ఇండియాలోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2026! పాల్గొనబోయే 20 జట్లు ఇవే!

ఇండియాలోనే టీ20 వరల్డ్‌ కప్‌ 2026! పాల్గొనబోయే 20 జట్లు ఇవే!

T20 World Cup 2026, India, Sri Lanka: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 హంగామా ముగిసింది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మరి రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ ఎక్కడ జరగనుంది? ఏ టీమ్స్‌ అందులో ఆడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

T20 World Cup 2026, India, Sri Lanka: టీ20 వరల్డ్‌ కప్‌ 2024 హంగామా ముగిసింది. భారత్‌ ఛాంపియన్‌గా నిలిచింది. మరి రానున్న టీ20 వరల్డ్‌ కప్‌ ఎక్కడ జరగనుంది? ఏ టీమ్స్‌ అందులో ఆడనున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 సమరం ముగిసింది. టీమిండియా ఛాంపియన్‌గా నిలిచి.. పొట్టి ప్రపంచ కప్‌ను సొంతం​ చేసుకుంది. ఓటమి ఎరుగని టీమ్‌గా ఫైనల్‌కు చేరుకున్న రోహిత్‌ సేన, మరోవైపు వరుసగా 8 మ్యాచ్‌లు గెలిచి ఓటమి లేకుండా ఫైనల్‌కు వచ్చిన సౌతాఫ్రికాను తుది పోరులో ఓడించి.. కప్పును కైవసం చేసుకుంది. ప్రస్తుతం టీమిండియా క్రికెటర్లు, అభిమానులు సెలబ్రేషన్‌ మూడ్‌లో ఉన్నారు. ఈ విజయంతో రెండో టీ20 వరల్డ్‌ కప్‌ను సొంతం చేసుకున్న భారత జట్టు.. వెంటనే మరో టీ20 వరల్డ్‌ కప్‌ పెడితే కూడా కొట్టేసేలా ఉంది. జట్టులోని ఆటగాళ్లు అంత కసిగా, ఉత్సాహంగా ఉన్నారు. మరి మరో టీ20 వరల్డ్‌ కప్‌ వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ను ప్రతి రెండేళ్లకు ఒకసారి ఐసీసీ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు మొత్తం 9 సార్లు టీ20 వరల్డ్‌ కప్‌ నిర్వహించారు. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024లో ఈ పొట్ట ప్రపంచ కప్‌ టోర్నీలు నిర్వహించారు. అయితే.. మధ్య కొన్ని సందర్భాల్లో టీ20 వరల్డ్‌ కప్‌ను కచ్చితంగా రెండేళ్లకు ఒకసారి నిర్వహించలేకపోయారు. కానీ, వన్డే వరల్డ్‌ కప్‌ తర్వాత.. ఈ టీ20 వరల్డ్‌ కప్‌ను అంత ప్రతిష్టాత్మక భావిస్తాయి అన్ని జట్లు. మరి రానున్న 2026 టీ20 వరల్డ్‌ కప్‌లో ఏ ఏ టీమ్స్‌ పాల్గొననున్నాయో ఇప్పుడు చూద్దాం..

2026లో జరగబోయే టీ20 వరల్డ్‌ కప్‌కు ఇండియా, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. దీంతో.. హోస్ట్‌ల స్థానంలో ఇండియా, శ్రీలంక ఈ టోర్నీకి నేరుగా క్వాలిఫై అయ్యాయి. అలాగే తాజాగా ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో సూపర్‌ 8కు చేరిన ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌, సౌతాఫ్రికా, ఆఫ్ఘనిస్థాన్‌, యూఎస్‌ఏ, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌ జట్లు డైరెక్ట్‌గా వచ్చే టీ20 వరల్డ్‌ కప్‌కి క్వాలిఫై అయిపోయాయి. టీ20 ర్యాంకింగ్స్‌ పరంగా పాకిస్థాన్‌, న్యూజిలాండ్‌, ఐర్లాండ్‌ జట్లు అర్హత సాధించాయి. మొత్తం 20 టీమ్స్‌ పాల్గొనే ఈ టోర్నీలో 12 జట్లు కన్ఫామ్‌ అయిపోయాయి. ఇక మిగిలిన 8 స్థానాల కోసం.. యూరప్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌, ఈస్ట్‌ ఏసియా పసిఫిక్‌ క్వాలిఫైయర్స్‌ నుంచి ఒక టీమ్‌, అమెరికా క్వాలిఫైయర్స్‌ నుంచి ఒక టీమ్‌, ఆసియా క్వాలిఫైయర్స్‌ నుంచి రెండు టీమ్స్‌, ఆఫ్రికా క్వాలిఫైయర్స్‌ టోర్నీ నుంచి రెండు టీమ్స్‌ అర్హత సాధిస్తాయి. ఆయా క్వాలిఫైయర్‌ టోర్నీల్లో టాప్‌ లేదా టాప్‌ టూలో నిలిచిన జట్లు భారత్‌, శ్రీలంక వేదికగా జరిగే టీ20 వరల్డ్‌ కప్‌ 2026లో పాల్గొంటాయి. మరి ఈ టీమ్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments