Nidhan
టీ20 ప్రపంచ కప్-2024 కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది.
టీ20 ప్రపంచ కప్-2024 కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024 కోసం రోహిత్ సేన సన్నద్ధమవుతోంది. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించి కప్పును సొంతం చేసుకోవాలని చూస్తోంది. ఇప్పటికే అమెరికాకు చేరుకున్న మెన్ ఇన్ బ్లూ.. ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. కప్పు కోసం కసిగా సాధన చేస్తున్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వొద్దని భావిస్తున్నారు. తమ మీద అభిమానులు పెట్టుకున్న అంచనాలను అందుకోవాలని అనుకుంటున్నారు. ఈసారి భారత్ కప్పు నెగ్గుతుందని ఫ్యాన్సే కాదు.. క్రికెట్ ఎక్స్పర్ట్స్, లెజెండరీ ప్లేయర్స్ కూడా ప్రిడిక్షన్ చెబుతున్నారు. కప్పు కొట్టకుండా రోహిత్ సేనను ఎవరూ ఆపలేరని అంటున్నారు. అందుకు తగ్గట్లే టీమ్ కూడా చాలా స్ట్రాంగ్‌గా కనిపిస్తోంది. ప్రతి పొజిషన్‌కు జట్టులో ఒకటికి మించిన ఆప్షన్స్ ఉన్నాయి.
ఓపెనర్ల దగ్గర నుంచి బౌలర్ల వరకు ప్రతి స్థానానికి ఆప్షన్స్ ఉండటంతో తుది కూర్పు ఆసక్తికరంగా మారింది. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరికి చోటు దక్కుతుందనేది చెప్పలేని పరిస్థితి. ముఖ్యంగా ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, శివమ్ దూబె, రవీంద్ర జడేజా జట్టులో ఉన్నారు. ముగ్గురిలో ఏ ఇద్దరినో తీసుకోవాల్సి ఉంటుంది. పేస్ ఆల్‌రౌండర్లు ఇద్దరు కావాలనుకుంటే దూబె, పాండ్యాలు ఆడతారు. ఈ నేపథ్యంలో భారత దిగ్గజం సురేష్ రైనా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దూబేను బరిలోకి దించాల్సిందేనని పట్టుబట్టాడు. టీమిండియాకు అతడు ఎక్స్‌ఫ్యాక్టర్ అని చెప్పాడు. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కాదు.. ఈసారి వరల్డ్ కప్‌ను అందించేది దూబేనే అని విశ్వాసం వ్యక్తం చేశాడు.
‘వరల్డ్ కప్‌లో శివమ్ దూబేను తప్పకుండా ఆడించాలి. అలవోకగా భారీ సిక్సులు కొట్టే సామర్థ్యం ఉన్న ఇలాంటి ఆటగాళ్లు చాలా అరుదు. మెగా టోర్నీలో భారత జట్టుకు దూబె ఎక్స్‌ఫ్యాక్టర్ కాగలడు. కాబట్టి కెప్టెన్ రోహిత్ శర్మ అతడ్ని ప్లేయింగ్ ఎలెవన్‌లోకి తీసుకోవాలి. ఒకవేళ విరాట్ కోహ్లీని ఓపెనర్‌గా దింపాలనుకుంటే తప్పు లేదు. కానీ యంగ్ బ్యాటర్ యశస్వి జైస్వాల్ అదే పొజిషన్లో దుమ్మురేపుతున్నాడు. దూబేనైతే టీమ్‌లోకి తీసుకోవాల్సిందే. అతడు అవసరమైతే బాల్‌తోనూ మెరుపులు మెరిపించగలడు’ అని రైనా చెప్పుకొచ్చాడు. దూబేపై రైనా ఇంతగా విశ్వాసం వ్యక్తం చేయడానికి ఓ కారణం ఉంది. అదే ఐపీఎల్-2024లో అతడి పెర్ఫార్మెన్స్. ఈ సీజన్లో 162 స్ట్రైక్ రేట్‌తో 396 పరుగులు చేశాడు దూబె. ఈ మధ్య కాలంలో టీమిండియా తరఫున టీ20ల్లోనూ అదరగొడుతున్నాడు. అందుకే అతడ్ని జట్టులోకి తీసుకోవాలని రైనా అంటున్నాడు. మరి.. దూబేను టీమ్‌లోకి తీసుకోవాలనే వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
Suresh Raina ” Shivam Dube has to play in the World Cup.See,the ability to stand still while hitting those big sixes is very rare.He can be the x-factor to win the WC. So Rohit has to play Virat Kohli up the top,If the situation arises,Dube can also bowl”pic.twitter.com/zeDxuYP1xg
— Sujeet Suman (@sujeetsuman1991) May 31, 2024