Somesekhar
టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
టీ20 వరల్డ్ కప్ ముందు టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి గాయం అయినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..
Somesekhar
టీ20 వరల్డ్ కప్ 2024లో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగుతోంది టీమిండియా. ఈ మెగా టోర్నీకోసం ఇప్పటికే టీమిండియా తొలి బ్యాచ్ అమెరికాలో ల్యాండ్ అయ్యింది. ఇందులో రోహిత్ శర్మతో పాటుగా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్, బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బుమ్రా, పంత్, సూర్యకుమార్ యాదవ్ లతో పాటుగా ఇతర ఆటగాళ్లు ఉన్నారు. అయితే విరాట్ కోహ్లీ మాత్రం ఈ బ్యాచ్ లో లేడు. దాంతో ఏం జరిగిందా? అని ఆరా తీయగా.. కోహ్లీ గాయమైనట్లు తెలుస్తోంది. దాంతో టోర్నీ ఆరంభానికంటే ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లైంది.
టీ20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందే టీమిండియాకు బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. భారత స్టార్ బ్యాటర్, రన్ మెషిన్ కింగ్ కోహ్లీకి గాయమైనట్లు తెలుస్తోంది. దాంతో రెండో బ్యాచ్ లో అమెరికా వెళ్లే ఆటగాళ్ల లిస్ట్ లో కోహ్లీ ఉండటం అనుమానమే అంటున్నారు. ఆర్సీబీ ఐపీఎల్ 2024 నుంచి నిష్క్రమించిన తర్వాత విరాట్ కోహ్లీ చిన్న గాయంతో బాధపడుతున్నట్లు సమాచారం. దాంతో కాస్త లేట్ గా అమెరికా వెళ్తానని బీసీసీఐకి చెప్పాడట. దానికి బీసీసీఐ కూడా ఓకే చెప్పడంతో.. వరల్డ్ కప్ టీమ్ లో లేట్ గా జాయిన్ అవ్వనున్నాడు కింగ్.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విరాట్ కోహ్లీ మే 30న అమెరికా బయలుదేరుతాడని తెలుస్తోంది. దాంతో జూన్ 1న బంగ్లాదేశ్ తో జరిగే వార్మప్ మ్యాచ్ కు కోహ్లీ అందుబాటులో ఉండకపోవచ్చి అధికారులు చెబుతున్నారు. విరాట్ కు అయిన గాయం చిన్నదే అని, అతడు త్వరలోనే జట్టుతో కలుస్తాడని బీసీసీఐ అధికారి ఒకరు పేర్కొన్నారు. దాంతో ఫ్యాన్స్ కాస్త ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా సైతం టీ20 వరల్డ్ కప్ కోసం పూర్తిగా ఫిట్ నెస్ సాధించాడు. ఇక టీమిండియా ఈ మెగా టోర్నీలో తన తొలి మ్యాచ్ ను జూన్ 5న ఐర్లాండ్ తో ఆడనుంది.