Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్‌లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్‌లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్‌ను అందుకున్నాడు.
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్‌లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్‌లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్‌ను అందుకున్నాడు.
Nidhan
టీమిండియా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరైన సమయానికి ఫామ్‌లోకి వచ్చాడు. పొట్టి కప్పు ఫస్ట్ ఫేజ్‌లో పరుగులు రాక ఇబ్బంది పడిన కింగ్.. సూపర్-8లో తన రిథమ్‌ను అందుకున్నాడు. గ్రూప్ దశ మ్యాచుల్లో 5 పరుగులు మాత్రమే చేసి అందర్నీ నిరాశకు గురిచేశాడు కింగ్. అయితే సూపర్ పోరులో మాత్రం తన టచ్‌ను అందుకున్నాడు. మొదట ఆఫ్ఘానిస్థాన్ మీద 24 పరుగులతో ఫర్వాలేదనిపించాడు. ఆ తర్వాత బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో 28 బంతుల్లో 37 పరుగులతో ఆకట్టుకున్నాడు. ఈ రెండు ఇన్నింగ్స్‌ల్లో అతడు కొట్టిన పలు బౌండరీలు, సిక్సులు హైలైట్‌గా నిలిచాయి. నిల్చున్న చోటు నుంచి అలవోకగా గ్రౌండ్ నలువైపులా భారీ షాట్లు ఆడుతూ ప్రత్యర్థులకు హెచ్చరికలు పంపించాడు. ఇవాళ ఆస్ట్రేలియాతో జరిగే కీలక పోరులో తన సత్తా చాటేందుకు అతడు సిద్ధమవుతున్నాడు. వరల్డ్ కప్-2023 ఫైనల్లో తమను ఓడించిన కంగారూల పని పట్టాలని చూస్తున్నాడు.
సాధారణంగా బిగ్ మ్యాచెస్‌లో అదరగొట్టే కోహ్లీ.. అందునా ఆసీస్‌తో మ్యాచ్ అంటే మరింత చెలరేగి ఆడతారు. అలాంటి కంగారూలపై ఇది రివేంజ్ టైమ్ కావడంతో కింగ్ ఎలా ఆడతాడోననేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో భారత మాజీ క్రికెటర్ రాబిన్ ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పరుగుల రుచి మరిగితే కోహ్లీని ఆపడం ఎవరి వల్లా కాదన్నాడు. ఆసీస్‌తో మ్యాచ్‌లో అతడు హాఫ్ సెంచరీ బాదినా సరిపోతుందని ఊతప్ప అభిప్రాయపడ్డాడు. కోహ్లీ రాణిస్తే టీమ్ సునాయాసంగా సెమీస్‌కు చేరుకుంటుందన్నాడు. ‘ఇవాళ్టి మ్యాచ్‌లో కోహ్లీ బాగా ఆడాలి. అతడు 60 నుంచి 70 పరుగులు చేయాలని నేను కోరుకుంటున్నా. 120 నుంచి 125 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేసినా చాలు. విరాట్ పరుగుల రుచి మరిగితే ఏదైనా సాధించగలడు’ అని ఊతప్ప చెప్పుకొచ్చాడు.
సెమీఫైనల్‌కు ముందు కోహ్లీ 150 స్ట్రైక్ రేట్‌తో బ్యాటింగ్ చేస్తే చూడాలని ఉందన్నాడు ఊతప్ప. నాకౌట్ మ్యాచ్‌కు ముందు విరాట్ మరింత ఊపందుకోవాలని తెలిపాడు. కింగ్ టాప్ ఫామ్‌లోకి వస్తే భారత్‌కు తిరుగుండదని పేర్కొన్నాడు. కోహ్లీ బ్యాటింగ్‌తో పాటు మరో ఓపెనర్, కెప్టెన్ రోహిత్ శర్మ గురించి కూడా ఊతప్ప ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఓపెనర్‌గా అగ్రెసివ్‌గా బ్యాటింగ్ చేయడం మంచిదేనని.. హిట్‌మ్యాన్ అప్రోచ్‌ను తప్పుబట్టాల్సిన అవసరం లేదన్నాడు. రోహిత్ తన బ్యాటింగ్ విషయంలో పూర్తి క్లారిటీతో ఉన్నాడని.. అతడు అనుకున్న విధంగా ఆడాలని ఊతప్ప సూచించాడు. రోహిత్ తన న్యాచురల్ గేమ్ ఆడుతూ పోవాలని, అదే టీమ్‌కు మేలు చేస్తుందన్నాడు. తనదైన రోజున అతడు మ్యాచ్‌ను సింగిల్ హ్యాండ్‌తో వన్‌సైడ్ చేసేస్తాడని వివరించాడు. మరి.. కోహ్లీ పరుగుల రుచి మరిగితే మంచిదంటూ ఊతప్ప చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Robin Uthappa “I want one a 65-70 not out inning from Virat Kohli.Even if you get a 120-125 strike rate,I do not really care.Bcz once he gets that little taste of blood,That human being can do anything.before we hit semifinals,I want him to have that one”pic.twitter.com/ucK59kGUom
— Sujeet Suman (@sujeetsuman1991) June 24, 2024