Nidhan
వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్‌కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్‌లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది.
వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్‌కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్‌లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది.
Nidhan
వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్‌కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్‌లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది. లీగ్ స్టేజ్‌లో అమెరికాలోని ట్రిక్కీ పిచ్‌లపై మెన్ ఇన్ బ్లూ చాలా ఇబ్బందిపడ్డారు. మన బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించినా.. బ్యాటింగ్ యూనిట్ మాత్రం ఫెయిలైంది. ఓపెనర్‌గా వస్తున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సారథి రోహిత్ శర్మ చెత్త బ్యాటింగ్‌తో అందర్నీ నిరాశపర్చారు. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా బాల్‌తో మెరుస్తున్నా బ్యాట్‌తో ఆ రేంజ్లో రాణించడం లేదు. సూర్యకుమార్ యాదవ్, పించ్ హిట్టర్ శివమ్ దూబె మెళ్లిగా పుంజుకున్నారు. జట్టు మొత్తంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కడే నిలకడగా పరుగులు చేస్తున్నాడు.
అమెరికాలోని ట్రిక్కీ పిచ్‌లపై ఇంతగా ఇబ్బంది పడిన భారత్.. వెస్టిండీస్‌లోని స్లో పిచ్‌లపై ఎలా ఆడుతుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. భారీ షాట్లు బాదితే బౌండరీల దగ్గర ఫీల్డర్లకు దొరికిపోతారు. స్పిన్నర్లను ఫేస్ చేయడం తలకు మించిన పని. ఈ సవాల్‌ను అధిగమించాలంటే ఆటగాళ్లు తమలోని రియల్ టాలెంట్‌ను బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే భారత్‌కు తానున్నానంటూ భరోసా ఇస్తున్నాడు కెప్టెన్ రోహిత్. వెస్టిండీస్‌లో ఆడిన అనుభవం అతడికి ఉంది. అక్కడి పిచ్‌లు అతడికి కొట్టిన పిండి.
సూపర్-8కు ముందు రోహిత్‌పై టీమిండియా గంపెడాశలు పెట్టుకుంది. దీనికి కారణం వెస్టిండీస్ పిచ్‌లపై అతడికి మంచి అనుభవం ఉండటమే. అక్కడ వన్డేలు, టెస్టుల్లో రాణించిన హిట్‌మ్యాన్.. టీ20ల్లోనూ సత్తా చాటాడు. కరీబియన్ గడ్డపై ఆడిన పొట్టి ఫార్మాట్ మ్యాచుల్లో రోహిత్ యావరేజ్ 46.25గా ఉండగా, స్ట్రైక్ రేట్ 145.67గా ఉండటం విశేషం. బ్యాటింగ్‌కు కష్టంగా ఉండే అక్కడి పిచ్‌లపై ఇంత స్ట్రైక్ రేట్, సగటుతో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే రోహిత్ అనుభవాన్ని నమ్ముకుంది టీమిండియా. అతడికి తోడుగా యాంకర్ ఇన్నింగ్స్‌లు ఆడటంలో దిట్ట అయిన కోహ్లీ కూడా టచ్‌లోకి వస్తే దుమ్మురేపొచ్చని అనుకుంటోంది. వీళ్లిద్దరి నుంచి మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా రాలేదు. కాబట్టి అభిమానులకు ఉన్న ఆ బాకీని సూపర్ పోరులో వీళ్లు తీర్చుకుంటారేమో చూడాలి.
Rohit Sharma has an average of 46.25 & strike rate of 145.67 in T20I in West Indies 🇮🇳 🔥
– Hitman is coming to Super 8…!!!! pic.twitter.com/syGySYIpep
— Johns. (@CricCrazyJohns) June 18, 2024