iDreamPost
android-app
ios-app

టీమిండియాతో మ్యాచ్ కు ముందు.. పాక్ జట్టులో భయటపడ్డ విభేదాలు.!

  • Published Jun 07, 2024 | 9:30 PM Updated Updated Jun 07, 2024 | 9:30 PM

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టులో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ టీమ్ లోని ఆటగాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ జట్టులో ఉన్న విభేదాలు బయటపడ్డాయి. పాకిస్తాన్ టీమ్ లోని ఆటగాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీమిండియాతో మ్యాచ్ కు ముందు.. పాక్ జట్టులో భయటపడ్డ విభేదాలు.!

టీ20 వరల్డ్ కప్ 2024లో తొలి మ్యాచ్ లో అనవసర తప్పిదాలతో భారీ మూల్యం చెల్లించుకుంది పాకిస్తాన్. టోర్నీకి ముందు కఠినమైన ఆర్మీ శిక్షణ తీసుకున్నాం.. ఇక ప్రత్యర్థులకు దబిడి దిబిడే అంటూ ఎన్నో ప్రగల్బాలు పలికింది. కానీ తీరా టోర్నీలోకి అడుగుపెడితే గానీ తెలియలేదు పాక్ ఆటతీరు ఇంకా మారలేదని. ఈ టోర్నీని దారుణమైన ఓటమితో ప్రారంభించింది. అదికూడా పసికూన అమెరికా చేతిలో ఓడిపోయి తీవ్ర విమర్శలపాలైంది. ఈ నేపథ్యంలో పాక్ టీమ్ లో ఉన్న విభేదాలు ఈ మ్యాచ్ ద్వారా బయటపడ్డాయి. స్టార్ పేసర్ మహ్మద్ అమీర్ కు బాబర్ కు మధ్య చిన్నపాటి వాగ్వాదం జరిగింది.

వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో సూపర్ ఓవర్లో పాకిస్తాన్ ఓడిపోయిన విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మ్యాచ్ ద్వారా పాకిస్తాన్ టీమ్ లో ఉన్న విభేదాలు ఒక్కసారిగా ప్రపంచానికి తెలిశాయి. అసలేం జరిగిందంటే? అమెరికా బ్యాటింగ్ చేస్తున్న క్రమంలో 15వ ఓవర్ వేసి నాలుగు పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ తీశాడు పేసర్ మహ్మద్ అమీర్. పిచ్ పేసర్లకు అనుకూలిస్తుందని దాంతో పేసర్లతోనే బౌలింగ్ చేయించాలని కెప్టెన్ బాబర్ అజామ్ కు సూచించాడు అమీర్.

అయితే అప్పటికే యూఎస్ఏ బ్యాటర్ జోన్స్.. స్పిన్నర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు రాబడుతున్నాడు, పేసర్లు అయితే అతడిని కట్టడి చేస్తారని అమీర్ ఈ సలహా ఇచ్చాడు. కానీ అతడి సలహాను పక్కనపెట్టిన బాబర్.. షాదాబ్ ఖాన్ తో బౌలింగ్ చేయించాడు. ఇతడి ఓవర్లో 11 రన్స్ వచ్చాయి. ఈ ఓవరే మ్యాచ్ ను టర్న్ చేసిందని చెప్పొచ్చు. అందుకే అమీర్ మాటవిని పేసర్లతో బౌలింగ్ చేయిస్తే.. జోన్స్ ఔట్ అయ్యేవాడని, పాక్ విజయం సాధించేదని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. దాంతో పాక్ జట్టులో ఉన్న విభేదాలు బయటపడ్డాయి కొందరు అంటున్నారు. పాక్ టీమ్ లో ఆటగాళ్లు రెండు గ్రూప్ లుగా విడిపోయారని కూడా చెప్పుకొస్తున్నారు. మరి నిజంగానే అమీర్ చెప్పినట్లుగా బాబర్ విని.. పేసర్లతో బౌలింగ్ వేయిస్తే.. ఫలితం వేరేలా ఉండేదా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.