Nidhan
పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ దూకుడు మీద ఉంది. వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది రోహిత్ సేన. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వరల్డ్ కప్ కొట్టకుండా టీమిండియాను ఎవరూ ఆపలేరు.
పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ దూకుడు మీద ఉంది. వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది రోహిత్ సేన. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వరల్డ్ కప్ కొట్టకుండా టీమిండియాను ఎవరూ ఆపలేరు.
Nidhan
పొట్టి ప్రపంచ కప్‌లో భారత్ యమా దూకుడు మీద ఉంది. వరుస విజయాలతో సూపర్-8 దశకు అర్హత సాధించింది రోహిత్ సేన. వరుసగా ఐర్లాండ్, పాకిస్థాన్, యూఎస్‌ను మట్టికరిపించి ఫుల్ స్పీడ్‌లో దూసుకెళ్తోంది. ఇదే ఫామ్‌ను కొనసాగిస్తే వరల్డ్ కప్ కొట్టకుండా టీమిండియాను ఎవరూ ఆపలేరు. జట్టులో అందరూ మంచి ఫామ్‌లో ఉన్నారు. బౌలింగ్ యూనిట్ అదరగొడుతోంది. జస్ప్రీత్ బుమ్రా, అర్ష్‌దీప్ సింగ్ సహా పేస్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా, మరో స్పీడ్‌స్టర్ మహ్మద్ సిరాజ్, స్పిన్నర్ అక్షర్ పటేల్ ప్రత్యర్థి బ్యాటర్లను వణికిస్తున్నారు. ముఖ్యంగా బుమ్రా, అర్ష్‌దీప్ బౌలింగ్‌లో బంతిని టచ్ చేయాలన్నా అపోజిషన్ టీమ్స్ భయపడుతున్నాయి. అటు పరుగులు చేయలేక, ఇటు వికెట్లు కాపాడుకోలేక ఆపసోపాలు పడుతున్నాయి.
అనూహ్యమైన బౌన్స్, స్వింగ్‌కు సహకరిస్తున్న అమెరికా పిచ్‌లపై బౌలర్ల హవా నడుస్తోంది. టీమిండియాకు కూడా బౌలర్లే హీరోలుగా మారుతున్నారు. గత మూడు మ్యాచుల్లోనూ వాళ్లే జట్టుకు ప్రధాన బలంగా మారారు. పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా టీమ్‌ను ముందుండి లీడ్ చేస్తున్నాడు. పాకిస్థాన్‌పై విజయంలో అతడు పోషించిన పాత్రను ఎంత మెచ్చుకున్నా తక్కువే. కీలక సమయంలో మహ్మద్ రిజ్వాన్ వికెట్ తీసి మ్యాచ్‌ను టీమిండియా వైపు తిప్పాడు. అతడ్ని ఎదుర్కోలేక పాక్‌తో పాటు ఇతర టీమ్స్ బ్యాటర్లు కూడా వణికిపోయారు. ఈ నేపథ్యంలో బుమ్రాపై భారత మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. మన టీమ్‌కు అసలైన బలం బుమ్రానేనని అన్నాడు. అలాంటోడు జట్టులో ఉండటం అదృష్టమని, దేవుడిచ్చిన వరమని చెప్పాడు.
‘టీమిండియాలో బుమ్రా ఉండటం వరం. భారత జట్టులో అలాంటి బౌలర్ గతంలో లేడు. మూడు ఫార్మాట్లలోనూ అదరగొడుతూ డామినేట్ చేసే జస్ప్రీత్ వంటి ఫాస్ట్ బౌలర్ టీమ్‌లో ఉండటం అతిపెద్ద బలం. వైట్ బాల్ క్రికెట్‌ను ఓ సీమర్ శాసిస్తాడని నేనెప్పుడూ ఊహించలేదు. కానీ దాన్ని బుమ్రా సాధ్యం చేశాడు. టీ20లు, వన్డేలతో పాటు టెస్టుల్లోనూ అతడి హవా నడుస్తోంది. బుమ్రా మీద ఆధిపత్యం చూపించే బ్యాటర్ కనిపించడం లేదు. ప్రత్యర్థులను ఎలా చిత్తు చేయాలనేది అతడికి తెలుసు. ప్రస్తుత క్రికెట్లో బుమ్రా అందరికంటే బెస్ట్’ అని రవిశాస్త్రి ప్రశంసల్లో ముంచెత్తాడు. టీమిండియా పేసు గుర్రాన్ని టర్బనేటర్ హర్భజన్ సింగ్ కూడా మెచ్చుకున్నాడు. మోడర్న్ డే క్రికెట్లో బుమ్రానే గ్రేట్ అని భజ్జీ అన్నాడు. ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్, శ్రీలంక లెజెండ్ లసిత్ మలింగలా అతడు డామినేషన్ చూపిస్తున్నాడని, అతడి ఇంపాక్ట్ మామూలుగా లేదంటూ ఆకాశానికెత్తేశాడు. మరి.. బుమ్రా బౌలింగ్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Ravi Shastri ” India never had a fast bowler who could dominate in all formats of the game before Bumrah arrived.I never thought of seeing a seamer ruling white-ball cricket and Test matches but Bumrah has done it.Hardly any batter who can dominate him.”pic.twitter.com/cRVqSkgMZE
— Sujeet Suman (@sujeetsuman1991) June 14, 2024