iDreamPost
android-app
ios-app

Rohit Sharma: రోహిత్ సెలబ్రేషన్​కు అర్థం ఏంటి.. కప్ గెలిచాక ఇలా ఎందుకు చేశాడు?

  • Published Jun 30, 2024 | 1:49 PM Updated Updated Jun 30, 2024 | 2:12 PM

T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్-2024ను కైవసం చేసుకుంది టీమిండియా. మెగా ఫైనల్​లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి నయా ఛాంపియన్​గా అవతరించింది.

T20 World Cup Final: టీ20 వరల్డ్ కప్-2024ను కైవసం చేసుకుంది టీమిండియా. మెగా ఫైనల్​లో సౌతాఫ్రికాను 7 పరుగుల తేడాతో ఓడించి నయా ఛాంపియన్​గా అవతరించింది.

  • Published Jun 30, 2024 | 1:49 PMUpdated Jun 30, 2024 | 2:12 PM
Rohit Sharma: రోహిత్ సెలబ్రేషన్​కు అర్థం ఏంటి.. కప్ గెలిచాక ఇలా ఎందుకు చేశాడు?

140 కోట్ల మంది భారతీయుల కల నెరవేరింది. 13 ఏళ్లుగా అందని ద్రాక్షగా ఉన్న ప్రపంచ కప్​ను ఎట్టకేలకు కైవసం చేసుకుంది టీమిండియా. నిన్న సౌతాఫ్రికాతో జరిగిన పొట్టి కప్పు ఫైనల్​లో రోహిత్ సేన 7 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఒక దశలో విజయం అసాధ్యమని అంతా అనుకున్నారు. కానీ హార్దిక్ పాండ్యా, జస్​ప్రీత్ బుమ్రా, అర్ష్​దీప్ సింగ్ సూపర్ బౌలింగ్​తో చెలరేగడంతో మెన్ ఇన్ బ్లూ కప్పును ఒడిసిపట్టింది. చేతిలో 6 వికెట్లు ఉన్నా, క్లాసెన్-మిల్లర్ లాంటి టాప్ బ్యాటర్స్ క్రీజులో ఉన్నా.. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన స్టేజ్ నుంచి మ్యాచ్​ను పోగొట్టుకుంది సౌతాఫ్రికా. ఈ ఓటమితో ఆ టీమ్ ఖాళీ చేతులతో ఇంటిదారి పట్టింది. అటు భారత్ విజయంతో కోట్లాది మంది అభిమానులు సంతోషంలో మునిగిపోయారు.

టీమిండియా విక్టరీని ప్రజలు ఎంతో గ్రాండ్​గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. రోడ్ల పైకి వచ్చి బాణసంచా కాలుస్తూ, స్వీట్లు పంచుతూ తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. అటు భారత ఆటగాళ్లు కప్పు కల నెరవేరడంతో సంతోషం పట్టలేకపోతున్నారు. నిన్న మ్యాచ్​ టైమ్​లో మన ప్లేయర్లు ఫుల్ జోష్​లో కనిపించారు. ఛాంపియన్స్​గా నిలవడంతో వాళ్ల ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. ఒకర్నొకరు హగ్ చేసుకోవడం, కన్నీళ్లు పెట్టుకోవడం లాంటివి చేస్తూ తమ ఎమోషన్స్​ను బయటపెట్టారు. కెప్టెన్ రోహిత్ శర్మ అయితే వరల్డ్ కప్ డ్రీమ్ నెరవేరడంతో పసి పిల్లాడిలా ఏడ్చేశాడు. ఒకవైపు ఏడుస్తూ, మరోవైపు నవ్వుతూ మిక్స్​డ్​ ఎమోషన్స్ చూపించాడు. జాతీయ పతాకాన్ని తీసుకొని గ్రౌండ్​లో నాటాడు. అయితే వరల్డ్ కప్ బహూకరణ సమయంలో అతడు చేసిన ఓ పని వైరల్ అవుతోంది.

ప్రపంచ కప్​ బహూకరణ సమయంలో రోహిత్ విచిత్రంగా నడుచుకుంటూ వచ్చాడు. కాస్త కిందకు వంగి ఒక కాలిని, ఒక చేతిని ముందుకు అంటూ డిఫరెంట్ స్టైల్​లో నడుచుకుంటూ వేదిక మీదకు చేరుకున్నాడు హిట్​మ్యాన్. ఆ తర్వాత బీసీసీఐ సెక్రెటరీ జై షా చేతుల మీదుగా ట్రోఫీని అందుకొని సంబురాల్లో మునిగిపోయాడు. దీంతో రోహిత్ వాక్​కు అర్థం ఏంటని అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఇది ఫుట్​బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ స్టైల్ అని చాలా మందికి తెలియదు. అర్జెంటీనా ఫుట్​బాల్ వరల్డ్ కప్ గెలిచినప్పుడు కప్ చేతబట్టి సరదాగా ఇలా నడిచాడు. దీంతో అప్పటి నుంచి ఈ డిఫరెంట్ సెలబ్రేషన్ కాస్తా ఐకానిక్​గా మారింది. ఇతర క్రీడల్లో కూడా కప్పు గెలిచినప్పుడు ఇలా చేయడం కామన్​గా మారింది. రోహిత్ కూడా మెస్సీ సెలబ్రేషన్​ను ఇమిటేట్ చేస్తూ అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు. మరి.. రోహిత్ సెలబ్రేషన్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.