iDreamPost
android-app
ios-app

సూపర్-8 కోసం మొనగాళ్లను దించుతున్న రోహిత్.. ఇన్నాళ్లూ దాచి మంచి పనిచేశాడు!

  • Published Jun 17, 2024 | 8:50 PMUpdated Jun 17, 2024 | 8:55 PM

టీ20 వరల్డ్ కప్​లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు దాదాపుగా పూర్తవడంతో సూపర్-8 మీద అన్ని టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. టీమిండియా కూడా సూపర్ పోరు కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తోంది.

టీ20 వరల్డ్ కప్​లో గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు దాదాపుగా పూర్తవడంతో సూపర్-8 మీద అన్ని టీమ్స్ ఫోకస్ చేస్తున్నాయి. టీమిండియా కూడా సూపర్ పోరు కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తోంది.

  • Published Jun 17, 2024 | 8:50 PMUpdated Jun 17, 2024 | 8:55 PM
సూపర్-8 కోసం మొనగాళ్లను దించుతున్న రోహిత్.. ఇన్నాళ్లూ దాచి మంచి పనిచేశాడు!

టీ20 ప్రపంచ కప్-2024 అంచనాలకు తగ్గట్లే ఉత్కంఠగా సాగుతోంది. గత రెండు వారాలుగా క్రికెటర్లు అద్భుతమైన ప్రదర్శనలతో అభిమానులను ఉర్రూతలూగించారు. అయితే దుమ్మురేపుతాయనుకున్న పలు పెద్ద జట్లు వరుస ఓటములతో తుస్సుమనగా.. ఏమాత్రం ఎక్స్​పెక్టేషన్ లేని కొన్ని స్మాల్ టీమ్స్ బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో రచ్చ చేశాయి. మెగా టోర్నీలోని గ్రూప్ దశ ముగింపునకు వచ్చింది. లీగ్ స్టేజ్​లో ఇంకా ఒకట్రెండు మ్యాచ్​లు మాత్రమే మిగిలి ఉన్నాయి. అయితే సూపర్-8 టీమ్స్​పై క్లారిటీ రావడంతో ఆ మ్యాచ్​లు నామమాత్రం కానున్నాయి. దీంతో ఇప్పుడు అందరూ సూపర్-8 మీద ఫోకస్ చేస్తున్నారు. టీమిండియా కూడా సూపర్ పోరు కోసం స్పెషల్ ప్లాన్స్ వేస్తోందని తెలుస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ తన ఆయుధాలను బయటకు తీస్తున్నాడని సమాచారం.

గ్రూప్ దశ మ్యాచుల్లో భారత్ వరుస విక్టరీలతో అదరగొట్టింది. అయితే యూఎస్​లోని ట్రిక్కీ పిచ్​లపై మన బ్యాటర్లు ఫెయిలయ్యారు. జస్​ప్రీత్ బుమ్రా ఆధ్వర్యంలోని బౌలింగ్ యూనిట్ రాణించడం వల్లే వరుస విజయాలు దక్కాయి. ఇప్పుడు టీమిండియా కరీబియన్ పిచ్​లపై ఆడనుంది. సూపర్-8 నుంచి ఫైనల్స్ వరకు అన్ని మ్యాచ్​లు అక్కడే జరగనున్నాయి. దీంతో సారథి రోహిత్ ముగ్గురు మొనగాళ్లను దించుతున్నాడని టాక్ నడుస్తోంది. విండీస్​లోని స్లో పిచ్​లపై ప్రత్యర్థులను స్పిన్ మంత్రంతో బెదరగొట్టాలని హిట్​మ్యాన్ భావిస్తున్నాడట. అందుకోసం సీనియర్ స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్​ను బరిలోకి దించాలని ఫిక్స్ అయ్యాడని క్రికెట్ వర్గాల సమాచారం. సూపర్-8 పోరులో వీళ్లిద్దరూ టీమ్​లో ఉండటం పక్కా అని అనలిస్టులు కూడా అంటున్నారు.

కుల్దీప్, చాహల్​తో పాటు యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్​ను కూడా సూపర్-8 కోసం సిద్ధం చేస్తున్నాడట రోహిత్ శర్మ. రెగ్యులర్​గా థర్డ్ డౌన్​లో ఆడే టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఓపెనర్​గా ఫెయిల్ అవుతుండటం, ఆరంభంలోనే వికెట్లు పడటంతో తర్వాతి బ్యాటర్ల మీద ప్రెజర్ పెరగడం, లోస్కోర్క్స్ నమోదవుతుండటంతో ఈ సమస్యను అధిగమించాలని టీమ్ మేనేజ్​మెంట్ డిసైడ్ అయిందట. అందులో భాగంగానే జైస్వాల్​ను ఓపెనర్​గా ఆడించాలని అనుకుంటున్నారని టాక్ నడుస్తోంది. జైస్వాల్​ను ఓపెనర్​గా దించడం సర్​ప్రైజ్ ప్యాకేజ్ అవుతుందని, ప్రత్యర్థి బౌలర్లకు లెఫ్ట్-రైట్ కాంబోను ఎదుర్కోవడం కష్టం అవుతుందని భావిస్తోందట. ఇది తెలిసిన నెటిజన్స్.. రోహిత్ ప్లాన్ వర్కౌట్ అవుతుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. ఇన్నాళ్లూ కుల్దీప్, చాహల్​ను దాచి మంచి పని చేశారని కామెంట్స్ చేస్తున్నారు. ఎంతటి బ్యాటర్ అయినా వీళ్ల స్పిన్ ఉచ్చులో పడితే బయటకు రాలేడని చెబుతున్నారు. జైస్వాల్​ రాకతో బ్యాటింగ్ యూనిట్ మరింత బలోపేతం అవుతుందని అంటున్నారు. మరి.. సూపర్ పోరుకు ముందు భారత జట్టులో ఈ మార్పులపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి