iDreamPost
android-app
ios-app

ఈ రేంజ్​లో ఉన్నానంటే అతడే కారణం.. ఆ సాయాన్ని మర్చిపోలేను: దూబె

  • Published Jun 05, 2024 | 4:16 PM Updated Updated Jun 05, 2024 | 4:16 PM

టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె బిగ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్​లో దుమ్మురేపిన దూబె.. వరల్డ్ క్రికెట్​ మీద తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కప్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె బిగ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్​లో దుమ్మురేపిన దూబె.. వరల్డ్ క్రికెట్​ మీద తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. ప్రపంచ కప్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు.

  • Published Jun 05, 2024 | 4:16 PMUpdated Jun 05, 2024 | 4:16 PM
ఈ రేంజ్​లో ఉన్నానంటే అతడే కారణం.. ఆ సాయాన్ని మర్చిపోలేను: దూబె

టీమిండియా పేస్ ఆల్​రౌండర్ శివమ్ దూబె బిగ్ ఛాలెంజ్​కు రెడీ అవుతున్నాడు. ఐపీఎల్​-2024లో దుమ్మురేపిన దూబె.. వరల్డ్ క్రికెట్​ మీద తన ముద్ర వేసేందుకు సిద్ధమవుతున్నాడు. పొట్టి ప్రపంచ కప్​లో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మెగా టోర్నీకి వెళ్లే భారత జట్టులో అతడికి చోటు దక్కదని అంతా భావించారు. దీనికి కారణం రింకూ సింగ్ రూపంలో సాలిడ్ ఫినిషర్​ అందుబాటులో ఉండటమే. అయితే ఐపీఎల్​-2024లో రింకూకు సరైన అవకాశాలు రాకపోవడం, వచ్చిన అరకొర ఛాన్సుల్ని అతడు ఉపయోగించుకోకపోవడంతో దూబె వైపు మొగ్గు చూపారు సెలెక్టర్లు. క్యాష్​ రిచ్​ లీగ్​లో దూబె భారీ సిక్సులు బాదుతూ అందర్నీ ఆకట్టుకున్నాడు. పేస్ బౌలింగ్​తో వికెట్లు తీసే సత్తా కూడా ఉండటంతో అతడ్ని యూఎస్​ ఫ్లైట్ ఎక్కించింది బీసీసీఐ.

అమెరికా చేరుకున్న దూబె.. కొన్ని రోజులుగా తీవ్రంగా సాధన చేశాడు. బంగ్లాదేశ్​తో ప్రాక్టీస్ మ్యాచ్​లో బ్యాటింగ్​లో నిరాశపర్చినా.. బౌలింగ్​లో 2 వికెట్లతో సత్తా చాటాడు. ఇవాళ ఐర్లాండ్​తో జరిగే ఫస్ట్ మ్యాచ్​లో చెలరేగి ఆడాలని చూస్తున్నాడు దూబె. ఈ మ్యాచ్​కు ముందు అతడు ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత లెజెండ్, చెన్నై సూపర్​కింగ్స్ మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని సపోర్ట్ వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని తెలిపాడు. మాహీ భాయ్ చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేనని చెప్పాడు దూబె. ధోని నుంచి కాంప్లిమెంట్స్ వస్తే అంతకంటే ఆనందం ఏదీ ఉండదన్నాడు. అతడు మెచ్చుకుంటే కాన్ఫిడెన్స్​ నెక్స్ట్ లెవల్​కు చేరుకుంటుందని వ్యాఖ్యానించాడు. ధోని తనకు ఎంతో హెల్ప్ చేశాడని దూబె పేర్కొన్నాడు.

‘మాహీ భాయ్ నా కెరీర్​లో ఇంపార్టెంట్ రోల్ పోషించాడు. అతడో పెద్ద లెజెండ్. ధోని ప్రశంసిస్తే ఆటగాళ్ల కాన్ఫిడెన్స్​ మరింత పెరుగుతుంది. తాము అద్భుతాలు చేయగలమనే నమ్మకం వారిలో కలుగుతుంది. అతడు నాకు ఎంతో సాయం చేశాడు. అతడి గైడెన్స్, ఇచ్చిన సూచనలు నాకు ఎంతో ఉపయోగపడ్డాయి. నేను ఇంత బలంగా కమ్​బ్యాక్ ఇవ్వడంలో మాహీ భాయ్​ది కీలక పాత్ర. అతడు ఇచ్చే చిన్న చిన్న సలహాలు కూడా నేను క్రికెట్ ఆడే విధానాన్ని పూర్తిగా మార్చేశాయి’ అని దూబె చెప్పుకొచ్చాడు. తన బౌలింగ్ గురించి కూడా ఈ ఆల్​రౌండర్ మాట్లాడాడు. ఐపీఎల్​లో పెద్దగా బౌలింగ్ చేసే ఛాన్స్ రాలేదని.. అయితే ఒక్క ఓవర్ మాత్రమే వేసినా వికెట్ తీశాననే సంతృప్తి ఉందన్నాడు. బౌలింగ్​ను మరింత మెరుగుపర్చుకోమని కెప్టెన్ రోహిత్, కోచ్ ద్రవిడ్ సూచించారని తెలిపాడు. 2 నుంచి 3 ఓవర్లు వేయాల్సి ఉంటుందని అన్నారని.. అందుకే ఆ దిశగా కష్టపడుతున్నానని దూబె వివరించాడు. మరి.. మెగా టోర్నీలో దూబె భారత్​కు ఎంత కీలకంగా మారతాడని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.