iDreamPost
android-app
ios-app

వీడియో: కుల్దీప్ పరువు తీసిన రోహిత్.. అంత సాధించినా తీసిపారేశాడు!

  • Published May 30, 2024 | 8:04 PM Updated Updated May 30, 2024 | 8:04 PM

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు చాలా కీలకంగా మారాడు. గత ఏడాది కాలంలో జట్టు సాధించిన విజయాల్లో అతడిది కీలకపాత్ర. అలాంటోడి పరువు తీశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు చాలా కీలకంగా మారాడు. గత ఏడాది కాలంలో జట్టు సాధించిన విజయాల్లో అతడిది కీలకపాత్ర. అలాంటోడి పరువు తీశాడు కెప్టెన్ రోహిత్ శర్మ.

  • Published May 30, 2024 | 8:04 PMUpdated May 30, 2024 | 8:04 PM
వీడియో: కుల్దీప్ పరువు తీసిన రోహిత్.. అంత సాధించినా తీసిపారేశాడు!

స్టార్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ టీమిండియాకు చాలా కీలకంగా మారాడు. గత ఏడాది కాలంలో జట్టు సాధించిన విజయాల్లో అతడు ముఖ్య భూమిక పోషించాడు. వన్డే వరల్డ్ కప్-2023లో 15 వికెట్లు తీశాడీ చైనామన్ బౌలర్. సుడులు తిరిగే బంతులతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. మిడిల్ ఓవర్స్​లో పరుగులు కట్టడి చేస్తూనే వికెట్లు కూడా తీయడం కుల్దీప్ బలంగా చెప్పుకోవచ్చు. ఎప్పుడు బ్రేక్ త్రూ కావాలన్నా కెప్టెన్ రోహిత్ శర్మ అతడి చేతికే బంతిని అందిస్తుంటాడు. కుల్దీప్ కూడా సారథి నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ వస్తున్నాడు. సూపర్బ్‌ పెర్ఫార్మెన్స్​తో మూడు ఫార్మాట్లలోనూ జట్టులో కీలక సభ్యుడిగా మారాడు కుల్దీప్. బ్యాటింగ్​లోనూ తన ప్రతిభను చాటుతున్న ఈ స్టార్ ప్లేయర్ పరువు తీశాడు హిట్​మ్యాన్. ఇంత సాధించినా అతడ్ని తీసిపారేశాడు.

కుల్దీప్ కెరీర్​లో 2023 ఎప్పటికీ గుర్తుండిపోతుంది. గాయం నుంచి కోలుకొని అద్భుతంగా కమ్​బ్యాక్ ఇచ్చాడతను. భారత జట్టు ఆసియా కప్​ను కైవసం చేసుకోవడంలోనూ, అలాగే వన్డే వరల్డ్ కప్ ఫైనల్​కు చేరడంలోనూ అతడిది కీలక పాత్ర. ఆ ఏడాది వన్డేల్లో అతడు ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 2023లో ఆడిన 30 వన్డే మ్యాచుల్లో కలిపి 49 వికెట్లు పడగొట్టాడు. ఆ ఏడాదికి గానూ టాప్ వికెట్ టేకర్​గా నిలిచిన కుల్దీప్​కు ఐసీసీ ఓడీఐ టీమ్ ఆఫ్ ది ఇయర్-2023లో చోటు దక్కింది. దీంతో తాజాగా ఐసీసీ నుంచి అతడికి స్పెషల్ క్యాప్ లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ చేతుల మీదుగా ఈ క్యాప్​ను అందుకున్నాడతను. అయితే క్యాప్ ఇస్తున్న టైమ్​లో కుల్దీప్ పరువు తీశాడు హిట్​మ్యాన్. తాను బాల్​తో పాటు బ్యాటర్​గా కూడా రాణించానని కుల్దీప్ చెప్పగా.. ఔనా, ఎప్పుడు రన్స్ చేశావ్ అంటూ అతడి గాలి తీసేశాడు.

‘గతేడాది నాకు అద్భుతంగా గడిచింది. ఆ సీజన్​లో నేను బాల్​తో పాటు బ్యాట్​తోనూ రాణించా. అందుకు హ్యాపీ’ అని కుల్దీప్ చెప్పాడు. బ్యాట్​ అనే శబ్దం వినగానే.. బ్యాట్​తోనా? ఎప్పుడు? అని రోహిత్ ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. టెస్ట్ సిరీస్​లో బ్యాట్​తో రాణించానని అంటూ కుల్దీప్ నవ్వాడు. దీంతో ఇది వన్డే టీమ్​ కోసం ఇచ్చిన క్యాప్ అని హిట్​మ్యాన్ అన్నాడు. అయితే రోహిత్ పరువు తీసినా కుల్దీప్ వెనక్కి తగ్గలేదు. గతేడాది తాను బ్యాట్​తోనూ రాణించానని అన్నాడు. కుల్దీప్ కామెంట్స్​పై మళ్లీ రియాక్ట్ అయ్యాడు రోహిత్. తాను టీమ్​కు కెప్టెన్​ను అని, అతడు బాగా బ్యాటింగ్ చేయగా ఎప్పుడూ చూడలేదంటూ జోక్ చేశాడు. రోహిత్-కుల్దీప్ కన్వర్జేషన్ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్​గా మారింది. దీన్ని చూసిన ఫ్యాన్స్.. హిట్​మ్యాన్ అంతేనని, అతడి జోక్స్ ఇలాగే ఉంటాయని అంటున్నారు. ఎంత సీరియస్ సిచ్యువేషన్​ను అయినా తన కామెడీ టైమింగ్​తో రోహిత్ కూల్​గా చేసేస్తాడని చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Sadaiyandi Arumugam (@sandy_apm)

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş