Nidhan
టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె వరల్డ్ కప్‌లో సత్తా చాటుతున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని ఈ విధ్వంసక బ్యాటర్.. మూడో మ్యాచ్‌లో శివమెత్తాడు. యూఎస్ బౌలర్లను వణికించాడు.
టీమిండియా పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబె వరల్డ్ కప్‌లో సత్తా చాటుతున్నాడు. తొలి రెండు మ్యాచుల్లో పెద్దగా రాణించని ఈ విధ్వంసక బ్యాటర్.. మూడో మ్యాచ్‌లో శివమెత్తాడు. యూఎస్ బౌలర్లను వణికించాడు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో అనుకున్నట్లే టీమిండియా అదరగొడుతోంది. మొదటి మ్యాచ్ నుంచి తన సత్తా ఏంటో చూపిస్తోంది. ఫస్ట్ మ్యాచ్‌లో ఐర్లాండ్‌ను చిత్తు చేసిన రోహిత్ సేన.. ఆ తర్వాత దాయాది పాకిస్థాన్‌తో పాటు డేంజరస్‌గా మారిన అమెరికాను కూడా మట్టికరిపించింది. హ్యాట్రిక్ విజయాలతో సూపర్-8 దశకు క్వాలిఫై అయింది భారత్. గ్రూప్ దశలో భాగంగా కెనడాతో జరిగే ఆఖరి మ్యాచ్‌లో ఘనవిజయం సాధించి అపోజిషన్ టీమ్స్‌కు గట్టి వార్నింగ్ ఇవ్వాలని చూస్తోంది. బ్యాటింగ్ యూనిట్ ఫామ్‌లోకి రావడం, బౌలర్లు భీకరంగా బౌలింగ్ చేస్తుండటంతో టీమిండియా దుర్భేద్యంగా కనిపిస్తోంది. అయితే అంతా బాగానే ఉన్నా ఒక ప్లేయర్ విషయంలో మాత్రం అందరూ భయపడుతున్నారు. అతడి ఫామ్ ఇప్పుడు టీమ్‌కు వర్రీగా మారింది.
టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ టీమిండియా మేనేజ్మెంట్ను టెన్షన్ పెడుతోంది. మెగా టోర్నీలో ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి కేవలం 5 పరుగులే చేశాడు కింగ్. గెలిపిస్తాడనుకున్నోడు ఇలా ఫెయిల్యూర్స్‌తో టీమ్‌కు భారంగా మారుతుండటంతో అభిమానులు కూడా కలవర పడుతున్నారు. ఈ విషయంపై పించ్ హిట్టర్ శివమ్ దూబేకు కూడా మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది. విరాట్ ఫెయిల్యూర్ గురించి మీ రియాక్షన్ ఏంటని కొందరు రిపోర్టర్లు దూబేను అడిగారు. దీనికి అతడి నుంచి ఊహించని విధంగా ఆన్సర్ వచ్చింది. కోహ్లీ గురించి కామెంట్ చేయడానికి తాను ఎవరినంటూ దూబె రిప్లయ్ ఇచ్చాడు. కింగ్ గురించి మాట్లాడే అర్హత తనకు లేదన్నాడు. అతడు సీనియర్ బ్యాటర్ అని.. తప్పక సత్తా చాటుతాడని చెప్పాడు.
‘విరాట్ కోహ్లీ గురించి మాట్లాడటానికి నేనెవర్ని? గత మూడు మ్యాచుల్లోనూ అతడు పరుగులు చేయలేదు. అయినంత మాత్రాన విమర్శిస్తే ఎలా? నెక్స్ట్ మూడు మ్యాచుల్లో అతడు 3 సెంచరీలు బాదినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కోహ్లీ ఫామ్ గురించి, అతడి బ్యాటింగ్ గురించి డిస్కస్ చేయనక్కర్లేదు. విరాట్ ఏంటనేది అందరికీ తెలుసు. అతడి ఆటతీరు గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. అతడు రిథమ్‌లోకి వస్తే ఆపడం ఎవరి వల్ల కూడా కాదు’ అని దూబె స్పష్టం చేశాడు. మెగా టోర్నీలోని మొదటి రెండు మ్యాచుల్లో దూబె.. పాక్ మీద 31 పరుగులతో సత్తా చాటాడు. ఈ విషయంపై అతడు స్పందిస్తూ.. తన మీద ఎలాంటి ప్రెజర్ లేదన్నాడు. మొదట్లో విఫలమైనా టీమ్ మేనేజ్మెంట్ సపోర్ట్ చేసిందని, ప్లాన్స్‌కు అనుగుణంగా ఆడుతున్నానని పేర్కొన్నాడు. ఇక్కడి పిచ్‌లపై సిక్సులు కొట్టడం కష్టమని.. కానీ క్రీజులో కుదురుకున్నాక ఏదైనా సాధ్యమేనని తెలిపాడు. మరి.. కోహ్లీ గురించి మాట్లాడనంటూ దూబె చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Dube said “Who am I to talk about Kohli? If he hasn’t got runs in three games, he may well get three hundreds in the next three & there will be no more discussions. We all know his game and how he plays”. [Press] pic.twitter.com/Tp28nYxtkA
— Johns. (@CricCrazyJohns) June 14, 2024