iDreamPost

ముగిసిన వరల్డ్ కప్ ఫస్టాఫ్.. సెమీస్ చేరే జట్లపై ఎక్స్​పర్ట్స్ ప్రిడిక్షన్!

  • Published Jun 20, 2024 | 7:43 PMUpdated Jun 20, 2024 | 7:43 PM

టీ20 వరల్డ్ కప్-2024 ఫస్టాఫ్ ముగిసింది. గ్రూప్ దశ నుంచి సూపర్-8కి టోర్నీ టర్న్ తీసుకుంది. ఇక మీదట జరిగే మ్యాచులతో సెమీస్ బెర్త్​లు కన్ఫర్మ్ కానున్నాయి.

టీ20 వరల్డ్ కప్-2024 ఫస్టాఫ్ ముగిసింది. గ్రూప్ దశ నుంచి సూపర్-8కి టోర్నీ టర్న్ తీసుకుంది. ఇక మీదట జరిగే మ్యాచులతో సెమీస్ బెర్త్​లు కన్ఫర్మ్ కానున్నాయి.

  • Published Jun 20, 2024 | 7:43 PMUpdated Jun 20, 2024 | 7:43 PM
ముగిసిన వరల్డ్ కప్ ఫస్టాఫ్.. సెమీస్ చేరే జట్లపై ఎక్స్​పర్ట్స్ ప్రిడిక్షన్!

టీ20 ప్రపంచ కప్-2024 ఫస్టాఫ్ ముగిసింది. గ్రూప్ దశ మ్యాచ్​లు ఉత్కంఠభరితంగా సాగాయి. సాధారణంగా పొట్టి ఫార్మాట్ మ్యాచ్​లు అంటే భారీ స్కోర్లతో అభిమానులను ఉర్రూతలూగిస్తాయి. కానీ ఈసారి సీన్ రివర్స్ అయింది. మెగాటోర్నీకి ఆతిథ్యం ఇచ్చిన అమెరికా, వెస్టిండీస్​లో పిచ్​లు ట్రిక్కీగా, స్లోగా ఉండటంతో టాప్ బ్యాటర్స్​ కూడా చేతులెత్తేశారు. ఒక్కో పరుగు చేసేందుకు ఆపసోపాలు పడ్డారు. బౌలర్లు మాత్రం వికెట్ల పండుగ చేసుకున్నారు. దీంతో ఫస్టాఫ్​లో మొత్తం లోస్కోరింగ్ మ్యాచ్​లే దర్శనమిచ్చాయి. అయితే ఇప్పుడు సూపర్-8 మ్యాచ్​లు మొదలైపోయాయి. ఇక నుంచి అన్ని మ్యాచులకు కరీబియన్ మైదానాలు హోస్ట్​గా ఉండనున్నాయి. అక్కడి వికెట్లు స్పిన్​తో పాటు బ్యాటింగ్​కు కూడా కాస్త అనుకూలంగా మారుతున్నాయి. దీంతో ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పొట్టి కప్పు లీగ్ స్టేజ్ నుంచి సూపర్-8కు సైడ్ తీసుకుంది. ఆల్రెడీ సూపర్-8 మ్యాచ్​లు స్టార్ట్ అయ్యాయి. దీంతో ఇప్పుడు ఎవరి డామినేషన్ నడుస్తుంది? ఏయే జట్లు సెమీస్​కు అర్హత సాధిస్తాయి? అనేది ఇంట్రెస్టింగ్​గా మారింది. టీమ్స్ ఆటతీరును బట్టి అభిమానులు తమ ప్రిడిక్షన్ మొదలుపెట్టారు. ఈ తరుణంలో కొందరు మాజీ క్రికెటర్లు, ఎక్స్​పర్ట్స్ కూడా జోస్యం చెప్పడం స్టార్ట్ చేశారు. సౌతాఫ్రికా మాజీ పేసర్ డేల్ స్టెయిన్, లెజెండరీ ఆల్​రౌండర్ షాన్ పొలాక్ సెమీస్ బెర్త్​లపై తమ ప్రిడిక్షన్ చెప్పారు. ఆ నాలుగు జట్లే నాకౌట్ స్టేజ్​కు చేరుకుంటాయంటూ తమ మనసులోని మాట చెప్పారు. వాళ్లు చెప్పిన టీమ్స్​లో భారత్ కూడా ఉంది. సౌతాఫ్రికా, టీమిండియాతో పాటు ఆస్ట్రేలియా, ఆతిథ్య వెస్టిండీస్​లు సెమీస్ చేరతాయని స్టెయిన్ అంచనా వేశాడు.

పొలాక్ కూడా సేమ్ స్టెయిన్​లాగే ప్రిడిక్షన్ ఇచ్చాడు. అతడు కూడా భారత్, ఆసీస్, వెస్టిండీస్, సౌతాఫ్రికానే నాకౌట్ స్టేజ్​కు అర్హత సాధిస్తాయని అన్నాడు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్, కామెంటేటర్ డానీ మోరిసన్ కాస్త భిన్నంగా జోస్యం చెప్పాడు. సెమీస్ చేరే జట్లలో టీమిండియా, ఆస్ట్రేలియా, విండీస్​తో పాటు ఇంగ్లండ్ కూడా ఉంటుందన్నాడు. దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ రియాక్ట్ అవుతున్నారు. భారత్, ఆస్ట్రేలియా ఎలాగైనా సెమీస్​కు చేరతాయని కామెంట్స్ చేస్తున్నారు. అలాగే సౌతాఫ్రికా కూడా టాప్​-4లో చోటు సంపాదిస్తుందని అంచనా వేస్తున్నారు. విండీస్, ఇంగ్లండ్​లో ఒక టీమ్ సెమీస్ రావడం పక్కా అని చెబుతున్నారు. అయితే బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్​ను తక్కువ అంచనా వేయడానికి లేదని.. ఏదైనా సాధ్యమేనని అంటున్నారు. మరి.. సూపర్-8 చేరిన జట్లలో నుంచి ఏవేవి సెమీస్​కు క్వాలిఫై అవుతాయని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి