iDreamPost
android-app
ios-app

Rohit-Kohli: సౌతాఫ్రికాకు అగార్కర్.. రోహిత్, కోహ్లీ భవిష్యత్ పై కీలక నిర్ణయం!

  • Published Jan 03, 2024 | 11:30 AM Updated Updated Jan 03, 2024 | 11:30 AM

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా మరికొంత మంది దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు సమాచారం. అక్కడే రోహిత్, కోహ్లీల టీ20 భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా మరికొంత మంది దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు సమాచారం. అక్కడే రోహిత్, కోహ్లీల టీ20 భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.

Rohit-Kohli: సౌతాఫ్రికాకు అగార్కర్.. రోహిత్, కోహ్లీ భవిష్యత్ పై కీలక నిర్ణయం!

గత కొంతకాలంగా టీమిండియాలో ఓ ప్రశ్న.. ప్రశ్నగానే మిగిలిపోయింది. ఆ మిస్టరీ క్వశ్చన్ ఏంటంటే? వచ్చే టీ20 వరల్డ్ కప్ లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు ఆడతారా? లేదా? అదీకాక అసలు వీరిద్దరు పొట్టి ఫార్మాట్ లో కొనసాగుతారా? లేక రిటైర్మెంట్ ప్రకటిస్తారా? ఈ ప్రశ్నలు ఇప్పుడు ప్రపంక క్రికెట్ లో చర్చనీయాంశంగా మారాయి. అయితే వీటికి సమాధానాలు త్వరలోనే తెలిసే అవకాశం ఉంది. తాజాగా సఫారీతో జరిగే రెండో టెస్ట్ మ్యాచ్ ను చూడ్డానికి టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తో పాటుగా మరికొంత మంది దక్షిణాఫ్రికా చేరుకున్నట్లు సమాచారం. అక్కడే రోహిత్, కోహ్లీల టీ20 భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

మరికొన్ని నెలల్లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కాబోతోంది. అందులో భాగంగా ఇప్పటి నుంచే టీమిండియా ప్రణాళికలు స్టార్ట్ చేసింది. అయితే ఈ మెగాటోర్నీ ఆరంభానికి ముందు భారత జట్టు ముందు కొన్ని ప్రశ్నలు మిగిలి ఉన్నాయి. వచ్చే పొట్టి ప్రపంచ కప్ కు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు అందుబాటులో ఉంటారా? ఉండరా? ఈ విషయంపై క్లారిటీ తెచ్చేందుకు టీమిండియా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ సౌతాఫ్రికా చేరుకున్నట్లు తెలుస్తోంది. ఈ మెగాటోర్నీకి ముందు ఆఫ్గానిస్తాన్ జరిగే టీ20 సిరీస్ కు జట్టును ప్రకటించే అంశంపై హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో చర్చలు జరపనున్నారని సమాచారం. ఈ సమావేశంలో ఈ సీనియర్ క్రికెటర్ల భవిష్యత్ పై కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. వారు ఏ డెసిషన్ తీసుకుంటారా? అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు క్రికెట్ లవర్స్.

Important decision on Rohit and Kohli's future!

ఇదిలా ఉండగా.. 2022 టీ20 వరల్డ్ కప్ తర్వాత రోహిత్, కోహ్లీలు ఒక్క ఇంటర్నేషనల్ టీ20 కూడా ఆడలేదన్న విషయం మనందరికి తెలిసిందే. అయితే ఆఫ్గాన్ తో సిరీస్ కు కెప్టెన్ ఎవరు? అన్నది ఇప్పడు ఆసక్తిగా మారింది. ప్రస్తుతం టీ20 కెప్టెన్ గా ఉన్న సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలు గాయం కారణంగా జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. దీంతో సారథిగా ఎవరిని నియమిస్తారు అన్నదానిపై ఆసక్తి ఏర్పడింది. అయితే రోహిత్ శర్మనే కెప్టెన్ గా కొనసాగించేందుకు బీసీసీఐ చూస్తోందని, ఇందుకు హిట్ మ్యాన్ కూడా అంగీకరించాడని సమాచారం. మరి చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ తో సమావేశం తర్వాత ఏ నిర్ణయం తీసుకుంటాడో అని అందరూ వేయికళ్ళతో ఎదురుచూస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.