iDreamPost
android-app
ios-app

కోహ్లీ సక్సెస్ అవ్వాలంటే ఆ ఒక్క పని చేయాలి.. కైఫ్ కీలక సూచన!

  • Published Jun 14, 2024 | 3:58 PMUpdated Jun 14, 2024 | 3:58 PM

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్​తో బాధపడుతున్నాడు. పొట్టి కప్పులో ప్రత్యర్థులను ఇరగదీస్తాడనుకుంటే వరుస వైఫల్యాలతో సొంత జట్టును భయపెడుతున్నాడు. ఈ తరుణంలో అతడికి కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ పూర్ ఫామ్​తో బాధపడుతున్నాడు. పొట్టి కప్పులో ప్రత్యర్థులను ఇరగదీస్తాడనుకుంటే వరుస వైఫల్యాలతో సొంత జట్టును భయపెడుతున్నాడు. ఈ తరుణంలో అతడికి కీలక సూచన చేశాడు మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్.

  • Published Jun 14, 2024 | 3:58 PMUpdated Jun 14, 2024 | 3:58 PM
కోహ్లీ సక్సెస్ అవ్వాలంటే ఆ ఒక్క పని చేయాలి.. కైఫ్ కీలక సూచన!

విరాట్ కోహ్లీ.. ప్రస్తుత క్రికెట్​లో బెస్ట్ బ్యాటర్. అతడ్ని చూస్తేనే ప్రత్యర్థి జట్లు షేక్ అవుతాయి. ఎవరితోనైనా పెట్టుకోవచ్చు.. అతడితో మాత్రం వద్దంటూ భయంతో వెనకడుగు వేస్తాయి. విరాట్​ను గెలికితే ఎలా ఉంటుందో ఆస్ట్రేలియా సహా టాప్ టీమ్స్ అన్నింటికీ తెలుసు. అందుకే ద్వైపాక్షిక టోర్నమెంట్లలోనే కాదు.. బడా టోర్నీల్లోనూ కోహ్లీ జోలికి ఎవరూ వెళ్లరు. ఐసీసీ టోర్నీల్లో రెచ్చిపోయి ఆడుతుంటాడు కింగ్. ఎన్నోసార్లు ఇది చేసి చూపించాడు. అలాంటోడు ఈసారి మాత్రం చతికిలపడుతున్నాడు. టీ20 ప్రపంచ కప్-2024లో ఇప్పటిదాకా ఆడిన 3 మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులు మాత్రమే చేశాడు కింగ్. దీంతో సూపర్-8కు ముందు భారత జట్టులో భయం మొదలైంది. టీమ్​కు వెన్నెముక లాంటి కింగ్ ఇలా ఆడితే ఎలా అని మేనేజ్​మెంట్ టెన్షన్ పడుతోంది.

సూపర్-8, నాకౌట్ లాంటి బిగ్ స్టేజెస్​లో కోహ్లీ బాగా ఆడటం ముఖ్యం. బడా జట్ల మీద విరాట్ నిలబడితే టీమ్​కు తిరుగుండదు. అందునా స్లో పిచ్​లపై కింగ్ త్వరగా పెవిలియన్​కు చేరితే మిగిలిన ఆటగాళ్ల మనోస్థైర్యం కూడా దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో విరాట్ ఫామ్ గురించి టీమిండియా మాజీ బ్యాటర్ మహ్మద్ కైఫ్ ఇంట్రెస్టింగ్ కైఫ్ కామెంట్స్ చేశాడు. కోహ్లీ ఊపందుకోవడం చాలా ముఖ్యమని చెప్పాడు. అయితే తిరిగి ఫామ్​ను అందుకోవాలంటే అతడో పని చేయాల్సి ఉందన్నాడు. అదే బ్యాటింగ్ మార్పు అని తెలిపాడు కైఫ్. ఓపెనింగ్​లో కాకుండా మూడో పొజిషన్​లో బ్యాటింగ్​కు దిగాలని.. అప్పుడే కోహ్లీ తనదైన శైలిలో ఆడగలడని పేర్కొన్నాడు. సీమ్ బౌలింగ్​కు అనుకూలించే యూఎస్​ఏ-వెస్టిండీస్ పిచ్​లపై బ్యాటింగ్ చేయడం అంత ఈజీ కాదన్నాడు.

‘కోహ్లీ మూడో స్థానంలో బ్యాటింగ్​కు దిగాలి. సీమ్ బౌలింగ్​కు అనుకూలించే ఈ కండీషన్స్​లో పరుగులు రాబట్టడం అంత సులువు కాదు. ఐపీఎల్​లో ఫ్లాట్ పిచ్​లు ఉంటాయి. కాబట్టి అక్కడ ఓపెనింగ్​లో దిగి పరుగుల వర్షం కురిపించొచ్చు. కానీ యూఎస్​ఏ-కరీబియన్ పిచ్​లపై అది సాధ్యం కాదు. మెగా టోర్నీలో అతడు అగ్రెసివ్​గా బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇలాంటి శైలి అక్కడ పని చేయదు. అడ్డగోలు షాట్లు ఆడే బదులు తన వికెట్​ను కాపాడుకోవడంపై కోహ్లీ ఫోకస్ చేయాలి. వికెట్​ను కాపాడుకుంటూ ఇన్నింగ్స్​ను బిల్డ్ చేయాలి. ఆ తర్వాత పరుగులు అవే వస్తాయి’ అని కైఫ్ సూచించాడు. కైఫ్ అనే కాదు.. మరికొందరు మాజీలు కూడా ఇదే సలహా ఇస్తున్నారు. విరాట్ థర్డ్ డౌన్​లో దిగాలని అంటున్నారు. దూకుడును పక్కనబెట్టి ఇన్నింగ్స్​ను నిర్మించడం మీద దృష్టి పెట్టాలని చెబుతున్నారు. మరి.. కోహ్లీ ఓపెనింగ్ నుంచి మూడో పొజిషన్​కు మారాలనే సలహాపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి