ఆ విధ్వంసాన్ని మర్చిపోలేకపోతున్నా.. అతడి వల్ల నిద్రపట్టట్లేదు: రషీద్ ఖాన్

ఆఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టీ20 వరల్డ్ కప్-2024కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో టాప్ టీమ్స్​కు షాకిచ్చి ఆఫ్ఘాన్​ను కనీసం నాకౌట్ స్టేజ్​కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

ఆఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్ టీ20 వరల్డ్ కప్-2024కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో టాప్ టీమ్స్​కు షాకిచ్చి ఆఫ్ఘాన్​ను కనీసం నాకౌట్ స్టేజ్​కు తీసుకెళ్లాలని చూస్తున్నాడు.

క్రికెట్​లో పసికూన జట్లను అందరూ లైట్ తీసుకుంటారు. వీళ్ల వల్ల ఏమీ కాదని అనుకుంటారు. ఒక్క మ్యాచ్ గెలిచినా గొప్పే అని చెబుతారు. అయితే ఇది ఒకప్పటి లెక్క. పసికూనలను ఇలా అనుకోవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. బడా టీమ్స్​పై చిత్తుగా ఓడిపోవడం, తక్కువ స్కోర్లకు ఆలౌట్ అవడం, బౌలింగ్​లో భారీ స్కోర్లను ఇచ్చుకోవడం కొన్ని రీజన్స్​గా చెప్పొచ్చు. అయితే ఇప్పుడు అంతా మారిపోయింది. చిన్న జట్లు కూడా ఫేవరెట్స్​ను భయపెట్టిస్తున్నాయి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్​గా ఆఫ్ఘానిస్థాన్​ను చెప్పొచ్చు. ఈ టీమ్ కొన్ని సంవత్సరాల గ్యాప్​లో మంచి స్థాయికి చేరుకుంది. టెస్ట్ టీమ్ హోదాను దక్కించుకుంది. గతేడాది భారత్ వేదికగా జరిగిన వన్డే వరల్డ్ కప్-2023లో ఇంగ్లండ్, పాకిస్థాన్ లాంటి టాప్ టీమ్స్​ను ఓడించింది ఆఫ్ఘాన్.

వన్డే వరల్డ్ కప్​లో మ్యాజిక్ చేసిన ఆఫ్ఘానిస్థాన్.. దాన్నే టీ20 ప్రపంచ కప్​లోనూ కంటిన్యూ చేయాలని చూస్తోంది. కప్పు కొట్టకపోయినా సెమీఫైనల్​కు చేరుకొని బడా టీమ్ హోదా దక్కించుకోవాలని భావిస్తోంది. కెప్టెన్ రషీద్ ఖాన్ నేతృత్వంలోని ఆ జట్టు బలంగా కనిపిస్తోంది. ఆల్​రౌండర్లతో కూడిన ఆఫ్ఘాన్ ఈసారి ఎలాంటి సంచలనాలు చేస్తుందోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ గురించి రషీద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సారి సత్తా చాటేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపాడు. అయితే వరల్డ్ కప్ అనగానే తనకు ఆ విషయమే గుర్తుకొస్తుందన్నాడు. అతడి ఇన్నింగ్స్​ ఇంకా కళ్ల ముందే మెదులుతోందన్నాడు. ఆ విధ్వంసం గుర్తొచ్చినప్పుడల్లా నిద్రపట్టట్లేదని చెప్పాడు రషీద్.

ఆస్ట్రేలియా పించ్​హిట్టర్ గ్లెన్ మాక్స్​వెల్ వల్ల తనకు రాత్రుళ్లు నిద్రపట్టట్లేదని రషీద్ తెలిపాడు. నిద్రపోయే సమయంలో ఆస్ట్రేలియాతో ఆ మ్యాచ్ గురించే ఆలోచనలు తిరుగుతుంటాయని అన్నాడు. గతేడాది జరిగిన వన్డే ప్రపంచ కప్​లో ఆసీస్-ఆఫ్ఘాన్ మ్యాచ్​లో అద్భుతం చోటుచేసుకుంది. 291 పరుగుల ఛేదనలో ఒకదశలో 91 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది కంగారూ జట్టు. అయితే మాక్స్​వెల్ (128 బంతుల్లో 201 నాటౌట్) నమ్మశక్యం కాని ఇన్నింగ్స్​తో టీమ్​ను విజయతీరాలకు చేర్చాడు. 21 ఫోర్లు, 10 సిక్సులు బాదిన మాక్సీ.. ఓటమి తప్పదనుకున్న టీమ్​ను గట్టెక్కించాడు. ఆ మ్యాచ్​లో రషీద్​ను కూడా వదలకుండా భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. అక్కడి నుంచి ఊపందుకున్న ఆసీస్.. ఆఖరి పోరులో భారత్​ను ఓడించి ఛాంపియన్​గా నిలిచింది. ఇదే ఇన్నింగ్స్​ తనకు గుర్తుకొస్తూ ఉంటుందని, మాక్సీ వల్ల నిద్రపట్టట్లేదని రషీద్ చెప్పుకొచ్చాడు.

Show comments