iDreamPost
android-app
ios-app

అతడో అద్భుతం.. ఏ కోచ్ కూడా ఇలాంటి బౌలర్ ను తయ్యారు చెయ్యలేడు: బౌలింగ్ కోచ్

  • Author Soma Sekhar Updated - 01:39 PM, Sat - 9 December 23

ప్రపంచంలో ఏ బౌలింగ్ కోచ్ కూడా ఇలాంటి బౌలర్ ను తయ్యారు చెయ్యలేడని, అతడో అద్బుతమని స్టార్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. మరి ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఏ బౌలింగ్ కోచ్ కూడా ఇలాంటి బౌలర్ ను తయ్యారు చెయ్యలేడని, అతడో అద్బుతమని స్టార్ ప్లేయర్ పై ప్రశంసలు కురిపించాడు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. మరి ఆ బౌలర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Author Soma Sekhar Updated - 01:39 PM, Sat - 9 December 23
అతడో అద్భుతం.. ఏ కోచ్ కూడా ఇలాంటి బౌలర్ ను తయ్యారు చెయ్యలేడు: బౌలింగ్ కోచ్

క్రికెట్ లో ఓ ఆటగాడు రాణించాలంటే.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోవాలంటే? కఠోర శ్రమతో పాటుగా గాయాల నుంచి రక్షణ పొందడం చేయాలి. వీటితో పాటు అతడి ఎదుగుదలకు తోడ్పాటును అందించే కోచ్ కూడా ఉండాలి. ప్లేయర్ లోని లోపాలను గమనించి, వాటిని సరిదిద్దుకుంటూ.. ముందుకు సాగేలా చేస్తాడు కోచ్. బ్యాటింగ్ లోనైనా, బౌలింగ్ లోనైనా క్రికెటర్ కు కోచ్ ఉండాల్సిందే. కానీ ఎంతమంది కోచ్ లు ఉన్నా.. అలాంటి బౌలర్ ను మాత్రం తయ్యారు చేయలేరు అంటూ సంచలన కామెంట్స్ చేశాడు టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. మరి ఆ అద్భుత బౌలర్ ఎవరు? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచంలో ఎంతో మంది వరల్డ్ క్లాస్ బౌలర్లు ఉన్నారు. కానీ వారందరిలో ప్రత్యేకమైన బౌలర్ అంటూ ఓ టీమిండియా ప్లేయర్ ను ఆకాశానికి ఎత్తేశాడు భారత బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే. అతడి సక్సెస్ లో నేను ఎలాంటి క్రెడిట్ కూడా తీసుకోను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఇంతలా అతడు ప్రశంసించిన టీమిండియా బౌలర్ ఎవరో కాదు.. స్పీడ్ స్టర్, వరల్డ్ కప్ హీరో మహ్మద్ షమీ. అవును ప్రపంచంలో ఏ బౌలింగ్ కోచ్ అయినా షమీ లాంటి బౌలర్ ను తయ్యారు చెయ్యలేడని చెప్పుకొచ్చాడు. అతడు ఇంతలా చెలరేగిపోవడానికి ఏకైక రీజన్ అతడి ప్రాక్టీసే. కఠోర శ్రమే ఈ రోజు షమీని ఇక్కడి దాకా తీసుకొచ్చిందని మాంబ్రే పేర్కొన్నాడు.

shami is great bowler

కాగా.. ప్రతీ బౌలర్ సీమ్ లో ప్రతీ బాల్ షమీ లాగే వెయ్యగలిగితే.. కచ్చితంగా ఆ బౌలర్ షమీలాగే అవుతాడని పేర్కొన్నాడు మాంబ్రే. బంతిని ఇన్ స్వింగ్, అవుట్ స్వింగ్ చేయడంలో మహ్మద్ షమీ సిద్దహస్తుడు అందులో ఎలాంటి సందేహం లేదని దక్షిణాఫ్రికా పర్యటనకు వెళ్లే ముందు మీడియాలో మాట్లాడాడు మాంబ్రే. ఈ క్రమంలోనే బుమ్రా కూడా అరుదైన బౌలర్ గా కితాబిచ్చాడు. ఇదిలా ఉండగా.. ఈ వరల్డ్ కప్ లో 24 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ గా అగ్రస్థానంలో నిలిచాడు. మరి మహ్మద్ షమీ లాంటి బౌలర్ ను ఏ కోచ్ తయ్యారు చెయ్యలేడన్న మాంబ్రే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.