iDreamPost
android-app
ios-app

Zaheer Khan: రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో టీమిండియాను గెలిపించేది అతడే: జహీర్

  • Published Jan 19, 2024 | 9:08 PMUpdated Jan 19, 2024 | 9:08 PM

ఈ ఏడాది జూన్​లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వరల్డ్ కప్​లో రోహిత్, కోహ్లీ టీమిండియాకు కీలకం అవుతారని సీనియర్ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. అయితే జహీర్ ఖాన్ మాత్రం రోహిత్, విరాట్ కాదు.. మరో ప్లేయర్ భారత్​ను గెలిపిస్తాడని అంటున్నాడు.

ఈ ఏడాది జూన్​లో పొట్టి ఫార్మాట్​లో ప్రపంచ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ వరల్డ్ కప్​లో రోహిత్, కోహ్లీ టీమిండియాకు కీలకం అవుతారని సీనియర్ క్రికెటర్లు అంచనా వేస్తున్నారు. అయితే జహీర్ ఖాన్ మాత్రం రోహిత్, విరాట్ కాదు.. మరో ప్లేయర్ భారత్​ను గెలిపిస్తాడని అంటున్నాడు.

  • Published Jan 19, 2024 | 9:08 PMUpdated Jan 19, 2024 | 9:08 PM
Zaheer Khan: రోహిత్, కోహ్లీ కాదు.. వరల్డ్ కప్​లో టీమిండియాను గెలిపించేది అతడే: జహీర్

ఈ సంవత్సరం జూన్​ నెలలో టీ20 వరల్డ్ కప్ జరగనున్న సంగతి తెలిసిందే. పొట్టి ఫార్మాట్​లో జరిగే కప్పును కొట్టేయాలని చాలా జట్లు ప్లాన్ చేస్తున్నాయి. బడా టీమ్స్​తో పాటు చిన్న జట్లు కూడా కప్పుపై కన్నేశాయి. ఈ ఫార్మాట్​లో ఎవరు గెలుస్తారో చెప్పడం కష్టం కాబట్టి.. టీ20 వరల్డ్ కప్​లో చిన్న జట్లను కూడా కొట్టిపారేయడానికి లేదు. ఇప్పటికే చాలా టీమ్స్ టీ20 వరల్డ్ కప్ సన్నాహకాల్లో మునిగిపోయాయి. వరుసగా టీ20 సిరీస్​లు ఆడుతున్నాయి. టీమిండియా కూడా తమ ప్రిపరేషన్స్​ను స్టార్ట్ చేసింది. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో పాటు రీసెంట్​గా ఆఫ్ఘానిస్థాన్​తో టీ20 సిరీస్​లు ఆడింది. టీమ్ కాంబినేషన్​పై అంచనాకు వచ్చేందుకు కొన్ని ప్రయోగాలు చేసి సక్సెస్ కూడా అయింది భారత్. అయితే నెక్స్ట్ ఐపీఎల్​ ఉండటంతో సన్నాహకాలకు మరింత టైమ్ లేదు. ఈ తరుణంలో టీమిండియా వరల్డ్ కప్ జర్నీపై వెటరన్ పేసర్ జహీర్ ఖాన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

వచ్చే టీ20 ప్రపంచ కప్​లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లాంటి స్టార్ ప్లేయర్లు కీలక పాత్ర పోషిస్తారని సీనియర్ క్రికెటర్స్ అంచనా వేస్తున్నారు. అయితే జహీర్ మాత్రం రోహిత్, కోహ్లీ కాదు.. టీ20 వరల్డ్ కప్​లో మహ్మద్ షమి భారత్​కు ఎక్స్ ఫ్యాక్టర్​గా మారతాడని అంటున్నాడు. ‘టీమిండియాకు మహ్మద్ షమి ఎక్స్​ ఫ్యాక్టర్​గా మారతాడని నేను భావిస్తున్నా. ఒకవేళ ఫిట్​గా ఉంటే అతడ్ని ఆపడం ఎవరి తరం కాదు. షమీతో పాటు జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ కూడా డేంజరసే. వీళ్లతో పాటు యంగ్ పేసర్ అర్ష్​దీప్ కూడా జట్టులో ఉండాలి. అతడు లెఫ్టార్మ్ పేసర్ కాబట్టి టీమ్​కు బ్యాలెన్స్ వస్తుంది. మంచి యార్కర్లు వేయడం అతడికి ఉన్న అడ్వాంటేజ్. వీళ్లు నలుగురూ టీమ్​లో ఉండాల్సిందే’ అని జహీర్ స్పష్టం చేశాడు. షమి ఫిట్​గా ఉండి సెలక్షన్​కు అందుబాటులో ఉంటే అతడ్ని టీమ్​లోకి తీసుకోవాల్సిందేనని చెప్పుకొచ్చాడు.

ఇక, వన్డే వరల్డ్ కప్​లో 24 వికెట్లతో టాప్ వికెట్ టేకర్​గా నిలిచాడు మహ్మద్ షమి. మొదటి మూడు మ్యాచుల్లో జట్టులో చోటు లేక బెంచ్​ మీద కూర్చున్న ఈ వెటరన్ పేసర్​.. తర్వాత దొరికిన ఛాన్సులను పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. వికెట్ల మీద వికెట్లు తీస్తూ ప్రత్యర్థి జట్ల బ్యాటర్లకు వణుకు పుట్టించాడు. స్వింగ్, సీమింగ్ డెలివరీస్​తో అపోజిషన్ టీమ్స్​ను పేకమేడలా కుప్పకూల్చాడు. మెగాటోర్నీలో భారత్ అంతగా డామినేషన్ చేసిందంటే దానికి షమి ఫెంటాస్టిక్ బౌలింగ్ కూడా ఒక కారణమని చెప్పొచ్చు. అలాంటి ఈ వెటరన్ పేసర్ వరల్డ్ కప్ టైమ్​లోనే గాయపడ్డాడు. అయితే ఇంజక్షన్లు తీసుకొని కంటిన్యూ అయ్యాడు. మెగాటోర్నీ ముగిసిన తర్వాత గాయానికి సర్జరీ చేయించుకున్నాడు. ప్రస్తుతం బెంగళూరులోని ఎన్​సీఏలో పునరావాసంలో ఉన్న ఈ పేసర్ ప్రాక్టీస్ మొదలుపెట్టేశాడు. ఇంగ్లండ్​తో జరిగే టెస్ట్ సిరీస్​లో ఆఖరి 3 మ్యాచుల్లో అతడు ఆడే అవకాశం ఉంది. మరి.. షమి టీమిండియాకు ఎక్స్​ ఫ్యాక్టర్ అవుతాడంటూ జహీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి