SNP
Sarfaraz Ahmed, Beef: భారత క్రికెటర్లంతా ఆవు మాంసం తినడం తాను చూశానంటూ.. పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
Sarfaraz Ahmed, Beef: భారత క్రికెటర్లంతా ఆవు మాంసం తినడం తాను చూశానంటూ.. పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్, మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. వాటికి సంబంధించి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం..
SNP
టీమిండియా క్రికెటర్లంతా బీఫ్(ఆవు మాంసం) తిన్నారంటూ ఓ పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం ఆ పాక్ క్రికెటర్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాను ఊపేస్తున్నాయి. ఇండియాలో హిందువులు చాలా మంది ఆవులను గోమాతగా పూజిస్తారు. దీంతో వారు బీఫ్‌ని తినరు. కొంతమంది అసలు మాంసాహారమే ముట్టుకోరు. కానీ, టీమిండియా క్రికెటర్లు బీఫ్ తిన్నారంటూ పాకిస్థాన్ వెటరన్ క్రికెటర్ సర్ఫరాజ్ అహ్మద్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. దీంతో.. చాలా మంది క్రికెట్ అభిమానులు, నెటిజన్లు ఈ వీడియోపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంతకీ సర్ఫరాజ్ ఏం అన్నాడో వివరంగా తెలుసుకుందాం..
ఒక ఇంటర్వ్యూలో సర్ఫరాజ్ మాట్లాడుతూ..‘సౌరవ్ గంగూలీని ఇండియాలో అంతా దాదా.. దాదా అని పిలుస్తుంటారు. 2008లో భారత జట్టు పాకిస్థాన్ పర్యటనకు వచ్చింది. ఆ టైమ్‌లో మొహమ్మద్ యూసుఫ్(పాకిస్థాన్ మాజీ క్రికెటర్) కూడా పాకిస్థాన్ టీమ్‌లో భాగంగా ఉన్నారు. నేను ఆయన గదికి సమయంలో టీమిండియా క్రికెటర్లంతా కోర్మా బిర్యాణి(బీఫ్ బిర్యాణి) తినడం చూశా.’ అంటూ తెలిపాడు. అయితే.. అందులో ఎవరెవరు ఉన్నారన్న విషయం మాత్రం చెప్పలేదు. పర్టిక్లర్‌గా పేర్లు బయటపెట్టకపోవడంతో ఎవరెవరు తిన్నారనే విషయం తెలియలేదు. కానీ, టీమ్ మొత్తం అన్నట్లు మాత్రం సర్ఫరాజ్ పేర్కొన్నాడు.
ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రూమ్‌లోకి వెళ్లి చూసినప్పుడు పాకిస్థాన్ క్రికెటర్లు, టీమిండియా ప్లేయర్లు కలిసి భోజనం చేయడం చూసిన సర్ఫరాజ్.. ఎవరు ఏం తింటున్నారో ఎలా చెప్తున్నాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఏదో సంచలనం కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేశాడని, అప్పటి టీమిండియాలో చాలా మంది శాఖాహారులే ఉన్నారంటూ భారత క్రికెట్ అభిమానులు క్రికెటర్లకు మద్దతుగా నిలుస్తున్నారు. అయితే.. ఈ వీడియో ఇప్పటి కాదు. ఏడాది క్రితానికి కానీ, బాగా వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బాలీవుడ్ లెజెండ్ బిగ్‌బీ అబితాబ్ బచ్చన్ కూడా బీఫ్ తింటారని సర్ఫరాజ్ వెల్లడించాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.