iDreamPost
android-app
ios-app

భారత ఆటగాళ్లకు దేశభక్తి లేదు.. వరల్డ్ కప్ హీరో సెన్సేషనల్ కామెంట్స్!

  • Published Jul 02, 2024 | 8:31 PM Updated Updated Jul 02, 2024 | 8:31 PM

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్-2024 సందడి ఇంకా పూర్తవలేదు. ఆటగాళ్లతో పాటు మొత్తం భారతావని ఆ ఆనందం నుంచి ఇంకా బయటకు రాలేదు. రోహిత్ సేన కప్పు అందుకున్న క్షణాలను ఇంకా ఎవరూ మర్చిపోలేదు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్-2024 సందడి ఇంకా పూర్తవలేదు. ఆటగాళ్లతో పాటు మొత్తం భారతావని ఆ ఆనందం నుంచి ఇంకా బయటకు రాలేదు. రోహిత్ సేన కప్పు అందుకున్న క్షణాలను ఇంకా ఎవరూ మర్చిపోలేదు.

  • Published Jul 02, 2024 | 8:31 PMUpdated Jul 02, 2024 | 8:31 PM
భారత ఆటగాళ్లకు దేశభక్తి లేదు.. వరల్డ్ కప్ హీరో సెన్సేషనల్ కామెంట్స్!

టీ20 ప్రపంచ కప్-2024 సందడి ఇంకా పూర్తవలేదు. ఆటగాళ్లతో పాటు మొత్తం భారతావని ఆ ఆనందం నుంచి ఇంకా బయటకు రాలేదు. రోహిత్ సేన కప్పు అందుకున్న క్షణాలను ఇంకా ఎవరూ మర్చిపోలేదు. 13 ఏళ్ల ప్రపంచ కప్ కల నెరవేరడంతో అందరూ సెలబ్రేషన్స్​లో బిజీగా ఉన్నారు. ఒకవైపు అందరూ మెగాటోర్నీ గురించి మాట్లాడుకుంటున్న తరుణంలోనే మరోవైపు ఇంట్రెస్టింగ్ సిరీస్​కు సన్నద్ధమవుతోంది మెన్ ఇన్ బ్లూ. జింబాబ్వేతో 5 టీ20ల సిరీస్ ఆడనుంది భారత జట్టు. ఈ టీమ్​కు యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్ కెప్టెన్​గా వ్యవహరించనున్నాడు. అతడితో పాటు అభిషేక్ శర్మ, రింకూ సింగ్, రుతురాజ్ గైక్వాడ్, ధృవ్ జురెల్, వాషింగ్టన్ సుందర్ లాంటి ఇతరులు కూడా ఈ సిరీస్​లో భారత్ తరఫున బరిలోకి దిగనున్నారు.

ఐపీఎల్-2024లో రఫ్ఫాడించిన రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ రియాన్ పరాగ్ కూడా ఈ సిరీస్​లో ఆడే అవకాశాన్ని దక్కించుకున్నాడు. టీమిండియా తరఫున అరంగేట్రం చేసే అవకాశం రావడంతో అతడు ఉబ్బితబ్బిబ్బవుతున్నాడు. ఐపీఎల్ ఫామ్​నే జింబాబ్వే మీద కూడా కొనసాగించాలని చూస్తున్నాడు. సూపర్బ్ ఇన్నింగ్స్​లు ఆడుతూ టీమ్​లో తన ప్లేస్​ను పర్మినెంట్ చేసుకోవాలని భావిస్తున్నాడు. ఈ తరుణంలో మాజీ క్రికెటర్, వరల్డ్ కప్ హీరో శ్రీశాంత్ అతడిపై సీరియస్ అయ్యాడు. భారత జట్టుకు ఆడే ముందు దేశభక్తి పెంచుకోమని అతడ్ని హెచ్చరించాడు. కొందరు యంగ్​స్టర్స్ టీ20 వరల్డ్ కప్​లో భారత్ ఆడే మ్యాచులు చూడలేదని అంటున్నారు. టీమ్​కు ఎంపిక కాలేదు కాబట్టి మ్యాచుల్ని చూడమని చెబుతున్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్ అని శ్రీశాంత్ ప్రశ్నించాడు.

టీమిండియా ఆడే మ్యాచుల్ని చూడలేని వారు.. దేశానికి ప్రాతినిధ్యం వహిందుకు అర్హులా? అని శ్రీశాంత్ క్వశ్చన్ చేశాడు. ఇటీవల ఓ పాడ్​కాస్ట్​ షోలో రియాన్ పరాగ్ మాట్లాడుతూ భారత్ ఆడే వరల్డ్ కప్ మ్యాచులు చూడనని చెప్పాడు. తనకు ప్రపంచ కప్​లో ఆడాలని ఉందన్నాడు. కానీ మ్యాచులు మాత్రం చూడనని తెలిపాడు. ఒకవేళ టీమిండియా మ్యాచులు చూస్తే.. తన మీద తనకు డౌట్స్ వస్తాయని, తన కంటే ఇతర ప్లేయర్లు బెస్ట్, తాను వెనుకబడిపోయానా అనే అనుమానాలు వస్తాయని పరాగ్ పేర్కొన్నాడు. అప్పుడు నెట్స్​కు వెళ్లి బంతుల్ని బలంగా బాదడం తప్ప చేసేదేమీ ఉండదన్నాడు. ఈ వ్యాఖ్యలపై తాజాగా శ్రీశాంత్ పైవిధంగా రియాక్ట్ అయ్యాడు. క్రికెట్ లవర్స్ ఎవరైనా ముందు దేశాన్ని ప్రేమించాలన్నాడు. ఎంతటి ప్లేయర్ అయినా దేశభక్తి లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా వేస్ట్ అంటూ పరాగ్​ను విమర్శించాడు. మరి.. యంగ్ ప్లేయర్లకు దేశభక్తి లేదంటూ శ్రీశాంత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.