కోహ్లీ క్రేజీ రికార్డ్.. వరల్డ్ కప్ హిస్టరీలో ఫస్ట్ ప్లేయర్​గా అరుదైన ఘనత!

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.

టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్​ను అందుకున్నాడు. బంగ్లాదేశ్​తో మ్యాచ్​లో చెలరేగి ఆడాడు కింగ్. 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీతో పాటు 3 భారీ సిక్సులు ఉన్నాయి. తంజిమ్ హసన్, షకీబల్ హసన్​ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు బాదాడు కోహ్లీ. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరల్డ్ కప్స్​లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్​గా చరిత్ర సృష్టించాడు.

ప్రపంచ కప్ హిస్టరీలో ఇప్పటిదాకా ఏ ప్లేయర్ కూడా 3000 పరుగుల మార్క్​ను చేరుకోలేదు. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన టీమిండియా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11 బంతుల్లో 23), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37) క్విక్​గా రన్స్ చేశారు. ఉన్నంత సేపు భారీ షాట్లతో అలరించారు. ఆ తర్వాత రిషబ్ పంత్ (24 బంతుల్లో 36), శివమ్ దూబె (24 బంతుల్లో 34) కూడా మెరుపు బ్యాటింగ్​తో దుమ్మురేపారు. ప్రస్తుతం భారత్ 18.3 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఉంది.

Show comments