి కూడా ద్రవిడ్‌ సింప్లిసిటీ! ఇదీ అసలైన దేశభక్తి!

  • Published Apr 26, 2024 | 2:55 PM Updated Updated Apr 26, 2024 | 2:55 PM

Rahul Dravid, Elections 2024: టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌.. ఒక కామన్‌ మ్యాన్‌లా మారి తన దేశభక్తిని చాటుకున్నారు. దీంతో ఆయన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ద్రవిడ్‌ ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

Rahul Dravid, Elections 2024: టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉన్న రాహుల్‌ ద్రవిడ్‌.. ఒక కామన్‌ మ్యాన్‌లా మారి తన దేశభక్తిని చాటుకున్నారు. దీంతో ఆయన ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇంతకీ ద్రవిడ్‌ ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

  • Published Apr 26, 2024 | 2:55 PMUpdated Apr 26, 2024 | 2:55 PM
టీమిండియాకు హెడ్‌ కోచ్‌ అయిఉండి కూడా ద్రవిడ్‌ సింప్లిసిటీ! ఇదీ అసలైన దేశభక్తి!

రాహుల్‌ ద్రవిడ్‌ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. దిగ్గజ మాజీ క్రికెటర్‌గా, ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌గా.. దేశానికి ఎంతో చేస్తున్న గొప్ప ఆటగాడు. పైగా ద్రవిడ్‌ వ్యక్తిత్వం చూసి కూడా చాలా మంది ఆయనను అమితంగా అభిమానిస్తారు. ఎవరితో విభేదాలు, వివాదాలు లేని.. క్రికెటర్‌గా ద్రవిడ్‌కు మంచి పేరుంది. అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పిన తర్వాత.. టీమిండియా క్రికెట్‌కు మరింత సేవ చేయాలనే ఉద్దేశంలో అండర్‌ 19 టీమ్‌కు కోచ్‌గా చాలా కాలం పనిచేసి.. తర్వాత నేషనల్ క్రికెట్‌ అకాడమీకి డైరెక్టర్‌గా వ్యవహరించి.. తర్వాత టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టాడు. ఇలా అంచెలంచెలుగా టీమిండియాను నిర్మించుకుంటూ వచ్చాడు.

ద్రవిడ్‌ కోచింగ్‌లోనే టీమిండియా వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందో చూశాం. ఒక్క ఫైనల్‌ మ్యాచ్‌ మినహాయిస్తే.. టోర్నీ మొత్తం ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. టీమిండియా లాంటి ప్రపంచంలోనే పెద్దగా టీమ్‌కు హెచ్‌ కోచ్‌గా ఉన్న ద్రవిడ్‌ తాజాగా తన సింప్లిసిటీని చాటుకున్నాడు. ఆయన చేసిన పని చూసి.. క్రికెట్‌ అభిమానులతో పాటు, నెటిజన్లు సైతం ఇది కదా అసలైన దేశభక్తి అంటూ ద్రవిడ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇంతకీ ద్రవిడ్‌ ఏం చేశాడో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి నెలకొంది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే తొలి విడత లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ కూడా ముగిసింది. కర్ణాటకకు చెందిన ద్రవిడ్‌ ఒక కామన్‌ మ్యాన్‌లా క్యూలైన్‌లో చాలా సేపు నిల్చోని మరి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. భారత దేశ పౌరుడిగా ఓటు హక్కు వినియోగించుకోవడం మన బాధ్యత, ఆ విషయాన్ని కేవలం మాటల్లో కాకుండా ఇలా చేతల్లో చూపిస్తున్న ద్రవిడ్‌పై క్రికెట్‌ ఫ్యాన్స్‌ ప్రశంసలు కురిస్తున్నారు. ద్రవిడ్‌ స్ఫూర్తితో తాము కూడా ఓటు హక్కు వినియోగించుకుంటాం అంటూ ప్రతిజ్ఞ చేస్తున్నారు. అయితే.. చాలా మంది సెలబ్రెటీలు కొంచెం పాపులారిటీ రాగానే ఓటు వేసుందుకు టైమ్‌ లేదు అన్నంతగా ఫోజ్‌ కొడుతుంటారని కానీ, టీమిండియాకు హెడ్‌ కోచ్‌గా ఉన్నా.. ద్రవిడ్‌ తన ఓటును ఓ కామన్‌ మ్యాన్‌లా వినియోగించుకోవడం నిజం అభినందించాల్సిన విషయమే. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.