Nidhan
ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-8 పోరులో భారత ఆటగాళ్లు భుజానికి నల్ల రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగారు. టీమిండియా ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
ఆఫ్ఘానిస్థాన్‌తో జరుగుతున్న సూపర్-8 పోరులో భారత ఆటగాళ్లు భుజానికి నల్ల రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగారు. టీమిండియా ప్లేయర్లు ఎందుకిలా చేశారో ఇప్పుడు తెలుసుకుందాం..
Nidhan
టీమిండియా సూపర్-8 జర్నీ స్టార్ట్ అయింది. ఆఫ్ఘానిస్థాన్-భారత్ మధ్య సూపర్ పోరు మొదలైంది. టాస్ నెగ్గిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. అయితే ఈ మ్యాచ్‌లో మెన్ ఇన్ బ్లూ మొత్తం భుజానికి నల్ల రంగు రిబ్బన్లు వేసుకొని బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. భారత ఆటగాళ్లు ఎందుకు బ్లాక్ ఆర్మ్బ్యాండ్స్ వేసుకొని ఆడుతున్నారనేది తెలుసుకోవాలని చాలా మంది ఆసక్తి చూస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్ డేవిడ్ జాన్సన్‌కు గౌరవార్థకంగా రోహిత్ సేన ఇవాళ నల్ల రిబ్బన్లతో బరిలోకి దిగారు.
టీమిండియా మాజీ పేసర్, కర్ణాటక రంజీ ప్లేయర్ డేవిడ్ జాన్సన్ (52) ఇవాళ సూసైడ్ చేసుకున్నాడు. బెంగళూరులోని తన ఫ్యామిలీ ఉంటున్న అపార్ట్మెంట్ బాల్కనీ నుంచి పడి ఆత్మహత్య చేసుకున్నాడు. అంత ఎత్తు నుంచి కింద పడటంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. కొన్నాళ్లుగా అతడు డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. 1996లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో డేవిడ్ భారత జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. భీకర పేస్‌తో బౌలింగ్ చేసినప్పటికీ కంట్రోల్ లేకపోవడంతో అతడి కెరీర్ రెండు మ్యాచులకే పరిమితమైంది. అందులో అతడు 3 వికెట్లు పడగొట్టాడు. అయితే ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో మాత్రం 29 మ్యాచుల్లో 125 వికెట్లు తీశాడు జాన్సన్. అలాగే ఓ సెంచరీ కూడా బాదాడు. భారత క్రికెట్‌కు అతడు అందించిన సేవలకు గౌరవ సూచకంగా, అతడి మృతికి నివాళిగా ఇవాళ టీమిండియా ప్లేయర్లు బ్లాక్ బ్యాండ్స్ ధరించి గ్రౌండ్లోకి దిగారు.
Indian Players Wear Black Armbands for marking the respect to Former Cricketer David Johnson who passed away today. 🕊️ pic.twitter.com/yNDrgvVvYz
— Johns. (@CricCrazyJohns) June 20, 2024