Nidhan
కెరీర్లో ఎక్కడో ఉంటారనుకునే కొందరు క్రికెటర్లు.. కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా ఎదగరు. ఊహించిన స్థాయికి ఆటగాళ్లు చేరుకోకపోతే వాళ్లే కాదు.. ఆరాధించే అభిమానులు కూడా నిరాశకు లోనవుతారు.
కెరీర్లో ఎక్కడో ఉంటారనుకునే కొందరు క్రికెటర్లు.. కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా ఎదగరు. ఊహించిన స్థాయికి ఆటగాళ్లు చేరుకోకపోతే వాళ్లే కాదు.. ఆరాధించే అభిమానులు కూడా నిరాశకు లోనవుతారు.
Nidhan
కెరీర్లో ఎక్కడో ఉంటారనుకునే కొందరు క్రికెటర్లు.. కొన్ని కారణాల వల్ల అనుకున్నంతగా ఎదగరు. ఊహించిన స్థాయికి ఆటగాళ్లు చేరుకోకపోతే వాళ్లే కాదు.. ఆరాధించే అభిమానులు కూడా నిరాశకు లోనవుతారు. ఇప్పుడో క్రికెటర్ విషయంలో టీమిండియా ఫ్యాన్స్ ఇలాగే బాధ పడుతున్నారు. అంతా అనుకున్నట్లు జరిగితే ఈపాటికి టీ20 వరల్డ్ కప్-2024లో ఆడేవాడు. భారత జట్టుతో కలసి ప్రాక్టీస్ చేస్తూ బిజీబిజీగా ఉండేవాడు. ప్రపంచ కప్‌లో టీమిండియాకు ఆడాలనే డ్రీమ్‌ను నెరవేర్చుకునేవాడు. కానీ అలా జరగలేదు. మెగా టోర్నీలో ఆడాల్సినోడు.. ఇప్పుడు మట్టి పిసుక్కుంటున్నాడు. వరల్డ్ కప్ స్క్వాడ్‌లో అతడికి చోటివ్వలేదు సెలెక్టర్లు. అతడికి బదులు ఐపీఎల్లో రాణించిన సీనియర్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు.
గతేడాది భారత జట్టులో విజయాల్లో అతడు కీలకపాత్ర పోషించాడు. వన్డేలు, టీ20ల్లో జట్టులో రెగ్యులర్ ప్లేయర్‌గా మారాడు. ముఖ్యంగా పొట్టి ఫార్మాట్లో టీమ్ సక్సెస్‌లో అతడు కీలకంగా మారాడు. సుడులు తిరిగే లెగ్ కట్టర్స్, గూగ్లీలతో ప్రత్యర్థి బ్యాటర్ల వెన్నులో వణుకు పుట్టించాడు. టీమ్ కోసం అవసరమైతే ఫస్ట్ ఓవర్ కూడా వేశాడు. పరుగులు కట్టడి చేయడమే గాక వికెట్లు కూడా తీస్తూ జట్టుకు తిరుగులేని అస్సెట్‌గా మారాడు. అతడే యంగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్. ఐపీఎల్-2024కు ముందు జరిగిన ఆఫ్ఘానిస్థాన్ సిరీస్‌లోనూ ఆడిన బిష్ణోయ్.. ఇప్పుడు మాత్రం టీమ్‌లో లేకుండా పోయాడు. అతడ్ని మొదట్నుంచి టీ20 ప్రపంచ కప్ కోసమే సిద్ధం చేస్తున్నట్లు చెప్పుకొచ్చింది టీమ్ మేనేజ్మెంట్. అయినా అతడ్ని జట్టులోకి తీసుకోలేదు.
ఐపీఎల్-2024కు ముందు వరకు అద్భుతంగా బౌలింగ్ చేస్తూ వచ్చిన బిష్ణోయ్ క్యాష్ రిచ్ లీగ్‌లో ఫెయిలయ్యాడు. వికెట్లు తీయకపోవడమే గాక భారీగా పరుగులు ఇచ్చుకున్నాడు. దీంతో అప్పటిదాకా అతడు పడిన కష్టం కాస్తా వృథా అయింది. ఐపీఎల్ కాదు.. ఇంటర్నేషనల్ క్రికెట్ పెర్ఫార్మెన్స్ను పరిగణనలోకి తీసుకొనే ఆటగాళ్లను ఎంపిక చేస్తామన్న బీసీసీఐ హ్యాండ్ ఇచ్చింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, మహ్మద్ సిరాజ్ లాంటి వాళ్ల విషయంలో ఐపీఎల్ ప్రదర్శనను పరిగణనలోకి తీసుకోని బోర్డు.. రింకూ సింగ్, బిష్ణోయ్ విషయంలో మాత్రం దాన్నే ప్రధానంగా తీసుకొని వరల్డ్ కప్‌కు సెలెక్ట్ చేయలేదు.
రవి బిష్ణోయ్‌కు బదులుగా యుజ్వేంద్ర చాహల్‌ను టీమ్‌లోకి తీసుకున్నారు. దీంతో నిరాశలో కూరుకుపోయిన యంగ్ స్పిన్నర్.. ఐపీఎల్ ముగిసిన వెంటనే సొంతూరికి వెళ్లిపోయాడు. బంధువులతో కలసి అక్కడ టైమ్ స్పెండ్ చేస్తున్నాడు. ఈ క్రమంలోనే మట్టి పొయ్యిని తయారు చేస్తూ ఓ ఫొటో దిగాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ బీసీసీఐ పాలిటిక్స్‌కు బిష్ణోయ్ బలిపశువుగా మారాడని కామెంట్స్ చేస్తున్నారు. బోర్డు చెత్త రాజకీయాల వల్ల అతడు ఇంటి దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. ఇలాంటి చెత్త నిర్ణయాల వల్లే భారత జట్టు ఐసీసీ ట్రోఫీలు నెగ్గడం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి.. బిష్ణోయ్ విషయంలో బీసీసీఐ వ్యవహరించిన తీరు మీద మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
This is Ravi Bishnoi who is supposed to play the T20 World Cup and is spending time in his village.
He worked two years for the T20 WC and he has the performance but still because of BCCI politics he has to sit in the home.And we say why we didn’t win the ICC trophy. pic.twitter.com/wqqXV7IkCQ
— Sujeet Suman (@sujeetsuman1991) May 30, 2024