Rohit Sharma At Pitch After Win: వీడియో: కప్పు కొట్టిన తర్వాత పిచ్‌పై మట్టి తిన్న రోహిత్‌! ఎందుకలా చేశాడంటే..?

Rohit Sharma: వీడియో: కప్పు కొట్టిన తర్వాత పిచ్‌పై మట్టి తిన్న రోహిత్‌! ఎందుకలా చేశాడంటే..?

సౌతాఫ్రికాపై గెలిచి కప్పు కొట్టడంతో భారత ఆటగాళ్లంతా ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

సౌతాఫ్రికాపై గెలిచి కప్పు కొట్టడంతో భారత ఆటగాళ్లంతా ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని ఇప్పుడు వైరల్ అవుతోంది.

ఈ రోజు కోసం 13 ఏళ్లుగా ఎదురు చూశారు కోట్లాది మంది భారతీయులు. అందని ద్రాక్షగా మారిన వరల్డ్ కప్​ను ఎప్పటికైనా అందుకోకపోరా అని అనుకున్నారు. ఒకట్రెండు సార్లు కప్పు దగ్గరి దాకా వచ్చి మిస్సవడంతో వాళ్ల హార్ట్ బ్రేక్ అయింది. అయితే ఆటగాళ్ల మీద నమ్మకం ఉంచారు. ఈసారి కప్పు మిస్సవ్వొద్దని అనుకున్నారు. రోహిత్ సేన టైటిల్ నెగ్గుతుందని విశ్వసించారు. ప్రపంచ కప్ కల తీరుస్తారని ఆశలు పెట్టుకున్నారు. వారి నమ్మకం వమ్ముకాలేదు. భారత్ టీ20 వరల్డ్ కప్-2024ని ముద్దాడింది. ఆఖరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన మెగా ఫైనల్​లో 7 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించి నయా ఛాంపియన్​గా అవతరించింది. దీంతో టీమిండియా ఫ్యాన్స్ సంతోషంలో మునిగిపోయారు. ఆనందం పట్టలేక ఏడ్చేశారు.

భారత్ విజయాన్ని అభిమానులు ఫుల్​గా సెలబ్రేట్ చేసుకున్నారు. వీధుల్లోకి వచ్చి జాతీయ పతాకం చేతపట్టి భారత్ మాతా కీ జై అంటూ నినాదాలు చేశారు. బాణసంచా కాలుస్తూ, మిఠాయిలు పంచుతూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. టీమ్ ఛాంపియన్స్​గా నిలవడంతో భారత ఆటగాళ్లు కూడా సంబురాల్లో మునిగిపోయారు. ఒకర్నొకరు పట్టుకొని ఏడ్చేశారు. ఎగురుతూ, కేరింతలు కొడుతూ గ్రౌండ్ మొత్తం కలియదిరిగారు. ఇది నిజమేనా అని నమ్మలేకపోయారు. కప్పు చేతపట్టి సాధించామంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన ఓ పని వైరల్ అవుతోంది. మ్యాచ్ ముగిసిన తర్వాత హిట్​మ్యాన్ పిచ్ దగ్గరకు వెళ్లాడు. అక్కడి మట్టిని అతడు నోట్లో వేసుకొని రుచి చూశాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.

పిచ్​ నుంచి కాసింత మట్టిని తీసుకొని రుచి చూసిన రోహిత్.. ఆ తర్వాత దండం పెట్టాడు. తమకు ఇంతటి విజయాన్ని అందించిన వికెట్​కు అతడు గౌరవపూర్వకంగానే ఇలా చేసినట్లు తెలుస్తోంది. ఆఖర్లో వెళ్తూ వెళ్తూ అతడు నమస్కరించడం దీనికి ప్రూఫ్​గా చెప్పొచ్చు. ఇది చూసిన నెటిజన్స్.. రోహిత్​కు హ్యాట్సాఫ్​ అంటున్నారు. అందరూ సంబురాల్లో మునిగిపోయినా.. హిట్​మ్యాన్​ పిచ్​కు థ్యాంక్స్ చెప్పడం, రెస్పెక్ట్ ఇవ్వడం హైలైట్ అని అంటున్నారు. కప్పు కల తీర్చిన వికెట్​కు నమస్కరించడం, ఆ మట్టిని రుచి చూడటం ద్వారా దానిపై మమకారాన్ని, గౌరవాన్ని చెప్పకనే చెప్పాడని కామెంట్స్ చేస్తున్నారు. ఇక, ఫైనల్ విక్టరీ తర్వాత రోహిత్ ఫుల్ ఎమోషనల్ అయిపోయాడు. గ్రౌండ్​లో నేలపై పడుకొని ఏడ్చేశాడు. సహచరులను పట్టుకొని తన సంతోషాన్ని పంచుకున్నాడు. ఈ క్రమంలో లాస్ట్ ఓవర్​తో మ్యాచ్​ను మలుపు తిప్పిన హార్దిక్​కు కిస్ కూడా ఇచ్చాడు. మరి.. రోహిత్ పిచ్​ మట్టి తినడంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments