T20 World Cup: రేపే పాకిస్థాన్‌తో మ్యాచ్‌! టీమిండియా ముందున్న సవాళ్లు ఇవే!

T20 World Cup: రేపే పాకిస్థాన్‌తో మ్యాచ్‌! టీమిండియా ముందున్న సవాళ్లు ఇవే!

India vs Pakistan, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ కోసం అంతా సిద్ధమైంది. అయితే.. పాక్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాను ఓ విషయం కలవరపెడుతోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

India vs Pakistan, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ కోసం అంతా సిద్ధమైంది. అయితే.. పాక్‌తో మ్యాచ్‌కి ముందు టీమిండియాను ఓ విషయం కలవరపెడుతోంది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో భాగంగా పాకిస్థాన్‌తో టీమిండియా రేపు(జూన 9 ఆదివారం) మ్యాచ్‌ ఆడనుంది. అమెరికాలోని న్యూయార్క్‌లో నూతనంగా నిర్మించిన నసావు కౌంటీ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఈ మ్యాచ్‌ జరగనుంది. భాతర కాలమాన ప్రకారం రాత్రి 8 గంటలకు మ్యాచ్‌ ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇండియా పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌ అంటే ఉండే క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య క్రికెట్‌ మ్యాచ్‌ అంటే.. ఇరు దేశాల క్రికెట్‌ అభిమానులకు అది పండుగ అనే చెప్పాలి. అలాగే ఇరు జట్లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది. ఆ ప్రెజర్‌ను హ్యాండిల్‌ చేసిన జట్టే గెలుస్తుంది. అయితే.. పాక్‌తో మ్యాచ్‌కి ముందు ఇండియాను కలవరపెడుతున్న కొన్ని అంశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌-పాక్‌ మ్యాచ్‌లో టీమిండియానే హాఫ్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుంది. పసికూన ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విజయంతో రోహిత్‌ సేన ఉత్సాహంగా బరిలోకి దిగుతుంది. కానీ, మరోవైపు పాకిస్థాన్‌ పరిస్థితి వేరేలా ఉంది. ఆ జట్టు ఇటీవల పసికూనలకే పసికూన, అసోసియేట్‌ టీమ్‌ యూఎస్‌ఏ చేతిలో చిత్తుగా ఓడిపోయింది. మ్యాచ్‌ సూపర్‌ ఓవర్‌ వరకు వెళ్లినా.. అమెరికాను ఓడించలేకపోయింది పాకిస్థాన్‌. ఈ ఓటమి పాక్‌ జట్టులో నైరాష్యం నింపింది. అమెరికా లాంటి చిన్న టీమ్‌పై ఓటమితో పాక్‌ జట్టుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తీవ్ర నిరాశలో ఉన్న ఆ జట్టు ఇప్పుడు పటిష్టమైన ఇండియాతో తలపడాల్సిన రావడం ఇబ్బందిగా మారింది. కానీ, పాక్‌ను మరీ అంత తక్కువ అంచనా వేయకూడదు. ఎప్పుడు ఎలా ఆడుతుందో ఆ జట్టుకే తెలియదు.

మరోవైపు టీమిండియా ఓపెనింగ్‌ సమస్యతో ఇబ్బంది పడుతోంది. కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు రెగ్యులర్‌ ఓపెనింగ్‌ పార్ట్నర్‌గా ఉన్న యశస్వి జైస్వాల్‌ ఫామ్‌లో లేకపోవడంతో.. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీని ఓపెనర్‌గా దింపారు. కానీ కోహ్లీ ఒక్క పరుగు మాత్రమే చేసి అవుట్‌ అయ్యాడు. ​వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌ల కంటే ముందు బంగ్లాదేశ్‌తో ఆడిన వామప్‌ మ్యాచ్‌లో సంజు శాంసన్‌ను ఓపెనర్‌గా ఆడించినా అతనూ విఫలం అయ్యాడు. దీంతో.. టీమిండియాకు ఓపెనింగ్‌ సమస్య ఉంది. ఈ సమస్యను అధిగమిస్తే టీమిండియాను ఆపడం పాకిస్థాన్‌ తరం కాదని క్రికెట్‌ అభిమానులు అంటున్నారు. అయితే.. పాక్‌తో మ్యాచ్‌లో కూడా ఐర్లాండ్‌తో ఆడిన టీమ్‌తోనే టీమిండియా బరిలోకి దిగే సూచనలు కనిపిస్తున్నాయి. మరి పాక్‌పై టీమిండియా ఎంత మార్జిన్‌తో విజయం సాధిస్తుందని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments