iDreamPost
android-app
ios-app

టీ20 ప్రపంచ కప్‌లో మన విజయాలు సరే.. పోతున్న పరువు సంగతి ఏంటి?

  • Published Jun 17, 2024 | 4:58 PMUpdated Jun 17, 2024 | 4:58 PM

టీ20 వరల్డ్ కప్-2024లో వరుస విజయాలతో సూపర్-8కు చేరుకుంది టీమిండియా. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ వరకు ఓకే.. కానీ పోతున్న పరువు సంగతి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్-2024లో వరుస విజయాలతో సూపర్-8కు చేరుకుంది టీమిండియా. బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్ వరకు ఓకే.. కానీ పోతున్న పరువు సంగతి ఏంటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

  • Published Jun 17, 2024 | 4:58 PMUpdated Jun 17, 2024 | 4:58 PM
టీ20 ప్రపంచ కప్‌లో మన విజయాలు సరే.. పోతున్న పరువు సంగతి ఏంటి?

పొట్టి కప్పులో వరుస విజయాలతో భారత జట్టు అదరగొడుతోంది. గ్రూప్ స్టేజ్​లో ఆడిన మూడు మ్యాచుల్లో విజయాలు సాధించి సూపర్-8కు క్వాలిఫై అయింది. ఆఖరి మ్యాచ్​లో కెనడాను కూడా చిత్తు చేద్దామని అనుకుంది. కానీ వర్షం కారణంగా ఒక్క బంతి కూడా పడకుండానే ఆ మ్యాచ్ రద్దైంది. గ్రూప్ టాపర్​గా నిలిచిన రోహిత్ సేన.. దర్జాగా సూపర్-8 బరిలో అడుగుపెట్టింది. బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియాతో తదుపరి మ్యాచుల్లో తలపడనుంది మెన్ ఇన్ బ్లూ. ఈ మూడు టీమ్స్​లో కనీసం రెండింటి మీద నెగ్గి, నెట్ రన్​రేట్ మెరుగ్గా ఉంచుకుంటే సెమీస్​కు చేరుకోవచ్చు. మూడింట్లోనూ గెలిస్తే ఇంక జట్టుకు తిరుగే ఉండదు. దీంతో సూపర్ పోరు కోసం రోహిత్ అండ్ కో రెడీ అవుతున్నారు. అయితే వరుస విజయాలు బాగానే ఉన్నా.. జట్టు పరువు పోతుండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

బ్యాక్ టు బ్యాక్ విక్టరీస్​తో మెగా టోర్నీలో టీమిండియా దుమ్మురేపుతోంది. ఎదురొచ్చిన ప్రతి ప్రత్యర్థిని చిత్తు చేస్తూ పోతోంది. ఇంతవరకు బాగానే ఉన్నా ఒక విషయంలో మాత్రం టీమ్ పరువు పోతోంది. ఈ వరల్డ్ కప్​లో భారత బ్యాటర్ల పేలవంగా ఆడుతున్న సంగతి తెలిసిందే. తాజాగా వారి బ్యాటింగ్ పెర్ఫార్మెన్స్​పై గణాంకాలు వెల్లడయ్యాయి. ఇప్పటిదాకా ప్రపంచ కప్​లో జరిగిన మ్యాచ్​లు ముగిసే సరికి హయ్యెస్ట్ స్కోర్స్ చేసిన ప్లేయర్ల లిస్ట్​ను రిలీజ్ చేశారు. అయితే ఆశ్చర్యకరంగా టాప్-15లో ఒక్క టీమిండియా బ్యాటర్ కూడా లేడు. పించ్ హిట్టర్ రిషబ్ పంత్ 17వ స్థానంలో నిలిచాడు. అతడు మూడు మ్యాచుల్లో 96 పరుగులు చేశాడు. మన జట్టులో ఒక్క బ్యాటర్ కూడా 100 పరుగుల మార్క్​ను టచ్ చేయకపోవడం గమనార్హం.

అత్యధిక పరుగుల వీరుల జాబితాలో ఆఫ్ఘానిస్థాన్ బ్యాటర్ రెహ్మానుల్లా గుర్బాజ్ ఫస్ట్ ప్లేస్​లో ఉన్నాడు. అతడు మూడు మ్యాచుల్లో కలిపి 167 రన్స్ చేశాడు. అతడి తర్వాతి స్థానాల్లో ఆస్ట్రేలియా ఆటగాళ్లు మార్కస్ స్టొయినిస్ (156 పరుగులు), ట్రావిస్ హెడ్ (148 పరుగులు) ఉన్నారు. అమెరికా బ్యాటర్ ఆరోన్ జోన్స్ (141 పరుగులు) నాలుగో స్థానంలో నిలిచాడు. స్కాట్లాండ్​ ఆటగాడు బ్రెండన్ మెక్​మిలన్ ఫిఫ్త్ ప్లేస్​ను దక్కించుకున్నాడు. అతడు మూడు ఇన్నింగ్స్​ల్లో కలిపి 140 రన్స్ చేశాడు. పాకిస్థాన్​ ఓటములతో విమర్శలపాలవుతున్న ఆ టీమ్ కెప్టెన్ బాబర్ ఆజం (122) ఏడో స్థానంలో నిలిచాడు. అదే జట్టుకు చెందిన సీనియర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ (110 పరుగులు) పదో స్థానాన్ని దక్కించుకున్నాడు.

టీమిండియా నుంచి పంత్ 17వ స్థానంలో ఉండగా.. సారథి రోహిత్ శర్మ (68 పరుగులు) 34వ ర్యాంక్​లో ఉన్నాడు. మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ (59 పరుగులు) 46వ స్థానంలో కొనసాగుతున్నాడు. సాధారణంగా ఐసీసీ టోర్నీల్లో విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి భారత బ్యాటర్లు టాప్-3 లేదా కనీసం టాప్-10లో అయినా చోటు దక్కించుకుంటారు. ముఖ్యంగా కోహ్లీ అయితే ఆకాశమే హద్దుగా చెలరేగి హయ్యెస్ట్ స్కోరర్​గా నిలవడం చూస్తుంటాం. కానీ ఈసారి అతడు దారుణమైన ఆటతీరుతో మూడు మ్యాచుల్లో కలిపి 5 పరుగులే చేశాడు. రోహిత్, సూర్య లాంటి స్టార్ బ్యాటర్లు కూడా విఫలమవుతున్నారు. బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ కలసికట్టుగా రాణిస్తుండటంతో వరుస విజయాలు దక్కాయి లేదంటే మన టీమ్ పరిస్థితి ఎలా ఉండేదో అని అంతా అనుకుంటున్నారు. ఇంత పేరు ఉన్న ఆటగాళ్లు టాప్-15లో కూడా చోటు దక్కించుకోకపోవడంతో నెట్టింట ట్రోల్ చేస్తున్నారు. ఇది టీమిండియాకు దారుణ అవమానమని కామెంట్స్ చేస్తున్నారు. మరి.. భారత బ్యాటర్లు జట్టు పరువు తీస్తుండటంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి