Nidhan
ఇంగ్లండ్ జట్టు అనుకున్నది సాధించింది. అయితే ఆ టీమ్ ఆస్ట్రేలియాకు రుణపడి ఉంటుందనే చెప్పాలి. కంగారూల వల్ల సూపర్-8 గండాన్ని దాటింది ఇంగ్లీష్ టీమ్.
ఇంగ్లండ్ జట్టు అనుకున్నది సాధించింది. అయితే ఆ టీమ్ ఆస్ట్రేలియాకు రుణపడి ఉంటుందనే చెప్పాలి. కంగారూల వల్ల సూపర్-8 గండాన్ని దాటింది ఇంగ్లీష్ టీమ్.
Nidhan
స్కాట్లాండ్.. టీ20 వరల్డ్ కప్-2024లో అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ ఆకట్టుకుంది. ఎలాంటి అంచనాలు లేకుండా మెగాటోర్నీలోకి అడుగుపెట్టిన ఈ టీమ్.. వరుసగా నమీబియా, ఒమన్‌పై ఘనవిజయాలు సాధించింది. ఇంగ్లండ్‌తో జరగాల్సిన మొదటి మ్యాచ్ వర్షం వల్ల సాధ్యపడలేదు. అందులో కూడా ఆడిన 10 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 90 పరుగులు చేసింది. ఆ తర్వాతి మ్యాచుల్లో నమీబియా, ఒమన్‌ను చిత్తు చేసింది. దీంతో స్కాట్లాండ్ సూపర్-8 చేరడం పక్కా అని అంతా అనుకున్నారు. మరోవైపు ఇదే గ్రూపులో ఉన్న ఆస్ట్రేలియా అప్పటికే సూపర్ పోరుకు అర్హత సాధించడంతో.. ఇక, ఇంగ్లండ్ పనైపోయిందని అంతా అనుకున్నారు. ఆసీస్‌తో జరిగే ఆఖరి మ్యాచ్‌లో స్కాట్లాండ్ గెలిస్తే ఇంగ్లీష్ టీమ్ ఇంటికేనని ఫిక్స్ అయ్యారు.
ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో ఓడినా మంచి రన్‌రేట్ ఉంటే స్కాట్లాండ్ సూపర్-8 చేరే ఛాన్స్ ఉండటంతో ఇంగ్లండ్ ఖేల్‌ఖతం అని అందరూ అనుకున్నారు. అయితే ఆసీస్ పుణ్యమాని సూపర్ పోరుకు అర్హత సాధించింది ఇంగ్లీష్ టీమ్. స్కాట్లాండ్తో ఇవాళ ఉదయం జరిగిన మ్యాచ్‌లో కంగారూ జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన స్కాట్లాండ్.. 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 180 పరుగుల భారీ స్కోరు చేసింది. బ్రెండన్ మెక్‌ముల్లెన్ (34 బంతుల్లో 60), రిచ్ బెర్రింగ్టన్ (31 బంతుల్లో 42 నాటౌట్) విధ్వంసక బ్యాటింగ్‌తో టీమ్‌కు మంచి స్కోరు అందించారు. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆసీస్.. ఒక దశలో 60 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే మార్కస్ స్టొయినిస్ (29 బంతుల్లో 59) విన్నింగ్ నాక్‌తో టీమ్‌ను విజయతీరాలకు చేర్చాడు.
ఆఖర్లో టిమ్ డేవిడ్ (14 బంతుల్లో 24 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో స్కాట్లాండ్ను వణికించాడు. అంతకుముందు ఓపెనర్ ట్రావిస్ హెడ్ (49 బంతుల్లో 68) అపోజిషన్ బౌలర్లను ఊచకోత కోశాడు. 5 ఫోర్లు, 4 సిక్సులతో చెలరేగిపోయాడు. ఆ తర్వాత స్టొయినిస్ రాణించినా మ్యాచ్ లాస్ట్ ఓవర్‌కు వెళ్లింది. అయితే డేవిడ్ నిలబడి పోరాడి ఇంకో రెండు బంతులు ఉండగానే టీమ్‌కు విక్టరీ అందించాడు. స్టొయినిస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. కీలక మ్యాచ్‌లో స్కాట్లాండ్ ఓటమితో ఇంగ్లండ్ సూపర్-8కు చేరింది. గ్రూప్-బీలో ఈ రెండు జట్లు సమానమైన పాయింట్లతో ఉన్నాయి. అయితే మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా ఇంగ్లీష్ టీమ్ నెక్స్ట్ స్టేజ్‌కు చేరింది. ఆసీస్ గనుక ఓడిపోతే ఆ జట్టు ఇంటిదారి పట్టేది. అయితే సూపర్-8కు చేరుకోకపోయినా అద్భుతమైన ఆటతీరు, పోరాట పటిమతో అందరి హృదయాలు గెలుచుకుంది స్కాట్లాండ్.
FEEL FOR SCOTLAND…!!!
They were one of the best performing teams in the Group of England and Australia. Missed out on the Super8 spot due to NRR, but they gave sleepless nights to England. 👏 pic.twitter.com/TAXlHXWI7o
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 16, 2024