Somesekhar
South Africa squad for T20I World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్. జట్టును విధ్వంసకర బ్యాటర్లతో పూర్తిగా నింపేసింది. మరి ప్రపంచ కప్ లో చోటు దక్కించుకున్న ఆ ప్లేయర్లు ఎవరు? చూద్దాం పదండి.
South Africa squad for T20I World Cup 2024: టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే జట్టును ప్రకటించింది సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్. జట్టును విధ్వంసకర బ్యాటర్లతో పూర్తిగా నింపేసింది. మరి ప్రపంచ కప్ లో చోటు దక్కించుకున్న ఆ ప్లేయర్లు ఎవరు? చూద్దాం పదండి.
Somesekhar
ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ జరుగుతున్నప్పటికీ.. అందరి దృష్టి మాత్రం టీ20 వరల్డ్ కప్ 2024పైనే ఉంది. 20 జట్లు పాల్గొనే ఈ మెగాటోర్నీ జూన్ 1 నుంచి ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో ఒక్కొక్క దేశం తమ జట్లను ప్రకటిస్తూ వస్తున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్, ఆస్ట్రేలియా వరల్డ్ కప్ లో పాల్గొనబోయే టీమ్స్ ను ప్రకటించాయి. ఇక తాజాగా సౌతాఫ్రికా సైతం పొట్టి ప్రపంచ కప్ బరిలోకి దిగే టీమ్ ను ప్రకటించింది. సీనియర్ కెప్టెన్ టెంబా బవుమాకు షాకిచ్చింది ప్రొటీస్ క్రికెట్ బోర్డ్. అతడి ప్లేస్ లో మార్క్రమ్ కు కెప్టెన్ పగ్గాలను అందించింది. ఇక ప్రోటీస్ ప్లేయర్లను చూస్తే ప్రత్యర్థికి వణుకు పుట్టాల్సిందే.
టీ20 వరల్డ్ కప్ లో పాల్గొనబోయే 15 మంది పేర్లను ప్రకటించింది సౌతాఫ్రికా టీమ్. శత్రుదుర్భ్యేద్యంగా ఉన్న ప్రోటీస్ టీమ్ ను చూస్తే.. ఈసారి కప్ వీళ్లదేనా? అనిపిస్తోంది. మరి జట్టులో ఎవరెవరు ఉన్నారు? వారి బలాలు ఏంటో ఓసారి పరిశీలిద్దాం. ఈ ప్రపంచ కప్ లో తొలిసారి ప్రోటీస్ టీమ్ ను ముందుండి నడిపించనున్నాడు ఐడెన్ మార్క్రమ్. అతడికి కెప్టెన్ గా టీ20ల్లో అపార అనుభవం ఉంది. అండర్ 19 వరల్డ్ కప్, SA20 లీగ్ 2023, SA20 2024 టైటిళ్లను సాధించిన ఘనత అతడి సొంతం. ఇది ఆ టీమ్ కు ఎంతో ఉపయోగపడుతుంది. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ సన్ రైజర్స్ కు ప్రాతినిథ్యం వహిస్తున్న మార్క్రమ్ నుంచి ఇప్పటి వరకు మ్యాచ్ విన్నింగ్ ఫర్ఫామెన్స్ రాలేదు.
ఇక జట్టులో మిగతా వారి విషయానికి వస్తే.. డీకాక్, హెండ్రిక్స్, క్లాసెన్, డేవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్, ర్యాన్ రికెల్టన్ లాంటి బ్యాటర్లతో ప్రత్యర్థికి దడపుట్టించేదిగా ఉంది. ఇక బౌలింగ్ విషయానికి వస్తే.. ఈ ఐపీఎల్ లో సత్తా చాటుతున్న కోయెట్జీ, జాన్సెన్, మహరాజ్, నోర్జ్టే, రబాడ, తంబ్రైజ్ షంషీ లతో పాటుగా కొత్త ఆటగాళ్లు బార్ట్ మన్, ఫోర్టూయిన్ లకు టీమ్ లో చోటు కల్పించారు. 31 ఏళ్ల బార్ట్ మన్ ఎకానమీ చూస్తే.. బ్యాటర్లకు కష్టాలు తప్పవనే చెప్పాలి. అయితే ఈ ప్రపంచ కప్ లో ఊహించని విధంగా టెంబా బవుమాకు చోటు కల్పించలేదు సౌతాఫ్రికా క్రికెట్ బోర్డ్. గత కొంత కాలంగా దారుణంగా విఫలం అవుతున్న బవుమాపై వేటు వేసింది. ఇక టీ20ల్లో చిచ్చరపిడుగులా చెలరేగే ట్రిస్టన్ స్టబ్స్ ఆ జట్టుకు కొండంత బలం. దీంతో పాటుగా ఈ ఐపీఎల్ లో మెరుపు ఇన్నింగ్స్ లతో దుమ్మురేపుతున్న క్లాసెన్ ప్రోటీస్ టీమ్ కు వెన్నముక. మరి ప్రత్యర్థులకు వణుకు పుట్టేలా ఉన్న సౌతాఫ్రికా టీమ్ ఈసారైనా కప్ కొడుతుందా? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
South Africa squad for the T20I World Cup 2024:
Markram (C), Baartman, Coetzee, De Kock, Bjorn Fortuin, Reeza Hendricks, Jansen, Klaasen, Maharaj, Miller, Nortje, Rabada, Ryan Rickelton, Shamsi, Stubbs pic.twitter.com/ogAWBlZXIM
— Johns. (@CricCrazyJohns) April 30, 2024