Nidhan
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్నాడు. చిరకాల కప్పు కోరిక తీరడంతో అతడి సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి.
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఇప్పుడు వరల్డ్ కప్ గెలిచిన ఆనందంలో ఉన్నాడు. చిరకాల కప్పు కోరిక తీరడంతో అతడి సంతోషానికి హద్దుల్లేకుండా పోయాయి.
Nidhan
17 ఏళ్ల సుదీర్ఘ విరామానికి చెక్ పెడుతూ టీ20 వరల్డ్ కప్-2024ను టీమిండియా సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అప్పుడెప్పుడో 2007లో నిర్వహించిన అరంగేట్ర పొట్టి ప్రపంచ కప్‌లో నెగ్గిన భారత్.. మళ్లీ ఇన్నాళ్లకు ఆ ఫార్మాట్లో విజేతగా నిలిచింది. మెగాటోర్నీ ఆరంభం నుంచి ప్రత్యర్థులను వణికిస్తూ వచ్చిన రోహిత్ సేన.. ఆఖరి వరకు అదే దూకుడును కొనసాగించి ఛాంపియన్స్‌గా ఆవిర్భవించింది. పాకిస్థాన్, ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, సౌతాఫ్రికా లాంటి స్ట్రాంగ్ టీమ్స్‌ను మట్టికరిపించి కప్పును ఎగరేసుకుపోయింది. ఫైనల్లో ప్రొటీస్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచిన సన్నివేశం ఇంకా అభిమానుల కళ్ల ముందే కదలాడుతోంది. వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ ఇంకా కొనసాగుతున్నాయి.
ప్రపంచ కప్‌తో స్వదేశానికి తిరిగొచ్చిన రోహిత్ సేన.. మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలిసింది. ఆ తర్వాత ముంబైలో నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో పాల్గొంది. అనంతరం వాంఖడే స్టేడియంలో అభిమానులను కలసి గెలుపును సెలబ్రేట్ చేసుకుంది. అయితే వాంఖడేలో జరిగిన ఓ ఆసక్తికరమైన ఘటన ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ స్టేడియంలో భారత జట్టును సన్మానించి.. ఏకంగా రూ.125 కోట్లను బహుమతిగా బీసీసీఐ అందజేసింది. ఇందులో రూ.5 కోట్ల చొప్పున జట్టులోని 15 మంది ఆటగాళ్లకు ఇచ్చారు. హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్‌కు కూడా ప్లేయర్లతో సమానంగా రూ.5 కోట్లు దక్కాయి. కోచింగ్ స్టాఫ్‌కు రూ.2.5 కోట్ల చొప్పున, బ్యాక్‌రూమ్ స్టాఫ్‌కు రూ.2 కోట్లు అందించారు. అయితే ఈ విషయంలో రోహిత్ ప్రవర్తించిన తీరు ఇప్పుడు అందరి ప్రశంసలు అందుకుంటోంది.
బీసీసీఐ ఇచ్చిన ప్రైజ్‌మనీలో నుంచి సపోర్ట్ స్టాఫ్‌కు తక్కువ మొత్తం అందడంపై అదే రోజు రోహిత్ అసంతృప్తిని వ్యక్తం చేశాడని తెలుస్తోంది. జట్టు విజయం కోసం అహర్నిషలు ఎంతో కృషి చేసిన స్టాఫ్‌కు ఇంత తక్కువ అమౌంట్ ఇవ్వడం ఏంటని ప్రశ్నించాడట. అంతేగాక తనకు వచ్చిన రూ.5 కోట్లను వాళ్లకు ఇచ్చేందుకు సిద్ధమయ్యాడట. ఈ విషయాన్ని భారత సపోర్టింగ్ స్టాఫ్‌లోని ఓ సభ్యుడు చెప్పాడు. సపోర్ట్ స్టాఫ్‌కు అధిక మొత్తం అందాలని, అది సాధ్యం కాకపోతే తన బోనస్‌ను కూడా వాళ్లకు ఇస్తానని హిట్‌మ్యాన్ చెప్పడంతో డ్రెస్సింగ్ రూమ్‌లో అందరూ ఆశ్చర్యపోయారట. ఈ విషయం తెలిసిన నెటిజన్స్ రోహిత్ మనసు బంగారం అని అంటున్నారు. ఇక, ద్రవిడ్‌కు రూ.5 కోట్లు బోనస్ రాగా.. బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్‌కు రూ.2.5 కోట్లు, బౌలింగ్ కోచ్ పరామ్ మాంబ్రేకు రూ.2.5 కోట్లు ఇచ్చింది బోర్డు. దీంతో వాళ్లతో సమానంగా ఉండాలని తన బోనస్‌ను ద్రవిడ్ సగానికి తగ్గించుకున్నాడని సమాచారం. మరి.. ప్రైజ్‌మనీ విషయంలో రోహిత్, ద్రవిడ్ వ్యవహరించిన తీరుపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
One of India’s support staff members said, “when the 125cr prize money was distributed, Rohit Sharma raised his voice and said ‘support staff shouldn’t get such less money’. He was even ready to relinquish his own bonus for us”. (Abhishek Tripathi).
– Rohit, a gem guy! 🥹❤️ pic.twitter.com/xCEkGsXsHd
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 11, 2024