iDreamPost
android-app
ios-app

అస్సలు వదలొద్దు.. పాకిస్తాన్​ను భారత్ చిత్తుగా ఓడించాలి: రైనా

  • Published Jun 01, 2024 | 12:56 PM Updated Updated Jun 01, 2024 | 12:56 PM

టీ20 వరల్డ్ కప్​-2024కు రెడీ అయిన భారత జట్టుకు మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు. ఆ టీమ్​ను అస్సలు వదలొద్దని కోరాడు.

టీ20 వరల్డ్ కప్​-2024కు రెడీ అయిన భారత జట్టుకు మాజీ క్రికెటర్ సురేష్ రైనా ఓ రిక్వెస్ట్ చేశాడు. ఆ టీమ్​ను అస్సలు వదలొద్దని కోరాడు.

  • Published Jun 01, 2024 | 12:56 PMUpdated Jun 01, 2024 | 12:56 PM
అస్సలు వదలొద్దు.. పాకిస్తాన్​ను భారత్ చిత్తుగా ఓడించాలి: రైనా

టీ20 ప్రపంచ కప్-2024 సంబురం స్టార్ట్ అవ్వడానికి ఇంకా ఒక్క రోజు మాత్రమే ఉంది. మరికొన్ని గంటల్లో క్రికెట్​లో అతిపెద్ద టోర్నమెంట్ మొదలవనుంది. కాకలుతీరిన టాప్ టీమ్స్​తో పాటు వాటికి షాక్ ఇవ్వడానికి తహతహలాడుతున్న స్మాల్ టీమ్స్, అద్భుతాలు చేయాలని చూస్తున్న పసికూనలతో మెగా టోర్నీ చాలా ఆసక్తిని రేపుతోంది. ధనాధన్ క్రికెట్​కు పెట్టింది పేరైనా టీ20 ఫార్మాట్ కావడం, ఒక్క బంతిలో రిజల్ట్ మారే అవకాశం ఉండటంతో ఎవరు గెలుస్తారో చెప్పలేని పరిస్థితి. ఈ సిచ్యువేషన్​లో ఫేవరెట్​గా బరిలోకి దిగుతున్న టీమిండియా ఎలాగైనా కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది. టైటిల్ నెగ్గి వన్డే వరల్డ్ కప్-2023 మిగిల్చిన గాయాల నుంచి ఉపశమనం పొందాలని అనుకుంటోంది.

మెగా టోర్నీ కోసం ఇప్పటికే యూఎస్​ఏకు చేరుకుంది భారత జట్టు. టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా తాజాగా టీమ్​తో జాయిన్ అయ్యాడు. సాధన​లో మునిగిపోయిన రోహిత్ సేన.. ఇవాళ బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్ ఆడనుంది. జూన్ 5వ తేదీన ఐర్లాండ్​తో జరిగే తొలిపోరుతో వరల్డ్ కప్ వేటను మొదలుపెట్టనుంది. ఆ తర్వాత 9వ తేదీన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్​తో తలపడనుంది. వరల్డ్ కప్​లో పాక్​పై తిరుగులేని రికార్డు మన జట్టుకు ఉంది. దీంతో దాయాదిని మరోసారి చిత్తు చేయాలని అభిమానులంతా కోరుకుంటున్నారు. పాక్​ను ఓడిస్తే అదే జోష్​తో ఫైనల్ వరకు దూసుకెళ్లొచ్చని అంటున్నారు. టీమిండియా లెజెండ్ సురేష్ రైనా కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. పాక్​ను అస్సలు వదలొద్దని అతడు కోరాడు.

పాకిస్థాన్​ను భారత్ చిత్తుగా ఓడించాలని రైనా అన్నాడు. ఎలాగైనా సరే దాయాది జట్టును మట్టికరిపించాలని చెప్పాడు. ఆ టీమ్​ మీద ఓటమిని భరించలేమని.. కాబట్టి గెలుపే లక్ష్యంగా దూసుకుపోవాలని రోహిత్ సేనకు సూచించాడు. ‘ఈసారి భారత జట్టు చాలా బలంగా కనిపిస్తోంది. రోహిత్ శర్మ టీమ్​ను అద్భుతంగా నడిపిస్తున్నాడు. అతడి ప్లానింగ్ అద్భుతం. డ్రెస్సింగ్ రూమ్​లో హిట్​మ్యాన్​కు లభిస్తున్న గౌరవం అపూర్వం. హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె రూపంలో మన దగ్గర ఇద్దరు క్వాలిటీ ఆల్​రౌండర్లు ఉన్నారు. న్యూయార్క్​లో మన టీమ్ పాకిస్థాన్​తో ఆడబోతోంది. నేను, యువరాజ్, ఆర్పీ సింగ్ కలసి పాక్​ మీద చాలా మ్యాచులు ఆడాం. ఆ టీమ్​ను ఈసారి కూడా చిత్తుగా ఓడించాలి. సర్వశక్తులన్నీ ఒడ్డి దాయాదిని మట్టికరిపించాలి’ అని రైనా చెప్పుకొచ్చాడు. పాక్​తో ఓడే ప్రసక్తే లేదని.. ఆ టీమ్​ను చిత్తు చేయకుండా వదలొద్దని రోహిత్ సేనకు పిలుపునిచ్చాడు రైనా. మరి.. భారత్-పాక్ పోరు కోసం మీరెంతగా ఎదురుచూస్తున్నారో కామెంట్ చేయండి.