iDreamPost
android-app
ios-app

SA vs WI: ఉత్కంఠ పోరులో విండీస్ కు షాక్.. సెమీస్ కు సౌతాఫ్రికా!

  • Published Jun 24, 2024 | 12:06 PM Updated Updated Jun 24, 2024 | 12:06 PM

సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విండీస్ కు షాక్ ఇచ్చింది సఫారీ టీమ్. దాంతో సెమీస్ బెర్త్ ను ఖరారును చేసుకుంది.

సూపర్ 8 గ్రూప్ 2లో భాగంగా వెస్టిండీస్ వర్సెస్ సౌతాఫ్రికా జట్ల మధ్య జరిగిన ఉత్కంఠ పోరులో విండీస్ కు షాక్ ఇచ్చింది సఫారీ టీమ్. దాంతో సెమీస్ బెర్త్ ను ఖరారును చేసుకుంది.

SA vs WI: ఉత్కంఠ పోరులో విండీస్ కు షాక్.. సెమీస్ కు సౌతాఫ్రికా!

టీ20 వరల్డ్ కప్ 2024లో గ్రూప్ 2 నుంచి సెమీస్ కు చేరే జట్లు ఖరారు అయ్యాయి. ఇప్పటికే ఇంగ్లండ్ సెమీస్ బెర్త్ ను ఖరారు చేసుకోగా.. తాజాగా విండీస్ కు షాకిస్తూ.. సౌతాఫ్రికా కూడా నాకౌట్స్ కు చేరింది. అంటిగ్వా వేదికగా ఇరు జట్ల మధ్య జరిగిన ఈ పోరులో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయం సాధించింది. నరాలు తెగే ఉత్కంఠతతో జరిగిన ఈ కీలక పోరులో ప్రోటీస్ జట్టు ఆల్ రౌండ్ షోతో అదరగొట్టింది. దాంతో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన విండీస్ ఇంటికి వెళ్లక తప్పలేదు.

టీ20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కు ఊహించని షాక్ తగిలింది. టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన కరేబియన్ టీమ్ సెమీస్ కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. సూపర్ 8లో మూడు మ్యాచ్ లు ఆడిన విండీస్ ఒక్క మ్యాచ్ లోనే విజయం సాధించి.. రెండింట్లో ఓడిపోయింది. ఇక తాజాగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం 3 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ఇంతకు ముందు మ్యాచ్ ల్లో అదరగొట్టిన కరేబియన్ ప్లేయర్లు ఈ మ్యాచ్ లో బ్యాట్లు ఎత్తేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసింది. టీమ్ లో రోస్టన్ ఛేజ్(52), కైల్ మేయర్స్(35) పరుగులతో రాణించారు. సఫారీ బౌలర్లలో తంబ్రైజ్ షంషీ 3 వికెట్లతో రాణించాడు.

అనంతరం 136 పరుగుల మోస్తారు టార్గెట్ తో బరిలోకి దిగిన ప్రోటీస్ టీమ్ కు ఆండ్రీ రస్సెల్ ఊహించని షాకిచ్చాడు. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే ఓపెనర్లు క్వింటన్ డికాక్(12), హెండ్రిక్స్(0)లను ఔట్ చేశాడు. 15/2 వద్ద ఉన్నప్పుడు వర్షం మ్యాచ్ కు దాదాపు గంట అంతరాయం కలిగించింది. దాంతో కొద్దిసేపు చూసిన తర్వాత మ్యాచ్ ను 17 ఓవర్లకు కుదిస్తూ.. 123 రన్స్ టార్గెట్ గా నిర్ణయించారు. ఆ తర్వాత బ్యాటింగ్ ప్రారంభించిన సఫారీ టీమ్ పడుతూ.. లేస్తూ విజయం దిశగా సాగింది. వికెట్లు పడుతున్నా.. టార్గెట్ చిన్నది కావడంతో గట్టెక్కిందనే చెప్పాలి. చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయానికి 5 పరుగులు అవసరం కాగా.. మార్కో జాన్సన్ తొలి బంతికే సిక్సర్ బాది విజయాన్ని లాంఛనంగా పూర్తి చేశాడు. స్టబ్స్(29), క్లాసెన్(22).. చివర్లో జాన్సన్(21*) సూపర్ నాక్ తో జట్టును గెలిపించాడు. ఈ విజయంతో ప్రోటీస్ టీమ్ సెమీస్ కు దర్జాగా చేరింది.