iDreamPost
android-app
ios-app

ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్లను గుర్తుపట్టారా? టీమిండియా కప్పు కలను తీర్చిన యోధులు!

  • Published Jun 05, 2024 | 3:09 PMUpdated Jun 05, 2024 | 4:40 PM

క్రికెటర్ల పాత ఫొటోలు నెట్టింట వైరల్​గా మారడం తెలిసిందే. వాళ్ల చిన్నతనంలోని ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తుంటాయి. ఇలాంటివి వాళ్ల ఫ్యాన్స్​కు మరింత కిక్​ను ఇస్తాయి.

క్రికెటర్ల పాత ఫొటోలు నెట్టింట వైరల్​గా మారడం తెలిసిందే. వాళ్ల చిన్నతనంలోని ఫొటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తుంటాయి. ఇలాంటివి వాళ్ల ఫ్యాన్స్​కు మరింత కిక్​ను ఇస్తాయి.

  • Published Jun 05, 2024 | 3:09 PMUpdated Jun 05, 2024 | 4:40 PM
ఈ ఫొటోలో ఉన్న క్రికెటర్లను గుర్తుపట్టారా? టీమిండియా కప్పు కలను తీర్చిన యోధులు!

క్రికెటర్లు, సినీ తారలు, రాజకీయ నేతల పాత ఫొటోలు నెట్టింట వైరల్​గా మారడం తెలిసిందే. వాళ్ల చిన్నతనంలోని ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో హల్​చల్ చేస్తుంటాయి. ఇలాంటివి వాళ్ల ఫ్యాన్స్​కు మరింత కిక్​ను ఇస్తాయి. తాము ఇష్టపడే సెలబ్రిటీలు చిన్నప్పుడు ఎలా ఉండేవారో చూసుకొని మురిసిపోతుంటారు. ఇప్పుడు ఇద్దరు టీమిండియా స్టార్ల ఓల్డ్ పిక్స్ వైరల్ అవుతున్నాయి. వీళ్లు ఆషామాషీ ఆటగాళ్లు కాదు.. టీమిండియా కప్పు కల తీర్చిన యోధులు. భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ-2013 గెలుచుకోవడంలో కీలక పాత్ర పోషించిన ధీరులు. ఆ సిరీస్​లో ఓపెనర్లుగా వచ్చి విధ్వంసక బ్యాటింగ్​తో ప్రత్యర్థి బౌలర్లకు నరకం చూపించారు. మనం మాట్లాడుకుంటోంది ఎవరి గురించో ఈపాటికే మీకు ఓ ఐడియా వచ్చి ఉంటుంది.

సోషల్ మీడియలో వైరల్​గా మారిన ఈ పాత ఫొటోలో ఉన్నది టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ, సీనియర్ బ్యాటర్ శిఖర్ ధావన్. వీళ్లిద్దరూ మంచి ఫ్రెండ్స్ అనేది తెలిసిందే. ఛాంపియన్స్ ట్రోఫీలో ఓపెనర్లుగా వీళ్లు సృష్టించిన వీరంగాన్ని ఎవరూ అంత సులువుగా మర్చిపోలేరు. ఆ టోర్నమెంట్ తర్వాత కూడా ఎన్నో సిరీస్​ల్లో ఓపెనర్లుగా అదరగొడుతూ మంచి పెయిర్​గా పేరు తెచ్చుకున్నారు. ఒకర్ని మించి మరొకరు ధనాధన్ ఇన్నింగ్స్​లు ఆడుతూ అపోజిషన్ టీమ్స్​కు విలన్లుగా మారారు. ఆ తర్వాత తీవ్ర పోటీ నేపథ్యంలో ధావన్ క్రమంగా టీమ్​కు దూరమైనా.. రోహిత్ మాత్రం బ్యాటర్ నుంచి కెప్టెన్​గా ప్రమోషన్ పొందాడు. వీళ్లిద్దరూ కలసి దిగిన ఓ పాత ఫొటో ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. దీన్ని ధావన్ రీసెంట్​గా నెట్టింట షేర్ చేశాడు.

రోహిత్​తో కలసి తాను దిగిన ఫొటోను ఇన్​స్టాగ్రామ్​లో ధావన్ పంచుకున్నాడు. మధురమైన పాత జ్ఞాపకాలు అని ఆ పోస్ట్​కు క్యాప్షన్ పెట్టాడు. అయితే సరిగ్గా ఎప్పుడు దిగిందో మాత్రం చెప్పలేదు. కానీ అది చూస్తుంటే మాత్రం పదిహేనేళ్ల కిందటిదిలా ఉంది. ఇక, తొలి టీ20 ప్రపంచ కప్-2007 నెగ్గిన జట్టులో సభ్యుడైన హిట్​మ్యాన్.. ఇప్పుడు మరోమారు జట్టును ఛాంపియన్​గా నిలపాలని చూస్తున్నాడు. అతడి సారథ్యంలోని భారత జట్టు ఇవాళ ఐర్లాండ్​ను ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. మెగా టోర్నీలో మెన్ ఇన్ బ్లూకు ఇదే మొదటి మ్యాచ్ కానుంది. న్యూయార్క్​లోని నసావు కౌంటీ స్టేడియం ఈ మ్యాచ్​కు ఆతిథ్యం ఇస్తోంది. ఐర్లాండ్​ను చిత్తుగా ఓడించి పాకిస్థాన్​కు హెచ్చరికలు పంపాలని రోహిత్ సేన భావిస్తోంది. ఈ తరుణంలో హిట్​మ్యాన్-ధావన్ ఫొటో వైరల్ అవుతుండటం గమనార్హం. దీన్ని చూసిన ఫ్యాన్స్.. ఈ ఓపెనింగ్ జంటను మిస్ అవుతున్నామని కామెంట్స్ చేస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Shikhar Dhawan (@shikhardofficial)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి