iDreamPost
android-app
ios-app

భారత్​కు సవాల్ విసురుతున్న కరీబియన్ పిచ్​లు.. ఆశలన్నీ అతడి మీదే!

  • Published Jun 18, 2024 | 4:16 PM Updated Updated Jun 18, 2024 | 4:16 PM

వరల్డ్ కప్​లో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్​కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్​లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది.

వరల్డ్ కప్​లో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్​కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్​లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది.

  • Published Jun 18, 2024 | 4:16 PMUpdated Jun 18, 2024 | 4:16 PM
భారత్​కు సవాల్ విసురుతున్న కరీబియన్ పిచ్​లు.. ఆశలన్నీ అతడి మీదే!

వరల్డ్ కప్లో గ్రూప్ స్టేజ్​ను సక్సెస్​ఫుల్​గా పూర్తి చేసుకున్న టీమిండియా.. ఇప్పుడు అసలు సవాల్​కు సిద్ధమవుతోంది. కరీబియన్ పిచ్​లపై సూపర్-8 పోరాటానికి రోహిత్ సేన రెడీ అవుతోంది. లీగ్ స్టేజ్​లో అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై మెన్ ఇన్ బ్లూ చాలా ఇబ్బందిపడ్డారు. మన బౌలింగ్ విభాగం అద్భుతంగా రాణించినా.. బ్యాటింగ్ యూనిట్ మాత్రం ఫెయిలైంది. ఓపెనర్​గా వస్తున్న టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు సారథి రోహిత్ శర్మ చెత్త బ్యాటింగ్​తో అందర్నీ నిరాశపర్చారు. ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా బాల్​తో మెరుస్తున్నా బ్యాట్​తో ఆ రేంజ్​లో రాణించడం లేదు. సూర్యకుమార్ యాదవ్, పించ్ హిట్టర్ శివమ్ దూబె మెళ్లిగా పుంజుకున్నారు. జట్టు మొత్తంలో వికెట్ కీపర్ రిషబ్ పంత్ ఒక్కడే నిలకడగా పరుగులు చేస్తున్నాడు.

అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై ఇంతగా ఇబ్బంది పడిన భారత్.. వెస్టిండీస్​లోని స్లో పిచ్​లపై ఎలా ఆడుతుందోనని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. ఇక్కడ ఒక్కో పరుగు కోసం తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. భారీ షాట్లు బాదితే బౌండరీల దగ్గర ఫీల్డర్లకు దొరికిపోతారు. స్పిన్నర్లను ఫేస్ చేయడం తలకు మించిన పని. ఈ సవాల్​ను అధిగమించాలంటే ఆటగాళ్లు తమలోని రియల్ టాలెంట్​ను బయటకు తీయాల్సి ఉంటుంది. అయితే భారత్​కు తానున్నానంటూ భరోసా ఇస్తున్నాడు కెప్టెన్ రోహిత్. వెస్టిండీస్​లో ఆడిన అనుభవం అతడికి ఉంది. అక్కడి పిచ్​లు అతడికి కొట్టిన పిండి.

సూపర్-8కు ముందు రోహిత్​పై టీమిండియా గంపెడాశలు పెట్టుకుంది. దీనికి కారణం వెస్టిండీస్​ పిచ్​లపై అతడికి మంచి అనుభవం ఉండటమే. అక్కడ వన్డేలు, టెస్టుల్లో రాణించిన హిట్​మ్యాన్​.. టీ20ల్లోనూ సత్తా చాటాడు. కరీబియన్ గడ్డపై ఆడిన పొట్టి ఫార్మాట్ మ్యాచుల్లో రోహిత్​ యావరేజ్ 46.25గా ఉండగా, స్ట్రైక్ రేట్ 145.67గా ఉండటం విశేషం. బ్యాటింగ్​కు కష్టంగా ఉండే అక్కడి పిచ్​లపై ఇంత స్ట్రైక్ రేట్, సగటుతో బ్యాటింగ్ చేయడం మామూలు విషయం కాదు. అందుకే రోహిత్ అనుభవాన్ని నమ్ముకుంది టీమిండియా. అతడికి తోడుగా యాంకర్ ఇన్నింగ్స్​లు ఆడటంలో దిట్ట అయిన కోహ్లీ కూడా టచ్​లోకి వస్తే దుమ్మురేపొచ్చని అనుకుంటోంది. వీళ్లిద్దరి నుంచి మెగా టోర్నీలో ఇప్పటిదాకా ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా రాలేదు. కాబట్టి అభిమానులకు ఉన్న ఆ బాకీని సూపర్ పోరులో వీళ్లు తీర్చుకుంటారేమో చూడాలి.