SA vs WI: ఒళ్లుగగుర్పొడిచే సంఘటన.. దారుణంగా ఢీకొట్టుకున్న ప్లేయర్లు! వీడియో వైరల్..

సూపర్ 8లో భాగంగా తాజాగా జరిగిన వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. సిక్సర్ ను ఆపే ప్రయత్నంలో ఇద్దరు ప్లేయర్లు ఘోరంగా ఢీకొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సూపర్ 8లో భాగంగా తాజాగా జరిగిన వెస్టిండీస్-సౌతాఫ్రికా మ్యాచ్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన చోటుచేసుకుంది. సిక్సర్ ను ఆపే ప్రయత్నంలో ఇద్దరు ప్లేయర్లు ఘోరంగా ఢీకొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా సౌతాఫ్రికా వర్సెస్ వెస్టిండీస్ జట్ల మధ్య కీలకమైన మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ ఇరు జట్లకు చావోరేవో. ఇందులో గెలిచిన జట్టు సెమీస్ కు చేరుకుంటుంది. ఇలాంటి కీలక పోరులో ఓ ప్రమాదకర సంఘటన చోటుచేసుకుంది. సిక్సర్ ను క్యాచ్ గా అందుకోబోయే సమయంలో ఇద్దరు స్టార్ ప్లేయర్లు ఒకరిని ఒకరు ఘోరంగా ఢీకొట్టుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

సౌతాఫ్రికా-వెస్టిండీస్ మధ్య కీలకపోరు జరుగుతోంది. ఈ మ్యాచ్ లో గెలిచి సెమీస్ చేరుకోవాలని ఇరు జట్లు ఆరాటపడుతున్నాయి. కానీ వారి ఆరాటానికి వరుణుడు అడ్డుకట్ట వేశాడు. వర్షం కారణంగా మ్యాచ్ కు అంతరాయం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ఈ మ్యాచ్ లో ఒళ్లు గగుర్పొడిచే సంఘటన ఒకటి చోటుచేసుకుంది. ఇద్దరు ప్లేయర్లు దారుణంగా ఢీకొట్టుకున్నారు. అసలేం జరిగిందంటే? ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేయడానికి వచ్చాడు మార్క్రమ్. క్రీజ్ లో కైల్ మేయర్స్ ఉన్నాడు. ఈ ఓవర్లో 5వ బంతిని భారీ షాట్ కొట్టాడు మేయర్స్. ఇక ఆ బంతి సరాసరి స్టాండ్స్ వైపు వెళ్తోంది.

ఈ క్రమంలోనే సౌతాఫ్రికా ప్లేయర్లు కగిసో రబాడ, మార్కో జాన్సన్ ఆ బంతిని అందుకునే ప్రయత్నంలో దారుణంగా ఒకరిని ఒకరు ఢీకొట్టుకున్నారు. బంతినే చూస్తూ వచ్చిన ఇద్దరు ఒక్కసారిగా బలంగా ఢీకొట్టుకున్నారు. దాంతో వెంటనే ఫిజియో వచ్చి వారికి ప్రథమ చికిత్స అందించారు. ఈ ఊహించని ఘటనలో జాన్సన్ కు తీవ్రగాయాలు కాగా.. రబాడ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 135 పరుగులు మాత్రమే చేసింది. తంబ్రైజ్ షంషై 3 వికెట్లతో రాణించాడు. రోస్టన్ ఛేజ్ 52 పరుగులతో రాణించాడు. అనతరం 136 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన సౌతాఫ్రికాకు వరుణుడు అడ్డుతగిలాడు. 15/2(2 ఓవర్లు) దగ్గర ఉండగా వర్షం మెుదలైంది. దాంతో కాసేపు ఆటకు అంతరాయం కలిగింది. వర్షం కారణంగా సౌతాఫ్రికా టార్గెట్ ను 17 ఓవర్లలో 123 పరుగులుగా నిర్దేశించారు.

Show comments