iDreamPost

PAK vs USA: పాక్‌ ఓటమిపై అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌! మరీ అంత మాట అనేశాడేంటి?

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మాజీ క్రికెటర్లు అయితే.. తమ నోటికి పనిచెబుతూ.. తీవ్ర పదజాలతో విరుచుకుపడుతున్నారు. షోయబ్ అక్తర్ ఒక్కమాటలో పాక్ పరువు తీసేశాడు.

అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ ఓడిపోవడాన్ని ఆ దేశ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక మాజీ క్రికెటర్లు అయితే.. తమ నోటికి పనిచెబుతూ.. తీవ్ర పదజాలతో విరుచుకుపడుతున్నారు. షోయబ్ అక్తర్ ఒక్కమాటలో పాక్ పరువు తీసేశాడు.

PAK vs USA: పాక్‌ ఓటమిపై అక్తర్‌ షాకింగ్‌ కామెంట్స్‌! మరీ అంత మాట అనేశాడేంటి?

టీ20 ప్రపంచ కప్ 2024లో కనీవినీ ఎరగని సంచలనం నమోదు అయ్యింది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన పాక్ కు ఊహించని షాకిచ్చింది అమెరికా. క్రికెట్ లో ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న యూఎస్ఏ చేతిలో దారుణ ఓటమికి గురైంది. దాంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులతో పాటుగా పాకిస్తాన్ దిగ్గజాలు తీవ్ర పదజాలంతో విమర్శిస్తున్నారు. కొందరు బూతులు కూడా తిడున్నారు. ఇక పాక్ లెజెండ్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒకే ఒక్క మాటతో పాక్ క్రికెట్ టీమ్ పరువు మెుత్తం తీసేశాడు.

వరల్డ్ కప్ లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ కు గెలిచే అవకాశాలు ఉన్నప్పటికీ.. పాక్ తన చేతులారా ఓటమిని కొనితెచ్చుకుంది. ఇక ఈ పరాజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఆటగాళ్లను బండబూతులు తిడుతూ.. సోషల్ మీడియా వేదికగా పోస్ట్ లు పెడుతున్నారు. ఇక ఈ విషయంలో ఆటగాళ్లకు మద్ధతు పలకాల్సిన మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇక ఈ ఓటమిపై పాకిస్తాన్ లెజెండ్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒక్క మాటతో పాక్ పరువు తీసేశాడు.

“క్రికెట్ లో అనుభవం తక్కువ ఉన్నప్పటికీ.. ఈ మ్యాచ్ లో అమెరికా ఆటగాళ్లు అద్భుతమైన ఆటతీరును ప్రదర్శించారు. ఈ గెలుపునకు వారు పూర్తిగా అర్హులు.. పాకిస్తాన్ వాళ్లు అనర్హులు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ ఓటమితో పాకిస్తాన్ జట్టు 20 ఏళ్లు వెనక్కివెళ్లింది” అంటూ భావోద్వేగానికి గురైయ్యాడు. ఇక మరో దిగ్గజం వకార్ యూనిస్ మాట్లాడుతూ..”పాక్ టీమ్ గ్రౌండ్ లో నిస్సహయంగా, అలసిపోయినట్లు కనిపించింది. బహుశా కఠినమైన ఆర్మీ శిక్షణ తీసుకున్నందుకు ఇలా ఉన్నారేమో” ఎద్దేవ చేశాడు. ఇక పాక్ ఓడిపోవడంతో.. తనకు రాత్రంతా నిద్ర పట్టలేదని పాకిస్తాన్ క్రికెట్ బోర్డ్ మాజీ ఛైర్మన్ రమీజ్ రాజా చెప్పుకొచ్చాడు. మరి పాక్ ఓటమిపై ఆ టీమ్ దిగ్గజాలు స్పందించిన తీరుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి