iDreamPost

భారత్​ను భయపెడుతున్న ఆ ముగ్గురు.. కంగారూలపై రివేంజ్​ కష్టమేనా?

  • Published Jun 24, 2024 | 3:18 PMUpdated Jun 24, 2024 | 3:46 PM

ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పొట్టి కప్పులో ఇప్పటివరకు భారత్​ జర్నీ ఒక లెక్క. ఇక మీదట ఎలా ఆడుతుంది? అనేదే ముఖ్యం. ఇవాళ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తే సెమీస్​కు చేరుతుంది రోహిత్ సేన. అంతేకాదు కంగారూల కథను సూపర్-8లోనే ముగించిన క్రెడిట్ కూడా దక్కుతుంది.

ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పొట్టి కప్పులో ఇప్పటివరకు భారత్​ జర్నీ ఒక లెక్క. ఇక మీదట ఎలా ఆడుతుంది? అనేదే ముఖ్యం. ఇవాళ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తే సెమీస్​కు చేరుతుంది రోహిత్ సేన. అంతేకాదు కంగారూల కథను సూపర్-8లోనే ముగించిన క్రెడిట్ కూడా దక్కుతుంది.

  • Published Jun 24, 2024 | 3:18 PMUpdated Jun 24, 2024 | 3:46 PM
భారత్​ను భయపెడుతున్న ఆ ముగ్గురు.. కంగారూలపై రివేంజ్​ కష్టమేనా?

ఇన్నాళ్లూ ఒక లెక్క, ఇక నుంచి ఒక లెక్క. పొట్టి కప్పులో ఇప్పటివరకు భారత్​ జర్నీ ఒక లెక్క. ఇక మీదట ఎలా ఆడుతుంది? అనేదే ముఖ్యం. ఇవాళ ఆస్ట్రేలియాను మట్టికరిపిస్తే సెమీస్​కు చేరుతుంది రోహిత్ సేన. అంతేకాదు కంగారూల కథను సూపర్-8లోనే ముగించిన క్రెడిట్ కూడా దక్కుతుంది. సూపర్-8 దశలో ఇప్పటిదాకా ఆడిన రెండు మ్యాచుల్లోనూ నెగ్గిన మెన్ ఇన్ బ్లూ ఇంకా సెమీస్​కు చేరుకోలేదు. ఆ బెర్త్​ కన్ఫర్మ్ అవ్వాలంటే ఆసీస్​పై గెలవాలి. ఒకవేళ ఓడినా తక్కువ తేడాతో ఓడాలి. అలా కాదని భారీ తేడాతో మ్యాచ్​ను కోల్పోయిందా క్వాలిఫికేషన్ సమస్యలు స్టార్ట్ అవుతాయి. అందుకే కంగారూల పనిపడితే సరిపోతుంది. అటు ఆసీస్ టీమ్​కు ఇది చావోరేవో సిచ్యువేషన్. గెలిస్తే సెమీస్​కు లేదా ఇంటికే అన్నట్లు ఆ జట్టు పరిస్థితి ఉంది.

భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ రిజల్ట్​ను బట్టి ఆఫ్ఘానిస్థాన్ సెమీస్ అవకాశాలు ఆధారపడి ఉంటాయి. ఒకవేళ ఆసీస్ ఓడితే టీమిండియాతో పాటు ఆఫ్ఘాన్ సెమీస్ చేరొచ్చు. ఇటు ఆస్ట్రేలియా ఓడాలి, అటు బంగ్లా మీద ఆఫ్ఘాన్ నెగ్గాలి. అప్పుడే ఆ టీమ్ నెక్స్ట్ స్టేజ్​కు చేరుకుంటుంది. ఇలా ఈ గ్రూప్​లో ఎంతో కీలకంగా మారిన ఈ మ్యాచ్ కోసం మూడు దేశాల అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అందరికంటే ఎక్కువగా టీమిండియా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వన్డే ప్రపంచ కప్-2023లో మెన్ ఇన్ బ్లూను ఓడించిన ఆసీస్​పై రివేంజ్ తీర్చుకోవడానికి ఇది పర్ఫెక్ట్ టైమ్ అంటున్నారు. ఆ టీమ్​ను మట్టికరిపించి ఇంటికి పంపాలని, దీన్ని మించిన ప్రతీకారం లేదని అంటున్నారు. అయితే భారత్ పగ తీరాలంటే ఆ ముగ్గుర్నీ ఆపాల్సి ఉంటుంది. ఓపెనర్ ట్రావిస్ హెడ్, పేసర్లు ప్యాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్​ భయాన్ని రోహిత్ సేన దాటాలి. అప్పుడే విజయం దక్కుతుంది.

వరల్డ్ కప్-2023 ఫైనల్​లో భారత్​ను ఓడించడంలో హెడ్, స్టార్క్, కమిన్స్ కీలక పాత్ర పోషించారు. బ్యాటింగ్​లో హెడ్ (120 బంతుల్లో 137) విధ్వంసక సెంచరీతో టీమిండియా చేతుల్లో నుంచి మ్యాచ్​ను లాక్కున్నాడు. అంతకుముందు ఫస్ట్ ఇన్నింగ్స్​లో కమిన్స్, స్టార్క్ కలసి 5 వికెట్లతో మన బ్యాటింగ్ యూనిట్​ను కుప్పకూల్చారు. వీళ్లలో హెడ్, కమిన్స్ ఇప్పుడు మంచి ఫామ్​లో ఉన్నారు. పొట్టి కప్పులో హెడ్ 179 పరుగులు చేశాడు. కమిన్స్ 9 వికెట్లు తీశాడు. గత రెండు మ్యాచుల్లోనూ అతడు హ్యాట్రిక్ నమోదు చేశాడు. స్టార్క్ ఫామ్​లో లేకపోయినా అతడి గురించి తెలిసిందే. ఈ ముగ్గురు ప్లేయర్లు బిగ్ మ్యాచెస్​లో బాగా ఆడతారు. తమ శక్తులన్నీ బయటకు తీసి చెలరేగుతారు. అందుకే వీళ్లను రోహిత్ సేన ఆపాలి. ఈ ముగ్గురి పనిపడితే కంగారూ జట్టు కథ ముగిసినట్లేనని ఎక్స్​పర్ట్స్ కూడా చెబుతున్నారు. మరి.. వీళ్ల ముగ్గురి భయాన్ని దాటి భారత్ పగ తీర్చుకుంటుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి