iDreamPost
android-app
ios-app

Haris Rauf: హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ చేశాడు.. సంచలన ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్!

  • Published Jun 07, 2024 | 5:44 PM Updated Updated Jun 07, 2024 | 5:44 PM

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు అంటూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాక్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు అంటూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణలు చేశాడు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే..

Haris Rauf: హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ చేశాడు.. సంచలన ఆరోపణలు చేసిన మాజీ క్రికెటర్!

‘మూలిగే నక్కపై తాటి పండు పడ్డట్లుగా’ తయ్యారైంది పాకిస్తాన్ క్రికెట్ టీమ్ పరిస్థితి. టీ20 వరల్డ్ కప్ 2024లో పసికూన అమెరికా చేతిలో ఓడిపోయి అప్రతిష్టను మూటగట్టుకుంది పాక్. ఈ ఓటమిపై వరల్డ్ వైడ్ గా ఉన్న క్రికెట్ దిగ్గజాలు పాక్ ను ఏకిపారేస్తున్నారు. ఇప్పటికే తీవ్ర విమర్శలు, ట్రోలింగ్ ఎదుర్కొంటున్న పాకిస్తాన్ పై మరో బాంబు పడింది. అదేంటంటే? ఆ జట్టు స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు అంటూ సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ రస్టీ థెరాన్ సంచలన ఆరోపణలు చేశాడు.

టీ20 వరల్డ్ కప్ 2024 మెగాటోర్నీలో అమెరికా చేతిలో ఓడిపోయి సర్వత్రా తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది పాకిస్తాన్. ఈ బాధలో ఉన్న పాక్ కు మరో ఊహించని షాక్ తగిలింది. పెద్ద నింద ఆ జట్టు ఆటగాడిపై పడింది. అసలు విషయం ఏంటంటే? అమెరికాతో జరిగిన మ్యాచ్ లో పాకిస్తాన్ స్టార్ బౌలర్ హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు అని సౌతాఫ్రికా మాజీ ఫాస్ట్ బౌలర్ రస్టీ థెరాన్ ఆరోపించాడు. “2 ఓవర్లకు ముందు మార్చిన బాల్ ను మళ్లీ తీసుకొచ్చారు. పాక్ బాల్ టాంపరింగ్ కు పాల్పడకుండా అడ్డుకోవడానికి ఐసీసీ ఇలా చేసిందా? ఇక హారీస్ రౌఫ్ తన బొటనవేలి గోటితో బాల్ ను గీకుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. అతడు బాల్ టాంపరింగ్ కు చేశాడు అనడానికి ఇంతకన్నా ఆధారాలు ఏం కావాలి?” అంటూ సంచలన ఆరోపణలు చేశాడు రస్టీ థెరాన్. ఇతడు గతంలో సౌతాఫ్రికాతో పాటుగా యూఎస్ఏకు ప్రాతినిథ్యం వహించాడు.

ఇదిలా ఉండగా.. అమెరికాతో జరిగిన మ్యాచ్ లో 4 ఓవర్లు వేసిన రౌఫ్ 37 రన్స్ ఇచ్చి.. కేవలం ఒకే ఒక్క వికెట్ తీశాడు. ఈ మ్యాచ్ లో చివరి 5 ఓవర్లలో యూఎస్ఏ విజయానికి 45 పరుగులు అవసరం కాగా.. వరుస ఓవర్లలో షాదాబ్ 11, నసీమ్ షా 6, షాహీన్ అఫ్రిదీ 7 రన్స్ ఇచ్చారు. ఇక 19వ ఓవర్ వేసిన మహ్మద్ అమీర్ 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. చివరి ఓవర్లో అమెరికా విజయానికి 15 రన్స్ కావాల్సి ఉండగా.. హారీస్ రౌఫ్ 14 పరుగులు ఇచ్చుకున్నాడు. దాంతో మ్యాచ్ టై అయ్యి.. సూపర్ ఓవర్ కు దారితీసింది. ఇక సూపర్  ఓవర్లో యూఎస్ఏ 18 రన్స్ కొట్టగా.. పాక్ 13 రన్స్ కే పరిమితమై 5 రన్స్ తేడాతో ఓడిపోయింది. మరి హారీస్ రౌఫ్ బాల్ టాంపరింగ్ కు పాల్పడ్డాడు అన్న ఆరోపణలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.