ఆ ప్లేయర్ గురించి మాట్లాడే హక్కు నాకు లేదు.. దూబె ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె వరల్డ్ కప్​లో సత్తా చాటుతున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని ఈ విధ్వంసక బ్యాటర్.. మూడో మ్యాచ్​లో శివమెత్తాడు. యూఎస్​ బౌలర్లను వణికించాడు.

టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె వరల్డ్ కప్​లో సత్తా చాటుతున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని ఈ విధ్వంసక బ్యాటర్.. మూడో మ్యాచ్​లో శివమెత్తాడు. యూఎస్​ బౌలర్లను వణికించాడు.

టీ20 ప్రపంచ కప్​-2024లో అనుకున్నట్లే టీమిండియా అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ నుంచి తన సత్తా ఏంటో చూపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్​లో ఐర్లాండ్​ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్థాన్​తో పాటు డేంజరస్​గా మారిన అమెరికాను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8 దశకు క్వాలిఫై అయింది భారత్. గ్రూప్ దశలో భాగంగా కెనడాతో జరిగే ఆఖరి మ్యాచ్​లో ఘనవిజయం సాధించి అపోజిషన్ టీమ్స్​కు గట్టి వార్నింగ్ ఇవ్వాలని చూస్తోంది. బ్యాటింగ్​ యూనిట్ ఫామ్​లోకి రావడం, బౌలర్లు భీకరంగా బౌలింగ్ చేస్తుండటంతో టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోంది. ‌‌అయితే అంతా బాగానే ఉన్నా ఒక ప్లేయర్ విషయంలో మాత్రం అందరూ భయపడుతున్నారు. అతడి ఫామ్ ఇప్పుడు టీమ్​కు వర్రీగా మారింది.

టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్​ టీమిండియా మేనేజ్​మెంట్​ను టెన్షన్ పెడుతోంది. మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు కింగ్. గెలిపిస్తాడనుకున్నోడు ఇలా ఫెయిల్యూర్స్​తో టీమ్​కు భారంగా మారుతుండటంతో అభిమానులు కూడా కలవర పడుతున్నారు. ఈ విషయంపై పించ్ హిట్టర్ శివమ్ దూబేకు కూడా మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. విరాట్ ఫెయిల్యూర్ గురించి మీ రియాక్షన్ ఏంటని కొందరు రిపోర్టర్లు దూబేను అడిగారు. దీనికి అతడి నుంచి ఊహించని విధంగా ఆన్సర్ వచ్చింది. కోహ్లీ గురించి కామెంట్ చేయడానికి తాను ఎవరినంటూ దూబె రిప్లయ్ ఇచ్చాడు. కింగ్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదన్నాడు. అతడు సీనియర్ బ్యాటర్ అని.. తప్పక సత్తా చాటుతాడని చెప్పాడు.

‘విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటానికి నేనెవర్ని? గత మూడు మ్యాచుల్లోనూ అతడు పరుగులు చేయలేదు. అయినంత మాత్రాన విమర్శిస్తే ఎలా? నెక్స్ట్ మూడు మ్యాచుల్లో అతడు 3 సెంచరీలు బాదినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఫామ్ గురించి, అతడి బ్యాటింగ్ గురించి డిస్కస్ చేయనక్కర్లేదు. విరాట్ ఏంటనేది అందరికీ తెలుసు. అతడి ఆటతీరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతడు రిథమ్​లోకి వస్తే ఆపడం ఎవరి వల్ల కూడా కాదు’ అని దూబె స్పష్టం చేశాడు. మెగా టోర్నీలోని మొదటి రెండు మ్యాచుల్లో దూబె.. పాక్​ మీద 31 పరుగులతో సత్తా చాటాడు. ఈ విషయంపై అతడు స్పందిస్తూ.. తన మీద ఎలాంటి ప్రెజర్ లేదన్నాడు. మొదట్లో విఫలమైనా టీమ్ మేనేజ్​మెంట్ సపోర్ట్ చేసిందని, ప్లాన్స్​కు అనుగుణంగా ఆడుతున్నానని పేర్కొన్నాడు. ఇక్కడి పిచ్​లపై సిక్సులు కొట్టడం కష్టమని.. కానీ క్రీజులో కుదురుకున్నాక ఏదైనా సాధ్యమేనని తెలిపాడు. మరి.. కోహ్లీ గురించి మాట్లాడనంటూ దూబె చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments