T20 World Cup: రేపటి నుంచి టీమిండియా వరల్డ్‌ కప్‌ వేట షురూ! అదొక్కటే సమస్య!

Team India, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతుంది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియాను ఓ ప్రధాన సమస్య భయపెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Team India, T20 World Cup 2024, IND vs IRE: టీ20 వరల్డ్‌ కప్‌లో టీమిండియా తొలి మ్యాచ్‌ కోసం సిద్ధం అవుతుంది. అయితే.. ఈ టోర్నీలో టీమిండియాను ఓ ప్రధాన సమస్య భయపెడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ప్రారంభమైంది. కానీ, అసలు సిసలు సమరం పెద్ద టీమ్స్‌ రాకతో మొదలు కానుంది. టీమిండియా రాకతో టీ20 వరల్డ్‌ కప్‌పై మరింత ఆసక్తి పెరగనుంది. బుధవారం పసికూన ఐర్లాండ్‌తో టీమిండియా తలపడనుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ సేన హాట్‌ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతున్నా.. ప్రస్తుతం టోర్నీ సాగుతున్న విధానం చూస్తుంటే.. ఒక భయం మాత్రం వెంటాడుతోంది. ఇప్పుడనే కాదు.. చాలా కాలంగా టీమిండియా ఒక పెద్ద సమస్యగా మారిన విషయమే.. ఈ ప్రతిష్టాత్మక టోర్నీలో కూడా ఇబ్బంది పెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ టీ20 వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు అమెరికాలో కొన్ని, వెస్టిండీస్‌లో కొన్ని జరుగుతున్న విషయం తెలిసిందే. టీమిండియా గ్రూప్‌ మ్యాచ్‌లన్నీ అమెరికాలోనే ఆడనుంది. కానీ, సూపర్‌ 8 మ్యాచ్‌లన్నీ వెస్టిండీస్‌లో జరుగుతాయి. ఇప్పటి వరకు వెస్టిండీస్‌లో జరిగిన మ్యాచ్‌ల్లో బౌలర్లు చాలా ప్రభావం చూపారు. లోస్కోరింగ్‌ మ్యాచ్‌లే ఎక్కువగా జరిగాయి. ముఖ్యంగా వెస్టిండీస్‌ పిచ్‌లపై లెఫ్ట్‌ ఆర్మ్‌ పేసర్లు చాలా ప్రభావం చూపుతున్నారు. ఇప్పుడు ఇదే విషయం టీమిండియాను బాగా కలవరపెడుతోంది. గ్రూప్‌ స్టేజ్‌ను ఎలాగోలా దాటేసినా.. సూపర్‌ 8లో మాత్రం ఇండియాకు ఇబ్బంది తప్పదని క్రికెట్‌ నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు.

ఎందుకంటే.. టీమిండియాలోని స్టార్‌ బ్యాటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలు లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్లకు ఇబ్బంది పడతారనే విషయం తెలిసిందే. పైగా జట్టులో ఎక్కువగా రైట్‌ హ్యాండ్‌ బ్యాటర్లు ఉండటం కూడా టీమిండియాకు కాస్త దెబ్బ అనే చెప్పాలి. అయితే.. ఈ టోర్నీలో టీమిండియా అనుకున్న లక్ష్యం చేరుకోవాలంటే.. కచ్చితంగా ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్ల వీక్‌నెస్‌ను ఓవర్‌కమ్‌ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోహిత్‌, కోహ్లీ కాకుండా ఇతర బ్యాటర్లకు వెస్టిండీస్‌ పిచ్‌లపై ఆడిన అనుభవం పెద్దగా లేదు. అందుకే.. వెస్టిండీస్‌లో కోహ్లీ, రోహిత్‌ రాణించడం చాలా ముఖ్యం. అయితే.. ఈ లెఫ్ట్‌ ఆర్మ్‌ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొంటే తప్పా.. అది సాధ్యం అవ్వదు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments