Rohit Sharma: ఆ ఒక్క ఆలోచన రోహిత్​ను మార్చేసింది.. ఈ సక్సెస్​కు అదే కారణం: మాజీ క్రికెటర్

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. తన బ్యాట్ పవర్​తో ప్రత్యర్థి బౌలర్లకు ఓ రేంజ్​లో పోయిస్తున్నాడు. అతడ్ని చూస్తేనే అవతలి జట్లు జడుసుకుంటున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. తన బ్యాట్ పవర్​తో ప్రత్యర్థి బౌలర్లకు ఓ రేంజ్​లో పోయిస్తున్నాడు. అతడ్ని చూస్తేనే అవతలి జట్లు జడుసుకుంటున్నాయి.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ పొట్టి వరల్డ్ కప్​లో దుమ్మురేపుతున్నాడు. తన బ్యాట్ పవర్​తో ప్రత్యర్థి బౌలర్లకు ఓ రేంజ్​లో పోయిస్తున్నాడు. అతడ్ని చూస్తేనే అవతలి జట్లు జడుసుకుంటున్నాయి. ఇప్పటిదాకా జరిగిన మ్యాచుల్లో కలిపి అతడు 191 పరుగులు చేశాడు. గత మ్యాచ్​లో ఆస్ట్రేలియా మీద 41 బంతుల్లోనే 92 పరుగులు చేశాడు. కంగారూ బౌలర్లను ఊచకోత కోశాడు. ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్ లాంటి వరల్డ్ క్లాస్ బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. కొడితే బంతి గ్రౌండ్ దాటాల్సిందే అనేలా అతడి బ్యాటింగ్ సాగింది. కమిన్స్ బౌలింగ్​లో హిట్​మ్యాన్ కొట్టిన ఓ బంతి ఏకంగా స్టేడియం అవతల పడింది. సూపర్ పోరులో రెచ్చిపోయిన భారత సారథి.. నాకౌట్ ఫైట్​లో ఇంగ్లండ్ మీద కూడా ఇదే విధంగా ఆడాలని అనుకుంటున్నాడు.

ఇక, సాధారణంగా క్రికెట్​లో రికార్డులకు ఎంతో ప్రాముఖ్యతను ఇస్తారు. ఫలానా బౌలర్ ఈ రికార్డు సాధించాడు, ఫలానా బ్యాటర్ ఈ ఫీట్​ను అందుకున్నాడంటూ ఫ్యాన్స్ తమ అభిమాన ఆటగాళ్ల గురించి గొప్పగా చెప్పుకుంటారు. ప్లేయర్లు కూడా రికార్డులను అందుకోవడం అఛీవ్​మెంట్​గా భావిస్తారు. అయితే రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు మాత్రం రికార్డుల కోసం కాకుండా గెలుపే లక్ష్యంగా ఆడుతుండటం గమనించే ఉంటారు. మొన్న ఆసీస్​తో మ్యాచ్​లో సెంచరీ చేసే ఛాన్స్ ఉన్నా రోహిత్ షాట్​కు ప్రయత్నించి ఔట్ అయ్యాడు. రికార్డుల రారాజు అయిన కోహ్లీ కూడా మొదటి బాల్ నుంచే ఫుల్ ఇంటెంట్​తో ఆడుతున్నాడు. జట్టు గెలుపు తప్ప ఇంకొకటి ఏదీ వద్దనే రోహిత్ ఆలోచన టీమ్ ఆడేతీరును మార్చేసింది. ఇదే అభిప్రాయాన్ని మాజీ క్రికెటర్ సంజయ్ మంజ్రేకర్ కూడా వ్యక్తం చేశాడు. స్వార్థాన్ని వదిలేసి సెల్ఫ్​లెస్​నెస్​తో అతడు ఆడుతున్నాడని చెప్పాడు.

రికార్డులు కాదు.. టీమ్ గెలుపే ముఖ్యమనే ఆలోచన రోహిత్​ను పూర్తిగా మార్చేసిందన్నాడు సంజయ్ మంజ్రేకర్. అతడిలో ఏ కోశాన కూడా స్వార్థం లేదన్నాడు. ‘వరల్డ్ కప్​లో రోహిత్ శర్మ అద్భుతంగా ఆడుతున్నాడు. ఆస్ట్రేలియాతో మ్యాచ్​లో అతడి నాక్ అదిరిపోయింది. ఆ మ్యాచ్​లో హిట్​మ్యాన్ బ్యాటింగ్ చూసి ఇంత ఈజీగా బిగ్ షాట్స్ ఎలా ఆడుతున్నాడని ఆడియెన్స్, ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. అయితే అతడి సెల్ఫ్​లెస్​నెస్ వల్లే ఇలాంటివి సాధ్యం అవుతున్నాయి. స్వార్థం లేకుండా టీమ్​ విజయం కోసం ఆడటం రోహిత్​లో ఉన్న ప్రత్యేకత. ఫిఫ్టీలు, హండ్రెడ్​ల గురించి అతడు టెన్షన్ పడడు. రికార్డులను అస్సలు పట్టించుకోడు’ అని మంజ్రేకర్ చెప్పుకొచ్చాడు. మరి.. స్వార్థం లేకుండా ఆడటమే రోహిత్ సక్సెస్​కు కారణమనే వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments