iDreamPost
android-app
ios-app

అగార్కర్‌కు భారీ జీతం! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు!

  • Published Jul 05, 2023 | 3:03 PM Updated Updated Jul 05, 2023 | 3:03 PM
  • Published Jul 05, 2023 | 3:03 PMUpdated Jul 05, 2023 | 3:03 PM
అగార్కర్‌కు భారీ జీతం! ఎంతో తెలిస్తే షాక్‌ అవుతారు!

టీమిండియా సెలెక్షన్‌ కమిటీ ఛైర్మన్‌గా నియమితుడైన భారత మాజీ క్రికెటర్‌ అజిత్‌ అగార్కర్‌కు బీసీసీఐ భారీ జీతాన్ని ఆఫర్‌ చేసింది. గతంలో ఏ సెలెక్టర్‌కు కూడా ఇంత భారీ జీతం ఇవ్వలేదు. అగార్కర్‌ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఇంతమొత్తం ఇవ్వనున్నట్లు సమాచారం. చేతన్‌ శర్మ చీఫ్‌ సెలెక్టర్‌ పదవికి రాజీనామా చేసిన తర్వాత ఆ పోస్టు కోసం చాలా మంది దరఖాస్తు చేసుకున్నా.. సులక్షణ నాయక్, అశోక్ మల్హోత్రా, జతిన్ పరాజంపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ(సీఏసీ) అజిత్ అగార్కర్‌ను ఫైనల్‌ చేసింది.

చీఫ్ సెలెక్టర్‌గా ఎంపికైన అగార్కర్‌కు రూ.3 కోట్ల వార్షిక వేతనం అందనుంది. అగార్కర్ ముందు వరకు చీఫ్‌ సెలెక్టర్‌గా పని చేసిన చేతన్‌ శర్మ వార్షిక వేతనంగా కేవలం ఒక కోటి మాత్రమే అందుకున్నారు. కానీ అగార్కర్‌ కోసం ఆ మొత్తాన్ని భారీగా పెంచారు. ఈ పెంపు గురించి బీసీసీఐ అధికారిక ప్రకటన చేయకపోయినా.. వార్త బయటికి వచ్చింది. కేవలం కోటీ జీతం మాత్రమే ఉండటంతో చీఫ్‌ సెలెక్టర్‌ బాధ్యతలు చేపట్టేందుకు దిగ్గజ ఆటగాళ్లు ఎవరూ ముందుకు రావడం లేదని, మొదట అజిత్ అగార్కర్ కూడా జీతం చాలా తక్కువగా ఉందని ఈ పదవిని స్వీకరించేందుకు నిరాకరించినట్లు సమాచారం.

ఈ క్రమంలోనే చీఫ్ సెలెక్టర్ వార్షిక జీతాన్ని మూడు కోట్లకు పెంచిన బీసీసీఐ.. ఇతర సెలెక్టర్ల వేతనాన్ని రూ.90 లక్షలు చేసింది. వేతనంతో పాటు డెయిలీ, ట్రావెల్ అలవెన్స్‌లు అదనంగా లభిస్తాయి. కాగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీతం కంటే అగార్కర్‌ జీతం ఎక్కువగా ఉందని నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రధానిగా మోదీ ఏడాదికి రూ.2 కోట్ల వేతనం అందుకుంటుంటే.. టీమిండియా చీఫ్‌ సెలెక్టర్‌గా అగార్కర్‌ రూ.3 కోట్లు అందుకోనున్నాడు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.