Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ క్రేజీ రికార్డ్ క్రియేట్ చేశాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో అరుదైన ఘనతను అందుకున్నాడు కింగ్.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఎట్టకేలకు ఫామ్‌ను అందుకున్నాడు. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో చెలరేగి ఆడాడు కింగ్. 28 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో ఒక బౌండరీతో పాటు 3 భారీ సిక్సులు ఉన్నాయి. తంజిమ్ హసన్, షకీబల్ హసన్‌ను టార్గెట్ చేసుకొని భారీ షాట్లు బాదాడు కోహ్లీ. ఈ క్రమంలో అతడు ఓ అరుదైన ఘనతను అందుకున్నాడు. వరల్డ్ కప్స్‌లో 3 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొలి ప్లేయర్‌గా చరిత్ర సృష్టించాడు.
ప్రపంచ కప్ హిస్టరీలో ఇప్పటిదాకా ఏ ప్లేయర్ కూడా 3000 పరుగుల మార్క్‌ను చేరుకోలేదు. ఆ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఇక, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా మొదటి బంతి నుంచే దూకుడుగా ఆడింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (11 బంతుల్లో 23), విరాట్ కోహ్లీ (28 బంతుల్లో 37) క్విక్‌గా రన్స్ చేశారు. ఉన్నంత సేపు భారీ షాట్లతో అలరించారు. ఆ తర్వాత రిషబ్ పంత్ (24 బంతుల్లో 36), శివమ్ దూబె (24 బంతుల్లో 34) కూడా మెరుపు బ్యాటింగ్‌తో దుమ్మురేపారు. ప్రస్తుతం భారత్ 18.3 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 171 పరుగులతో ఉంది.
VIRAT KOHLI BECOMES THE FIRST PLAYER TO COMPLETE 3000 RUNS IN WORLD CUPS…!!!
– The Greatest ever. 🐐 pic.twitter.com/3UB7hixIn7
— Johns. (@CricCrazyJohns) June 22, 2024