iDreamPost
android-app
ios-app

Team India: 2023లో టీమిండియా సాధించిన ఘనతలు.. ఎదుర్కొన్న అవమానాలు ఇవే!

  • Published Dec 31, 2023 | 7:21 PM Updated Updated Dec 31, 2023 | 7:21 PM

2023 ఏడాది ముగిసిపోయింది.. 2024లోకి అంతా అడుగుపెడుతున్నారు. అయితే.. 2023లో టీమిండియా ఏం సాధించింది, ఏం కోల్పోయింది, ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది లాంటి ఆసక్తికర విషయాలను విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

2023 ఏడాది ముగిసిపోయింది.. 2024లోకి అంతా అడుగుపెడుతున్నారు. అయితే.. 2023లో టీమిండియా ఏం సాధించింది, ఏం కోల్పోయింది, ఎలాంటి అవమానాలు ఎదుర్కొంది లాంటి ఆసక్తికర విషయాలను విశేషాలను ఇప్పుడు తెలుసుకుందాం..

  • Published Dec 31, 2023 | 7:21 PMUpdated Dec 31, 2023 | 7:21 PM
Team India: 2023లో టీమిండియా సాధించిన ఘనతలు.. ఎదుర్కొన్న అవమానాలు ఇవే!

2023 ఏడాది ముగిసి.. 2024 వచ్చేసింది. ఈ క్రమంలో టీమిండియా 2023లో ఏం సాధించింది? ఏం చేజార్చుకుంది అనే విషయాల గురించి మాట్లాకుంటు.. భారత క్రికెట్‌ అభిమానుల కళ్లు చెమ్మగిల్లుతాయి. ఎందుకంటే.. భారత క్రికెట్‌ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయాల్సిన ఏడాది 2023. కానీ, కొద్దిలో అది చేజారిపోయింది. అందరికీ తెలిసిందే.. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ జరిగింది. 1983, 2011 అంటే క్రికెట్‌ అభిమానులకు గుర్తుకు వచ్చేవి వరల్డ్‌ కప్స్‌. వాటి సరసన 2023 కూడా నిలవాల్సింది. కానీ, కొద్దిలో మిస్‌ అయిపోయింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీతో పాటు భారత జట్టులోని ఆటగాళ్లంతా వరల్డ్‌ కప్‌ కోసం ఎంతో ఎదురుచూశారు. నాలుగేళ్లకు ఒకసారి వచ్చే వరల్డ్‌ కప్‌లో సత్తా చాటాలని ఎన్నో కలలు కన్నారు.

అయితే వరల్డ్‌ కప్‌ ముందు జట్టులో కొత్త మంది ముఖ్యమైన ఆటగాళ్లు గాయపడటం టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్‌ను కంగారు పెట్టింది. కానీ, సరిగ్గా వరల్డ్‌ కప్‌ ముందు కేఎల్‌ రాహుల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, జస్ప్రీత్‌ బుమ్రా ఫామ్‌లోకి రావడంతో ఒక్కసారి టీమిండియా ఎంతో నిండుగా మారిపోయింది. పైగా వరల్డ్‌ కప్‌లో జట్టులోని 11 మంది ఆటగాళ్లు సూపర్‌ ఫామ్‌లో తమ సత్తా చాటారు. వరుసగా 10 మ్యాచ్‌లు గెలిచి టీమిండియా ఫైనల్లోకి అడుగుపెట్టింది. దీంతో.. 2011 సీన్‌ మళ్లీ రిపీట్‌ అవుతుందని, కచ్చితంగా భారత్‌ విశ్వవిజేతగా నిలుస్తుందని అంతా భావించారు.

కానీ, అనూహ్యంగా ఫైనల్లో టీమిండియా ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలైంది. ఆ ఓటమి భారత క్రికెటర్ల, అభిమానుల హృదాయాలను ముక్కలు చేసింది. 2023లో టీమిండియాకు బాధ కలిగించే అతి పెద్ద అంశం ఇదే. అలాగే ఆస్ట్రేలియాతో జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్స్‌ షిప్‌ 2023లో ఫైనల్లో కూడా టీమిండియా ఓటమి పాలైంది. ఇది ఒక రకంగా టీమిండియా అవమానమే. ఇక పోతే.. తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్‌లో స్టార్లతో నిండిన భారత జట్టు ఏకంగా ఇన్నింగ్స్‌ 32 పరుగుల తేడాతో ఓటమి పాలు కావడంతో నిజంగా ఇండియన్‌ క్రికెట్‌కు అవమానమే చెప్పాలి. ఇలా 2023 టీమిండియాకు చేదు అనుభవంతో పాటు అవమానరంగానూ కొనసాగింది.

ఇక 2023లో టీమిండియా సాధించిన ఘనతల గురించి మాట్లాడుకుంటే.. ఈ ఏడాది ఆరంభంలో టీమిండియా రోహిత్‌ శర్మ కెప్టెన్సీలో ఆసియా కప్‌ను కైవసం చేసుకుంది. పాకిస్థాన్‌, శ్రీలంక, బంగ్లాదేశ్‌, ఆఫ్థానిస్థాన్‌ లాంటి జట్లు ఓడించి.. ఫైనల్లో లంకను అత్యంత దారుణంగా చిత్తు చేసి మరీ టీమిండియా ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఇది 2023లో టీమిండియా సాధించిన విజయాల్లో ముఖ్యమైంది. అలాగే ఇదే ఏడాది ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీని టీమిండియా గెలిచింది. వీటితో పాటు కేఎల్‌ రాహుల్‌ కెప్టెన్సీలో తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా 2-1తో కైవసం చేసుకుంది. చాలా కాలం తర్వాత సౌతాఫ్రికా గడ్డపై టీమిండియా వన్డే సిరీస్‌ను గెలిచింది. ఇది కూడా 2023లో జరిగిన ఒక సానుకూల అంశం. ఐసీసీ ఈవెంట్స్‌తో పాటు.. ఏషియన్‌ గేమ్స్‌లో టీమిండియా పురుషుల జట్టు, మహిళల జట్టు గోల్డ్‌ మెడల్స్‌ నెగ్గడం ఇండియన్‌ క్రికెట్‌కు గర్వకారణం. ఇలా 2023లో టీమిండియాకు మరుపురాని ఏడాదిగానే మిగిలిపోయింది. వరల్డ్ కప్‌ ఒక్కటి గెలిచి ఉంటే.. ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలో 2023 చిరస్థాయిగా నిలిచిపోయేది. మరి 2023లో టీమిండియా సాధించిన విజయాలు, ఓటములపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.