IND vs BAN: చెన్నై చేరుకున్న టీమిండియా.. గెలుపే లక్ష్యంగా ప్రాక్టిస్!

IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌ టీమిండియాల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే చెన్నై చేరుకుంది.

IND vs BAN: సెప్టెంబర్ 19 నుంచి బంగ్లాదేశ్‌ టీమిండియాల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ స్టార్ట్ కాబోతుంది. ఈ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే చెన్నై చేరుకుంది.

బంగ్లాదేశ్‌తో టీమిండియా పోరుకి సిద్ధం అయ్యింది. సెప్టెంబర్ 19 నుంచి ఈ రెండు టీంల మధ్య రెండు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ స్టార్ట్ కాబోతుంది. ఇక ఈ సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే చెన్నై చేరుకుంది. హెడ్ కోచ్ గా గౌతమ్ గంభీర్, బౌలింగ్ కోచ్ గా మోర్నీ మోర్కెల్‌లు బాధ్యతలు తీసుకున్నారు. కోచ్ లుగా ఇది వారికి మొదటి టెస్ట్ సిరీస్. అందువలన జట్టుని ఎలాగైనా గెలిపించే విధంగా కోచింగ్ ఇవ్వాలని వారు లక్ష్యం పెట్టుకున్నారు. మొదటి మ్యాచ్ ఎం. చిదంబరం స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ సెప్టెంబర్ 27 నుంచి కాన్పూర్‌లో జరగబోతోంది. ఇక శుక్రవారం నాడు ప్రాక్టీస్ సెషన్‌కు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ఇక బంగ్లాదేశ్ కూడా ప్రస్తుతం మంచి ఫాంలో ఉంది.రెట్టించిన ఉత్సాహంతో ఉంది. ఈమధ్యనే పాకిస్థాన్‌ను ఓడించి బంగ్లాదేశ్ చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ టెస్టు సిరీస్‌లో బంగ్లాదేశ్ పాకిస్తాన్ ని చిత్తుగా ఓడించిందనే చెప్పాలి. 0-2 తేడాతో పాకిస్థాన్‌పై బంగ్లాదేశ్ ఘన విజయం సాధించింది. మొదటి టెస్టులో బంగ్లాదేశ్ 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇక రెండో టెస్టులో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. అందువల్ల ఇప్పుడు చాలా ఆత్మ విశ్వాసంతో ఉంది బంగ్లా జట్టు. అదే నమ్మకంతో ఇండియాపై కూడా అలాంటి విజయాన్ని సాధించాలని బంగ్లాదేశ్ భావిస్తుంది.

ఇక తాజాగా విరాట్ కోహ్లీ కూడా జట్టులో చేరాడు. ఆయన లండన్ నుంచి నేరుగా చెన్నై చేరుకున్నారు. ఇంకా జస్ప్రీత్ బుమ్రా, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్ వంటి ఆటగాళ్ళు కూడా గురువారం నాడు చెన్నైకి చేరుకున్నారు. నెల రోజులకు పైగా విశ్రాంతి తీసుకున్న మన ఆటగాళ్ళు తిరిగి మైదానంలోకి దిగుతున్నారు. బంగ్లాదేశ్ సూపర్ ఫాంలో ఉంది కాబట్టి ప్రాక్టిస్ గట్టిగా చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. ఈ మ్యాచ్ లో ఆత్మ విశ్వాసంలో ఉన్న బంగ్లాదేశ్ ని వైట్ వాష్ చేసే విధంగా ప్రాక్టీస్ చెయ్యాలని ఫిక్స్ అయ్యారు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో టీం ఇండియా నెంబర్ వన్ స్థానంలో ఉంది. టీం ఇండియా 74 పాయింట్లతో 68.52 శాతంతో అగ్రస్థానంలో ఉండగా బంగ్లాదేశ్ 33 పాయింట్లతో 45.83 శాతంతో నాలుగో స్థానంలో ఉంది. మరి టీం ఇండియా బంగ్లాతో తలబడబోయే ఈ టెస్ట్ సిరీస్ పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.

Show comments