ఆ విషయంలో రోహిత్​ను మించినోడు లేడు.. భారత కెప్టెన్​పై గిల్​క్రిస్ట్ ప్రశంసలు!

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడం గిల్​క్రిస్ట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఆ విషయంలో హిట్​మ్యాన్​ను మించినోడు లేడని చెప్పాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై ఆస్ట్రేలియా లెజెండ్ ఆడం గిల్​క్రిస్ట్ ప్రశంసల జల్లులు కురిపించాడు. ఆ విషయంలో హిట్​మ్యాన్​ను మించినోడు లేడని చెప్పాడు.

టీమిండియా పంజా విసిరింది. డేంజరస్​ సైడ్​గా మారిన ఆఫ్ఘానిస్థాన్​ను చిత్తుగా ఓడించింది. తమ పనైపోయింది, ఇక కష్టమేనని విమర్శించిన వారికి చెంపపెట్టు లాంటి సమాధానం ఇచ్చింది. టీ20 వరల్డ్ కప్​-2024 సూపర్-8లో తొలి మ్యాచ్​లో గ్రాండ్ విక్టరీ కొట్టింది రోహిత్ సేన. ఆఫ్ఘాన్​తో జరిగిన మ్యాచ్​లో 47 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. సెమీస్ చేరాలంటే ప్రతి మ్యాచ్ కీలకంగా మారిన దశలో వెస్టిండీస్​ పిచ్​లపై ఆడిన తొలి పోరులో విజయఢంకా మోగించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్​లో డామినేట్ చేస్తూ మ్యాచ్​ను వన్​సైడ్ చేసేసింది. భారత్ జోరు ముందు ప్రత్యర్థి జట్టు ఏ దశలోనూ నిలబడలేకపోయింది. ఇది కదా తాము కోరుకుంది అని ప్లేయర్ల పెర్ఫార్మెన్స్​ చూశాక అభిమానులు అంటున్నారు.

నిన్నటి మ్యాచ్​లో అటు బ్యాటింగ్​లోనూ, ఇటు బౌలింగ్​లోనూ భారత ఆటగాళ్లు రెచ్చిపోయారు. స్లో పిచ్​పై 150 పరుగులు చేస్తే గొప్ప అని అనుకుంటే.. టీమిండియా ఏకంగా 182 పరుగుల టార్గెట్ సెట్ చేసింది. సూర్యకుమార్ యాదవ్ (28 బంతుల్లో 53) స్పెషల్ నాక్​తో తన విలువ ఏంటో చూపించాడు. ఆ తర్వాత జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ చెరో 3 వికెట్లతో చెలరేగారు. కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశాడు. బౌలర్లు అందరూ కనీసం ఒక్కో వికెట్ తీశారు. దీంతో ఆఫ్ఘాన్ 134 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ రోహిత్ బ్యాటింగ్​లో విఫలమైనా తన వ్యూహాలతో ఆకట్టుకున్నాడు. అపోజిషన్ టీమ్​కు ఎక్కడా కోలుకునే అవకాశం ఇవ్వలేదు. దీంతో అతడిపై అన్ని వైపుల నుంచి ప్రశంసల జల్లులు కురుస్తున్నాయి. ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్​క్రిస్ట్ కూడా అతడ్ని మెచ్చుకున్నాడు.

రోహిత్ సారథ్యం సూపర్బ్ అని గిల్​క్రిస్ట్ అన్నాడు. ప్లానింగ్, స్ట్రాటజీ విషయంలో అతడ్ని మించినోడు ప్రస్తుత క్రికెట్​లో లేరంటూ ప్రశంసల్లో ముంచెత్తాడు. ఈ మెగాటోర్నీలో కెప్టెన్​గా హిట్​మ్యాన్​ అనుసరిస్తున్న వ్యూహాలు అద్భుతమని తెలిపాడు. ఆఫ్ఘానిస్థాన్​తో మ్యాచ్​లో బౌలర్లను రొటేట్ చేసిన తీరు, ఫీల్డ్ పొజిషన్స్​ బ్రిలియంట్ అని గిల్​క్రిస్ట్ పేర్కొన్నాడు. రోహిత్​పై గిల్లీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్.. అవును, కెప్టెన్​గా రోహిత్ హవా నడుస్తోందని అంటున్నారు. భారత్ ఫీల్డింగ్​ టైమ్​లో అతడు తీసుకుంటున్న నిర్ణయాలు, పన్నుతున్న వ్యూహాలు టీమ్​కు బిగ్ ప్లస్ అవుతున్నాయని చెబుతున్నారు. హిట్​మ్యాన్​ స్ట్రాటజీలకు ప్రత్యర్థి బ్యాటర్లకు మైండ్​బ్లాంక్ అవుతోందని అంటున్నారు. మరి.. ఈ వరల్డ్ కప్​లో రోహిత్ సారథ్యం మీకెలా అనిపించిందో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments