Nidhan
టీ20 ప్రపంచ కప్-2024ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. గ్రూప్ దశ కంటే సూపర్-8 మ్యాచ్‌లు మరింత ఉత్కంఠగా సాగుతుండటంతో కళ్లు తిప్పుకోకుండా మ్యాచ్‌లు తిలకిస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్-2024ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు క్రికెట్ లవర్స్. గ్రూప్ దశ కంటే సూపర్-8 మ్యాచ్‌లు మరింత ఉత్కంఠగా సాగుతుండటంతో కళ్లు తిప్పుకోకుండా మ్యాచ్‌లు తిలకిస్తున్నారు.
Nidhan
టీ20 ప్రపంచ కప్-2024లో టీమిండియా హవా నడుస్తోంది. గ్రూప్ దశలో హ్యాట్రిక్ విజయాలతో అదరగొట్టిన భారత్.. అదే ఊపును సూపర్-8లోనూ కొనసాగిస్తోంది. ఆఫ్ఘానిస్థాన్‌తో నిన్న జరిగిన సూపర్ పోరులో రోహిత్ సేన 47 పరుగుల తేడాతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన మెన్ ఇన్ బ్లూ.. 8 వికెట్లకు 181 పరుగులు చేసింది. ఆ తర్వాత ఛేజింగ్‌కు దిగిన ఆఫ్ఘాన్ 134 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో మన జట్టు డామినేషన్ చూపించింది. భారత్ ముందు అపోజిషన్ టీమ్ నిలబడలేకపోయింది. అటు బ్యాటర్లు, ఇటు బౌలర్లు చెలరేగడంతో వార్ వన్ సైడ్ అయింది. ఈ విక్టరీతో సెమీస్ దిశగా టీమిండియా ఘనంగా అడుగులు వేసింది.
వరల్డ్ కప్‌లో భారత్ ఆటతీరును అందరూ ఎంజాయ్ చేస్తున్న సమయంలో వెటరన్ ఓపెనర్ శిఖర్ ధావన్ ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. ఆ ఓటమిని ఇంకా మర్చిపోలేకపోతున్నానని అన్నాడు. సాధారణంగా క్రికెటర్లు అనే కాదు.. ఏ ఆటగాడైనా గెలుపోటములను ఒకేలా తీసుకుంటాడు. విజయం వచ్చినప్పుడు కాస్త ఎక్కువ సెలబ్రేట్ చేసుకున్నా.. ఓడినా అంతే తేలిగ్గా తీసుకుంటాడు. అయితే కొన్ని ఓటములు మాత్రం ఎప్పటికీ వెంటాడుతుంటాయి. అలాంటి ఓ మ్యాచ్ గురించే తాజాగా ధావన్ ఎమోషనల్ అయ్యాడు. వన్డే వరల్డ్ కప్-2023 ఫైనల్లో భారత్ పరాభవాన్ని మర్చిపోలేకపోతున్నానని అతడు అన్నాడు. మగాళ్లు ఎంతటి బాధనైనా దిగమింగుకుంటారని, కానీ నవంబర్ 19 మిగిల్చిన విషాదాన్ని మాత్రం తట్టుకోలేడని చెప్పాడు ధావన్.
నెట్టింట ఓ విఫల ప్రేమికుడు పెట్టిన బిల్ బోర్డ్ వైరల్ అవుతోంది. దీన్ని చూసిన ధావన్.. పురుషులు ఎంతటి బాధనైనా తట్టుకుంటారని, కానీ నవంబర్ 19ని మాత్రం మర్చిపోలేరని చెప్పాడు. ఆ రోజు ఆస్ట్రేలియాతో జరిగిన ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో ఓడింది. ఓటమి అనేదే లేకుండా ఫైనల్ వరకు వచ్చిన మెన్ ఇన్ బ్లూ.. తుది మెట్టు మీద బోల్తా పడి కప్పును మిస్సైంది. దీంతో కోట్లాది మంది అభిమానుల హార్ట్ బ్రేక్ అయింది. దీన్నే తాజాగా మరోమారు నెమరువేసుకున్నాడు ధావన్. ఆ ఓటమిని మాత్రం మర్చిపోలేనని నెట్టింట పోస్ట్ పెట్టాడు. ఇది చూసిన ఫ్యాన్స్.. ఈ ఓటమితో పాటు టీ వరల్డ్ కప్-2019 సెమీస్‌లో న్యూజిలాండ్ చేతుల్లో పరాభవాన్ని కూడా గుర్తుచేస్తున్నారు. ధోని రనౌట్ కాకపోతే ఆ మ్యాచ్‌లో గెలిచేవాళ్లమని చెబుతున్నారు. మరి.. ధావన్ పోస్ట్‌పై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Men can get over anything, but not 19th November pic.twitter.com/KZRTsx8doe
— Shikhar Dhawan (@SDhawan25) June 21, 2024