T20 World Cup 2024 Virat Kohli As Opener: కోహ్లీ విషయంలో మూర్ఖత్వం వద్దు.. అదే ప్లేస్​లో ఆడించాలి: దిగ్గజ క్రికెటర్!

Virat Kohli: కోహ్లీ విషయంలో మూర్ఖత్వం వద్దు.. అదే ప్లేస్​లో ఆడించాలి: దిగ్గజ క్రికెటర్!

త్వరలో మొదలవనున్న టీ20 వరల్డ్ కప్​-2024లో భారత జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్​లో ఏయే స్లాట్లలో ఎవరు దిగుతారనేది ఉత్సుకతను కలిగిస్తోంది.

త్వరలో మొదలవనున్న టీ20 వరల్డ్ కప్​-2024లో భారత జట్టు కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్​లో ఏయే స్లాట్లలో ఎవరు దిగుతారనేది ఉత్సుకతను కలిగిస్తోంది.

టీ20 ప్రపంచ కప్-2024 సంరంభం మొదలయ్యేందుకు ఇంకా నాల్రోజుల సమయం మాత్రమే మిగిలి ఉంది. ఇప్పటికే అన్ని క్రికెట్ టీమ్స్ యూఎస్​కు చేరుకున్నాయి. ప్రాక్టీస్​లో మునిగిపోయారు ఆటగాళ్లు. ఆస్ట్రేలియా, నమీబియా లాంటి కొన్ని జట్లు ప్రాక్టీస్​ మ్యాచ్​లు కూడా ఆడేశాయి. టైటిల్ ఫేవరెట్స్​లో ఒకటైన టీమిండియా కూడా అమెరికా గడ్డ మీద అడుగుమోపింది. భారత ప్లేయర్లు జోరుగా సాధన చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్-2023 మిస్సైన కసిలో ఉన్న మెన్ ఇన్ బ్లూ.. పొట్టి కప్పును ఎలాగైనా పట్టేయాలని చూస్తున్నారు. అయితే మెగా టోర్నీలో భారత కూర్పు ఎలా ఉండనుందనేది ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా బ్యాటింగ్ యూనిట్​లో ఏయే స్లాట్లలో ఎవరు దిగుతారనేది ఉత్సుకతను కలిగిస్తోంది.

టీమిండియా ఓపెనింగ్ పొజిషన్స్ గురించి తీవ్రంగా చర్చ నడుస్తోంది. రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ రూపంలో సాలిడ్ ఓపెనర్స్ జట్టులో ఉన్నారు. లెఫ్టాండ్, రైట్ హ్యాండ్ కాంబో కూడా బాగుంటుంది. అయితే ఓపెనర్లుగా రోహిత్​కు జతగా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ రావాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. ఐపీఎల్​లో ఆ పొజిషన్​లో కింగ్ పరుగుల వరద పారించడంతో ప్రపంచ కప్​లోనూ అదే స్థానంలో ఆడించాలని అంటున్నారు. రోహిత్​కు జతగా లేదా జైస్వాల్​కు జతగా కోహ్లీని ఓపెనర్​గా దింపాలని కొందరు మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు. విరాట్ కోసం రోహిత్, జైస్వాల్​ల్లో ఎవరో ఒకరు త్యాగం చేయాలని అంటున్నారు. అయితే భారత లెజెండ్ నవ్​జ్యోత్ సింగ్ సిద్ధు మాత్రం ఈ విషయంలో కాస్త భిన్నంగా స్పందించాడు. కోహ్లీ విషయంలో మూర్ఖత్వం పనికిరాదన్నాడు.

విరాట్​ను రెగ్యులర్​గా ఆడే మూడో నంబర్ స్లాట్​లోనే బరిలోకి దింపాలని సిద్ధు సూచించాడు. జట్టులో తోపు బ్యాటర్ అతడేనని.. కాబట్టి ఫస్ట్ డౌన్​లో ఆడించడమే కరెక్ట్ అని చెప్పాడు. ‘టీమ్​లో బెస్ట్ బ్యాటర్​ను మూడో నంబర్​లో ఆడించాలి. గత టీ20 వరల్డ్ కప్​లో కూడా కోహ్లీ అదే పొజిషన్​లో ఆడాడు. కాబట్టి ఈ సారి కూడా అతడి బ్యాటింగ్​ స్థానం విషయంలో మార్పులు చేయకూడదు. అక్కడే ఆడించాలి’ అని సిద్ధు సూచించాడు. టర్బనేటర్ హర్భజన్ సింగ్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. రోహిత్-జైస్వాల్ ఓపెనింగ్ చేయాలని.. లెఫ్టాండ్-రైట్​ హ్యాండ్ కాంబో వర్కౌట్ అవుతుందన్నాడు. ఆ తర్వాత మ్యాచ్ సిచ్యువేషన్​ను బట్టి విరాట్ లేదా లెఫ్టాండర్ కాబట్టి శివమ్ దూబెను కూడా ఫస్ట్ డౌన్​లో ఆడించొచ్చని భజ్జీ పేర్కొన్నాడు. మరి.. ఈ వరల్డ్ కప్​లో కోహ్లీ ఏ స్థానంలో బ్యాటింగ్​ చేస్తే భారత్​కు లాభదాయకమని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.

Show comments